Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాజకీయాల్లో అహంకారం పనికి రాదు …ఆలోచనతోనే ముందుకు సాగాలి…మాజీ ఎంపీ పొంగులేటి!

రాజకీయాల్లో అహంకారం పనికి రాదుఆలోచనతోనే ముందుకు సాగాలిమాజీ ఎంపీ పొంగులేటి!
పార్టీ తన సేవలు వద్దని అనుకుంటే ఆలోచిస్తాకేటీఆర్ పై పూర్తీ నమ్మకం ఉంది
పోటీ ఖాయం ఎన్నికలు వచ్చిన వదిలే ప్రసక్తిలేదు
తాను రాజకీయాల్లో కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారు
ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే అడుగులు
రాజకీయాల్లో చిన్న చిన్న ఆటకంకాలు సహజం
వాటిని అధిగమించడం అలవాటు చేసుకోవాలి

రాజకీయాల్లో అహంకారం పనికి రాదని, ఆలోచనతోనే ముందుకు సాగాలని టీఆర్ యస్ కు చెందిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు .తన మాటలు అహంకార పూరితంగా ఉంటాయనే అభిప్రాయాల పై ఆయన స్పందించారు .  టీఆర్ యస్ లో తాను అసంతృప్తి తో ఉన్నానని ,తనకు పార్టీలో అన్యాయం జరిగిందని తమపార్టీలోకి రావాలని కొందరు అడుగుతున్న మాట నిజమేనని స్పష్టం చేశారు . తన మిత్రులు , శ్రేయోభిలాషులు కలిసి వివిధ అభిప్రాయాలు చెబుతుంటారని వారి అభిప్రాయాలు వినండం తప్ప తాను టీఆర్ యస్ పార్టీ నుంచి బయటకు వెళ్లాలని ఆలోచన హానెస్ట్ గా చెబుతున్న ఈ పొద్దువరకు చేయలేదని అన్నారు . తన రాజకీయ ప్రస్థానం పై అభిప్రాయాలను తనను కలిసిన విలేకర్లతో పంచుకున్నారు . రాజకీయాల్లో కొనసాగాలని అనుకుంటున్న తాను, పార్టీ తన సేవలు వద్దని అనుకుంటే అప్పుడు ఆలోచిస్తానని తప్ప , అప్పటివరకు వేరే ఆలోచనలేదని అన్నారు .పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పై తనకు ఉన్న నమ్మకాన్ని మరోసారి పునరుద్ఘాటించారు . తనకు కేటీఆర్ పై భరోసా ,విశ్వాసం ఉన్నాయని …ఈ రాష్ట్రానికి కేటీఆర్ లాంటి వ్యక్తి ఆలోచనలు అవసరమని అభిప్రాయపడుతున్నానని పేర్కొన్నారు .

అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎన్నికలు ,ఏ ఎన్నికలు వచ్చిన పోటీచేసేందుకు సిద్ధంగా ఉన్నానని ,ఎన్నికల్లో పోటీచేసేందుకు ప్రజల అభిమానం ,వారి అండదండలు అవసరమని అందుకు అనుగుణముగా తన కార్యాచరణ ఉంటుందని అన్నారు . టీఆర్ యస్ పార్టీ ఎక్కడ పోటీచేయమన్నా అందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు . ప్రజల అభిప్రాయం ప్రకారమే నడుచుకుంటానని ,అందుకు రాజకీయంగా ఎన్ని ఆటంకాలు ఎదురైనా భరించక తప్పదనే నిశ్చితమైన అభిప్రాయంతో ఉన్నట్లు చెప్పారు . రాజకీయాల్లో చిన్న చిన్న ఆటంకాలు సహజమని ఆటంకాలు లేకపోతె రాజకీయాలు ఎలా అవుతాయని ఆయన నవ్వుతు ప్రశ్నించారు. అన్నిటికి సిద్ధపడ్డ తర్వాతనే రాజకీయాల్లో కొనసాగేందుకు నిర్ణయించుకున్నానని అన్నారు . అందుకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా, అధిగమించి వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు . తన రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుంది ? పొంగులేటి అందులో చేరుతున్నారు …ఇందులో చేరుతున్నారని జరుగుతున్న ప్రచారం పుకార్లు మాత్రమేనని కొట్టిపారేశారు .నిజంగా ఇప్పటివరకు తాను ఎలాంటి ఆలోచన చేయలేదని నిజాయతీగా చెబుతున్నానని అన్నారు .

Related posts

ఇన్సాకోగ్’ అధిపతి పదవికి ప్రముఖ వైరాలజిస్టు షాహిద్ జమీల్ రాజీనామా…

Drukpadam

బెయిల్ రద్దవుతుందన్న భయంతోనే జగన్ ఢిల్లీ పరుగులు : యనమల…

Drukpadam

కామ్రేడ్స్ ఓట్ల కోసం మాజీ కామ్రేడ్స్ ప్రయత్నాలు …

Drukpadam

Leave a Comment