Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మం వస్తున్నకేటీఆర్ కు మా ఇంట్లో భోజనం ఏర్పాట్లు: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి!

ఖమ్మం వస్తున్నకేటీఆర్ కు మా ఇంట్లో భోజనం ఏర్పాట్లు: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి!
పార్టీ మార్పు అనేది పుకార్లు మాత్రమే
హానెస్ట్ గా చెబుతున్న పార్టీ మారాలని పొద్దు వరకు అనుకోలేదు
పొంగులేటి పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం
టీఆర్ఎస్ లోనే ఉంటానన్న పొంగులేటి
సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారుతున్నారని ఆయన బీజేపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని రేపో , మాపో బీజేపీలో చేరబోతున్నారని గత సంవత్సరకాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయన ఈ వార్తలను ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు .అయినప్పటికీ వార్తలు మాత్రం ఆగటంలేదు . ఎందుకు ఇలా జరుగుతుందని ఆయన్ను అడిగితె ఎవరో కొంతమందికి తాను టీఆర్ యస్ లో ఉండటం ఇష్టం లేక ఈ లాంటి వార్తలను సోషల్ మీడియా లో పోస్టులు పెట్టి ఆనందిస్తున్నారని అభిప్రాయపడ్డారు . హానెస్ట్ గా చెబుతున్నా తాను ఈ పొద్దువరకు పార్టీ మారాలనే ఆలోచన చేయలేదని ఆ అవసరం కూడా తనకు లేదని పేర్కొన్నారు . తనపై వస్తున్న వార్తలు వట్టి పుకార్లు మాత్రమే వాటిలో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేశారు . వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఖమ్మం వస్తున్న మంత్రి కేటీఆర్ తమ ఇంట్లో భోజనం ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.

తెలంగాణకు బీజేపీ అన్యాయం చేసిందని మండిపడ్డారు . వడ్లు కొనుగోలు విషయంలో బీజేపీ నాయకులు వరి వేసుకొమ్మని చెప్పిన తప్పుడు ప్రచారం వల్ల రైతులు వరి వేసుకుంటే పంట చేతికొచ్చినంక కొనకుండా మోసం చేశారని ధ్వజమెత్తారు .సీఎం కేసీఆర్ రైతులు నష్టపోకూడనే ఉద్దేశంతోనే ప్రతిగింజ కొనుగోలుకు ఆదేశాలు జారీచేసిన విషయాన్నీ గుర్తు చేశారు . బీజేపీ విధానాలు ఈ తీరుగా ఉంటె నేను బీజేపీ లో చేరుతున్నానని జరుగుతున్న ప్రచారం లో అర్థం లేదని అన్నారు . కొందరు వ్యక్తులు వారి ఇమేజ్ ను పెంచుకోవడం కోసం ఇలాంటి తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో పెడుతున్నారని మండిపడ్డారు. తాను ఎప్పటికీ టీఆర్ఎస్ లోనే ఉంటానని చెప్పారు.

టీఆర్ఎస్ పార్టీ మెడలు వంచామంటూ బీజేపీ నేతలు చెప్పుకుంటున్న మాటలను విని జనాలు నవ్వుకుంటున్నారని అన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలు అహంకారపూరితంగా ఉంటున్నాయని విమర్శించారు. రైతులకు అన్ని విధాలుగా న్యాయం చేస్తున్న పార్టీ టీఆర్ఎస్ మాత్రమేనని చెప్పారు. రైతుల నుంచి ప్రతి ఏటా టీఆర్ఎస్ ప్రభుత్వం ధాన్నాన్ని కొనుగోలు చేస్తుందని అన్నారు.

Related posts

నేడు, రేపు టీడీపీ మాక్ అసెంబ్లీ…

Drukpadam

ఏపీలో రాజకీయం చేస్తామన్న కేటీఆర్,…

Drukpadam

టీడీపీ నేత‌ దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు అరెస్ట్…

Drukpadam

Leave a Comment