Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

నీరో జగన్.. జనం అల్లాడుతుంటే.. విద్యుత్ కోతలా: చంద్రబాబు

కరెంట్ కోతలతో జనం అల్లాడుతుంటే జగన్ నీరో చక్రవర్తిలా ప్యాలస్ ఫీడేల్ వాయించుకుంటు కూర్చున్నారని టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ద్వజమెత్తారు.

అసలే వేసవి.. ఆపై ఉక్కపోత.. ఇంకేముంది.. పవర్ ఉండాల్సిందే. అవును.. ఓ 5 నిమిషాలు కరెంట్ కోత విధించిన భరించలేని పరిస్థితి.. మరీ కోతలు కంటిన్యూ అయితే చెప్పలేం.. అవును ఏపీలో కరెంట్ కోతలు తప్పడం లేదు. విద్యుత్ కోతలపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో స్పందించారు. ఆంధ్రప్రదేశ్ చీకట్లోకి వెళ్లిపోయిందని కామెంట్ చేశారు. తీవ్రమైన విద్యుత్ కోతలతో జనం నరకం చూస్తున్నారని తెలిపారు. అయినా ప్రభుత్వానికి పట్టదని అన్నారు.

గ్రామాల్లో అనధికార విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారని చంద్రబాబు వెల్లడించారు. విద్యుత్ సరఫరా లేక ప్రసూతి ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు పడుతున్న బాధలకు సీఎం జగన్ ఏం సమాధానం చెబుతారని చంద్రబాబు ప్రశ్నించారు. ఆనాడు మిగులు విద్యుత్‌తో వెలుగులు నిండిన మన రాష్ట్రంలో ఇప్పుడు కరెంట్ ఎందుకు పోతోందని నిలదీశారు. దీనికి సీఎం జగన్ సమాధానం చెప్పాల్సిందేనని స్పష్టంచేశారు.

రాష్ట్రంలో నేటి చీకట్లకు కారణం ఎవరు? అంటూ చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీగా పెరిగిన బిల్లులను ప్రజలు కిమ్మనకుండా కడుతున్నారని గుర్తుచేశారు. అయినా ఈ కోతలు ఎందుకుని మండిపడ్డారు. ఇదీ మంచి పద్దతి కాదని సూచించారు. ప్రజల ఓపికను పరీక్షించొద్దు అని కోరారు. ఇకనైనా తీరు మార్చుకోవాలని.. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందజేయాలని కోరారు.

గ్రామాల్లో ప్రజలు కరెంట్ లేక రోడ్లెక్కుతున్నారని చంద్రబాబు గుర్తుచేశారు. మరీ వలంటీర్లకు సన్మానం అంటూ రూ.233 కోట్లను తగలేస్తూ పండుగ చేసుకుంటున్నారని ఫైరయ్యారు. ఈ ముఖ్యమంత్రిని నీరో అనక ఇంకేమనాలి? అని ఆయన అడిగారు. విద్యుత్ కోతలను ప్రశ్నించిన సామాన్యులపై బెదిరింపులు మాని సమస్యను పరిష్కరించాలి చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజల సమస్యలు ప్రభుత్వానికి పట్టవా అని అడిగారు.

Related posts

పిల్లల కోసం పెళ్లికైనా, సహజీవనానికైనా రెడీ: కరాటే కల్యాణి

Drukpadam

హైద్రాబాద్ లో అక్రమంగా పొట్టేళ్ల పోటీలు

Drukpadam

ఏపీకి పాకిన హిజాబ్ వివాదం.. విజయవాడలో విద్యార్థినులను అనుమతించని లయోలా కాలేజీ.. 

Drukpadam

Leave a Comment