Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

నెల్లూరు కోర్టులో చోరీ కేసులో నిందితుల గుర్తింపు… ఇద్ద‌రి అరెస్ట్‌!

నెల్లూరు కోర్టులో చోరీ కేసులో నిందితుల గుర్తింపు… ఇద్ద‌రి అరెస్ట్‌!

  • నెల్లూరు కోర్టులో డాక్యుమెంట్ల‌ను చోరీ చేసిన వైనం
  • కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు
  • ఐదుగురు నిందితుల్లో ఇద్ద‌రి అరెస్ట్‌
  • మిగిలిన ముగ్గురి కోసం పోలీసుల ముమ్మ‌ర వేట‌

ఏపీలో రాజ‌కీయ ప్ర‌కంప‌నల‌కు తెర తీసిన నెల్లూరు కోర్టులో డాక్యుమెంట్ల చోరీకి సంబంధించిన వ్య‌వ‌హారంలో పోలీసులు పురోగ‌తి సాధించారు. ఇప్ప‌టికే ఈ వ్య‌వ‌హారంపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు కూడా మొద‌లుపెట్టారు. ఈ క్ర‌మంలో కోర్టులో డాక్యుమెంట్ల చోరీకి పాల్ప‌డింది ఐదుగురు వ్యక్తుల‌ని పోలీసులు తేల్చారు.

నిందితులెవ‌ర‌న్న విష‌యంపై ఓ అవ‌గాహ‌న‌కు వ‌చ్చిన పోలీసులు మ‌రుక్ష‌ణ‌మే వారి కోసం వేట ప్రారంభించారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ఇద్ద‌రు నిందితులు పోలీసుల‌కు చిక్కారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు… మిగిలిన నిందితుల కోసం గాలింపును ముమ్మ‌రం చేశారు. ఈ కేసులో నిందితుల అరెస్ట్‌తో ఈ చోరీ వెనుక ఉన్న అసలు గుట్టు ఏమిట‌న్న‌ది తెలియ‌రానుంది.

నెల్లూరు కోర్టులో చోరీ వ్య‌వ‌హారంపై సోమిరెడ్డి స్పంద‌న 

somireddy responce to kakanis allegatgions
నెల్లూరులోని కోర్టులో చోరీ ఘ‌ట‌న ఏపీలో కలకలం రేపింది. ఈ ఘ‌ట‌న‌పై టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి కాసేప‌టి క్రితం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కోర్టులో డాక్యుమెంట్ల చోరీకి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు తెలుసుకునేందుకు న‌గ‌రంలోని చిన్న బ‌జార్ పోలీస్ స్టేష‌న్‌కు స్వ‌యంగా వెళ్లిన సోమిరెడ్డి.. అక్క‌డ పోలీసుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఆ త‌ర్వాత పోలీస్ స్టేష‌న్ వెలుప‌ల మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి ఆరోప‌ణ‌ల‌పై సోమిరెడ్డి స్పందించారు.

ఈ సంద‌ర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ .. “విదేశాల్లో నా కుటుంబానికి 1,000 కోట్లు ఉన్నాయ‌న్నారు. న‌కిలీ ప‌త్రాల‌తో నా ఇమేజీని దెబ్బ‌తీశారు. కాకాణిపై కేసును ప్ర‌భుత్వం ఉప‌సంహ‌రించుకుంది. అందుకు హైకోర్టు అనుమ‌తి ఉండాల‌ని జ‌డ్జి చెప్పారు. ఈ కేసులో మాకు న‌మ్మ‌కం ఉంది. నిందితుల‌కు శిక్ష ప‌డుతుంది” అని సోమిరెడ్డి అన్నారు.

Related posts

వివేకా రెండవ పెళ్లి గురించి ప్రస్తావించిన ఎంపీ అవినాష్

Drukpadam

బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చైనా జాతీయుడిని అదుపులోకి తీసుకున్న భారత భద్రతా బలగాలు!

Drukpadam

రూ.21 కోట్లు విలువ చేసే బంగారం పట్టివేత..

Drukpadam

Leave a Comment