Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఆరాతీయడమే జర్నలిస్ట్ ల వృత్తి …ఆరాధించడం కాదు మంత్రి గారు ….

ఆరాతీయడమే జర్నలిస్ట్ వృత్తిఆరాధించడం కాదు మంత్రి గారు ….
మీరు ఆరాదించుకోండిజర్నలిస్టులను ఆరాదించామని చెప్పకండి
మంత్రి వేణుగోపాలకృష్ణ జర్నలిస్ట్ లకు సలహాలు
సీఎం జగన్ ను ఆరాధించాలన్న మంత్రి
ఇళ్ల స్థలాలు వస్తాయని వెల్లడి
ఆరా తీస్తే ఫలాలు అందుకోలేరని వ్యాఖ్యలు

జర్నలిస్టులు ఎప్పుడు ఎవరిని ఆరాధించరు …ఈ విషయం ఏపీ లో కొత్తగా సమాచార శాఖామంత్రిగా నియమితులైన వేణుగోపాలకృష్ణ తెలుసుకుంటే మంచిది …. ఆరాధించడం రాజకీయనాయకులపని ….ఆరాతీయటం జర్నలిస్టులు పని అనేది మంత్రిగారు గుర్తించుకుంటే మంచిది …మంచిని మంచి, చెడును చెడు అని చెప్పడం జర్నలిస్టుల వృత్తి ధర్మం …. అందుకు భిన్నం గా వ్యవరిస్తే అది వాడి కర్మ … అంతేగాని ఏవో కొన్ని ఆశచూపి ఆరాదించండని చెప్పడం సమాజానికి మంచిది కాదు సార్ … మీరు సమాచార ప్రసార శాఖామంత్రిగా భాద్యతలు తీసుకున్నందుకు సంతోషం ….మీ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయడం ద్వారా మళ్ళీ మళ్ళీ అధికారంలోకి రావాలనుకోవడంలో తప్పులేదు … మీరు అనుకూలంగా ఉండండి …ఆరాధించండి అందులో ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు …కానీ వ్యవస్థలను కూడా మీరు మీలాగానే ఉండాలని అనడం భావ్యం కాదు మంత్రిగారు …గతంలో కూడా అనేక ప్రభుత్వాలు జర్నలిస్టులకు మేలు చేశాయి .అంతమాత్రాన వాళ్ళు చేసే ప్రజా వ్యతిరేక చర్యలను జర్నలిస్టులు ఎప్పుడు సమర్థించలేదు … ఇప్పుడు అంతే…జర్నలిస్టులకు రాజకీయాలతో సంబంధంలేదు … వ్యక్తిగంగా ఎవరి అభిప్రాయాలు వారికీ ఉంటాయి. ప్రభుత్వం నుంచి ఎదో లబ్ది జరుగుతుందని ఆరాధించడం జరగదు గాక , జరగదనే సత్యాన్ని గుర్తించండి మంత్రిగారు …

మంత్రిగారు ఎమన్నారో చూద్దాం…

ఏపీలో తాజాగా మంత్రులుగా నియమితులైన వారు తమ చాంబర్లలోకి అడుగుపెట్టారు. బీసీ సంక్షేమం, సమాచార శాఖ, సినిమాటోగ్రఫీ అమాత్యునిగా చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కూడా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో సరదాగా ముచ్చటిస్తూ, పాత్రికేయులు సీఎం జగన్ ను మనస్ఫూర్తిగా ఆరాధించాలని సూచించారు. పాత్రికేయుల సమస్యలను సీఎం తప్పకుండా పరిష్కరిస్తారని పేర్కొన్నారు.

“ఆరాధించండి… మీకు ఇళ్ల స్థలాలు వస్తాయి. అంతేకానీ ఆరా తీయకండి… అలా చేస్తే సరైన ఫలితాలు రావు” అని వ్యాఖ్యానించారు. పాత్రికేయుల సమస్యల పట్ల తనకు స్పష్టమైన అవగాహన ఉందని, జర్నలిస్టుల సమస్యలను ఎప్పటికప్పుడు సీఎం జగన్ దృష్టికి తీసుకెళతానని మంత్రి వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. ఈ విషయంలో తాను నిబద్ధతతో వ్యవహరిస్తారని స్పష్టం చేశారు.

Related posts

రేవంత్ రెడ్డి క్యారెక్టర్ లేని మనిషి: ఏపీ మంత్రి బాలినేని!

Drukpadam

కేసీఆర్ కు మద్దతుగా నిలుద్దాం …ఉమ్మడి జిల్లాలో 10 సీట్లు గెలిపిద్దాం!

Drukpadam

రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ….?

Drukpadam

Leave a Comment