Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పంజాబ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి సజీవ దహనం!

పంజాబ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి సజీవ దహనం!

  • లుథియానాలోని తాజ్‌పూర్‌ రోడ్డులో అగ్ని ప్ర‌మాదం
  • గుడిసెలో కుటుంబ స‌భ్యులు నిద్రిస్తుండగా మంట‌లు
  • మృతుల్లో దంప‌తులు, వారి ఐదుగురు పిల్ల‌లు

పంజాబ్‌లో తీవ్ర విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ రోజు తెల్ల‌వారుజామున లుథియానాలోని తాజ్‌పూర్‌ రోడ్డులోని ఓ గుడిసెలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుని దంపతులు సహా ఐదుగురు చిన్నారులు సజీవ ద‌హ‌న‌మ‌య్యారు. వారంతా నిద్రిస్తుండగా మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. మృతుల్లో దంప‌తులు, వారి నలుగురు కుమార్తెలు, కుమారుడు (1) ఉన్నార‌ని చెప్పారు.

ఆ స‌మ‌యంలో వేరే ప్రాంతంలో వీరి మరో కుమారుడు రాజేశ్‌(17) నిద్రించ‌డంతో అత‌డు ఒక్కడే ఆ కుటుంబంలో ప్రాణాలతో మిగిలాడ‌ని వివ‌రించారు. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకు అగ్ని ప్ర‌మాదంపై సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకునేలోపే ఆ కుటుంబ స‌భ్యులు మృతి చెందార‌ని అన్నారు. అగ్ని ప్ర‌మాదం ఎలా చోటు చేసుకుంద‌న్న విష‌యంపై పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.

Related posts

బీజేపీ నేతలు కలలు కంటున్నారు.. మరో 20 ఏళ్లు కేసీఆరే సీఎం!: గుత్తా సుఖేందర్ రెడ్డి!

Drukpadam

చంద్రబాబుకు మద్దతుగా రేపు హైదరాబాద్‌లో వినూత్న నిరసన.. ‘లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్’

Ram Narayana

శర్వానంద్ మాకు మరో రామ్ చరణ్ లాంటివాడు: చిరంజీవి

Drukpadam

Leave a Comment