Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

బీజేపీ కార్యకర్త సాయిగణేష్ ఆత్మహత్య..మంత్రి పువ్వాడ అజయ్ వేధింపులే కారణమని ఆరోపణలు!

బీజేపీ కార్యకర్త సాయిగణేష్ ఆత్మహత్య..మంత్రి పువ్వాడ అజయ్ వేధింపులే కారణమని ఆరోపణలు
అజయ్ ని 1 నిందితుడిగా చేర్చాలని బీజేపీ డిమాండ్
ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిపై బీజేపీ కార్యకర్తల దాడి అద్దాలు ఫర్నిచర్ ధ్వంసం
పరిస్థితి ఉద్రిక్తతపువ్వాడ ఫ్లెక్సీలకు నిప్పు
బీజేపీ కార్యకర్తలపై టీఆర్ యస్ కార్యకర్తల దాడి ..బీజేపీ కార్యకర్తకు గాయాలు
హైద్రాబాద్ నుంచి ఖమ్మం చేరుకున్న బీజేపీ నాయకులు
నా మనవణ్ణి పోలీసులు , పువ్వాడ అజయ్ కలిసి చంపారంటున్న సాయి గణేష్ అమ్మమ్మ

 

బీజేపీ యువకార్యకర్త , మజ్దూర్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సాయి గణేష్ ఆత్మహత్య ఖమ్మంలో ఉద్రిక్తతలకు దారితీసింది. సాయి గణేష్ ఆత్మహత్యకు మంత్రి అజయ్ వేధింపులే కారణమని బీజేపీ కార్యకర్తలు అజయ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు . పోలీసులను అడ్డం పెట్టుకొని మంత్రి అజయ్ ఖమ్మంలో ప్రజలను వేధిస్తున్నారని ,అజయ్ ఏది చెపితే అదే పోలీసులు చేస్తున్నారు తప్ప కనీస విచారణ కూడా జరపడం లేదని ఆరోపించారు. సాయి గణేష్ పై 16 కేసులు పెట్టించి వేధించడమే కాకుండా , రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం తో సాయి గణేష్ తట్టుకోలేక మందు తాగి ఆత్మహత్య కు పాల్పడ్డాడని ఆరోపిస్తున్నారు . అందువల్ల అజయ్ పై కేసు పెట్టాలని ఏ 1 గా ఆయన పేరు నమోదు చేయాలనీ బీజేపీ నాయకులు ప్రేమేందర్ రెడ్డి , దిలీప్ కుమార్ లు డిమాండ్ చేశారు . హైద్రాబాద్ నుంచి హుటా హుటిన ఖమ్మం చేరుకున్న వారు బీజేపీ స్థానిక నాయకులతో కలిసి ప్రభుత్వ ఆసుపత్రిలో సాయి గణేష్ భౌతిక ఖాయాన్ని సందర్శించారు . ఈ సందర్భంగా మీడియా తో వారు మాట్లాడాడు . మంత్రి అజయ్ ఆగడాలపై ధ్వజమెత్తారు . సాయి గణేష్ చేసిన నేరం ఏమిటని అన్ని కేసులు పెట్టి రౌడీ షీట్ ఎందుకు ఓపెన్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు .

చర్చ్ కాంపౌండ్ లో యేసు క్రీస్తు విగ్రహం పెట్టాలని మున్సిపల్ పాలకవర్గం నిర్ణయించింది. ఎక్కడాలేనిది ఒక మతానికి చెందిన విగ్రహాన్ని గూడలిలో ఏర్పాటు చేయడాన్ని బీజేపీ స్థానిక కార్యకర్తలు వ్యతిరేకించారు . అందులో సాయి గణేష్ ముఖ్యుడు. ఇక్కడ విగ్రహం పెట్టేందుకు స్థానిక ఎమ్మెల్యే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కారణమని బీజేపీ ఆరోపించింది. దీనిపై గత సంవత్సర కాలంగా బీజేపీ ఉద్యమం చేస్తుంది. అయితే బీజేపీ నేతలపై పోలీసులు పలు సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు . అందులో సాయి గణేష్ పై 16 కేసులు పెట్టడమే కాకుండా రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారు . దీనిపై ఆయన పోలీసులను ఎన్నిసార్లు కలిసి మొత్తుకున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో మస్తాపం చెందిన సాయి గణేష్ పురుగులమందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు . పరిస్థితి విషమించడంతో ఖమ్మం నుంచి హైద్రాబాద్ తరలించారు . అయినప్పటికీ చికిత్స పొందుతూ సాయి గణేష్ మరణించారు .

సాయి గణేష్ మరణించారన్న వార్త ఖమ్మంలో ఉద్రిక్తతలకు దారితీసింది. కోపోద్రిక్తుతులైన బీజేపీ కార్యకర్తలు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిపై దాడి చేసి ఆసుపత్రి అద్దాలను ధ్వంసం చేశారు . ఫర్నిచర్ విరగ్గొట్టారు . మమతా ఆసుపత్రి రోడ్ లో గల మంత్రి అజయ్ ఫ్లెక్సీలు నిప్పు పెట్టారు . అజయ్ కు , టీఆర్ యస్ కు వ్యతిరేకంగా డౌన్ ,డౌన్ అంటూ నినాదాలు ఇచ్చారు . మమతా రోడ్ లో బీజేపీ కార్యకర్తలపై టీఆర్ యస్ కార్యకర్తలు దాడి చేశారు . ఈ దాడిలో బీజేపీ కార్యకర్తకు గాయాలయ్యాయి. పోలీసులు జోక్యం చేసుకొని పరస్పరం దాడులు చేసుకుంటున్న ఇరు పార్టీల కార్యకర్తలను చెదర గొట్టారు .

సాయి గణేష్ భౌతిక కాయం ఊరేగింపుకు అనుమతి నిరాకరణ

పోస్ట్ మార్టం అనంతరం సాయి గణేష్ భౌతిక కాయం ఊరేగింపుగా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఇంటికి అక్కడ నుంచి కాల్వ ఒడ్డులోన శ్మశాన వాటికకు తీసుకోని వెళ్లాలని బీజేపీ నిర్ణయించగా అందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు.

బీజేపీ కార్యకర్త ఆత్మహత్యకు మంత్రి అజయ్ భాద్యత వహించాలి :బండి సంజయ్

ఖమ్మం లో బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య కు మంత్రి పువ్వాడ అజయ్ భాద్యత వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు . దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపించి మంత్రితోపాటు బాద్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు .

నా మనవణ్ణి పోలీసులు , పువ్వాడ అజయ్ కలిసి చంపారంటున్న సాయి గణేష్ అమ్మమ్మ

నా మనవణ్ణి పోలీసులు , పువ్వాడ అజయ్ కలిసి చంపారని సాయి గణేష్ అమ్మమ్మ ఆరోపిస్తున్నారు . మరికొన్ని రోజుల్లో పెళ్లి ఉందని ఆమె బోరున విలపిస్తున్నారు . తల్లిదండ్రులు లేని సాయి గణేష్ నాదగ్గరే పెరిగి పెద్ద వాడు అయ్యాడని ,తాను వాడికోసమే బతుకు తున్నానని ఇప్పడు తనకు ఎవరు దిక్కు లేనందున తనను కూడా చంపి వేయాలని రోదిస్తున్నారు .

 

Related posts

కుమారుడిని హతమార్చిన నిందితుడిని కాపుకాసి చంపేసిన తల్లిదండ్రులు!

Drukpadam

వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిపై కిడ్నాప్ కేసు నమోదు!

Drukpadam

ఆటోలోంచి కిందపడిన రూ. 500 నోట్లు.. పట్టనట్టు వెళ్లిపోయిన వైనం!

Drukpadam

Leave a Comment