Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

స‌హ‌నం కోల్పోయి కార్య‌క‌ర్త‌పై చేయి చేసుకున్న సీనియర్ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు!

స‌హ‌నం కోల్పోయి కార్య‌క‌ర్త‌పై చేయి చేసుకున్న సీనియర్ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు!
-మంత్రి అయ్యాక తొలిసారి శ్రీకాకుళానికి ధ‌ర్మాన‌
-భారీ ఎత్తున స్వాగ‌తం ప‌లికిన వైసీపీ శ్రేణులు
-మంత్రి చేయిని ప‌ట్టి గ‌ట్టిగా లాగిన కార్య‌క‌ర్త‌
-చేయి విదిలించుకుని కార్య‌క‌ర్త‌పై చేయి చేసుకున్న మంత్రి

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొత్త కేబినెట్‌లో రెవెన్యూ శాఖ మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన ధ‌ర్మాన ప్ర‌సాద‌రావుకు సౌమ్ముడిగా పేరుంది. అయితే అంత‌టి సౌమ్యుడు కూడా తాజాగా స‌హ‌నం కోల్పోయి త‌న‌కు స్వాగ‌తం చెప్పేందుకు వ‌చ్చిన ఓ కార్య‌క‌ర్త‌పై చేయి చేసుకున్నారు. కెమెరా కంటికి చాలా స్ప‌ష్టంగానే చిక్కిన ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిపోయింది.

ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళితే.. ఇటీవ‌లే ఏపీ మంత్రిగా ప్ర‌మాణం చేసిన ధ‌ర్మాన.. కొత్త‌గా మంత్రి ప‌ద‌వి చేపట్టిన త‌ర్వాత శ‌నివారం తొలిసారి త‌న సొంత జిల్లా శ్రీకాకుళంకు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా వైసీపీ శ్రేణులు ఆయ‌న‌కు పెద్ద ఎత్తున స్వాగ‌త కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశాయి. ఈ క్ర‌మంలో ఆయ‌న‌తో క‌ర‌చాల‌నం చేసేందుకు కార్య‌క‌ర్త‌లు ఎగ‌బ‌డ‌గా… ఓ కార్య‌క‌ర్త మంత్రి చేయిని గ‌ట్టిగా లాగార‌ట‌. దాంతో.. స‌హ‌నం కోల్పోయిన మంత్రి ధ‌ర్మాన ఆ కార్య‌క‌ర్త నుంచి చేయిని విదిలించుకుని అత‌డిపై చేయి చేసుకున్నారు.

Related posts

జ‌మిలి ఎన్నిక‌ల అంశం లా క‌మిష‌న్ ప‌రిశీల‌న‌లో ఉంది: కేంద్ర ప్ర‌భుత్వం!

Drukpadam

చర్చల ద్వారానే ఉద్యోగుల సమస్యలు పరిస్కారం …మంత్రులు బొత్స ,బాలినేని!

Drukpadam

శివసేన ఎవరిదీ …. థాకరేదా ….? షిండేదా ….??

Drukpadam

Leave a Comment