Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఏపీ లో అభివృద్ధి లేదన్న కేటీఆర్ …వచ్చి కళ్లారా చూసి మాట్లాడాలన్న మంత్రి జోగిరమేష్!

ఏపీ లో అభివృద్ధి లేదన్న కేటీఆర్ …వచ్చి కళ్లారా చూసి మాట్లాడాలన్న మంత్రి జోగిరమేష్!
-ఏపీలో కరెంట్, నీళ్లు లేవు.. రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయ తీవ్ర విమర్శలు
-ఏపీ పరిస్థితుల గురించి తన మిత్రులు చెప్పారన్న కేటీఆర్
-ఏపీలో ఉంటే నరకంలో ఉన్నట్టుందని అన్నారని వ్యాఖ్య
-దేశంలోనే హైదరాబాద్ బెస్ట్ సిటీ అన్న మంత్రి

ఏపీ లో అభివృద్ధిలేదని అక్కడ నీళ్లు కరంట్ లేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ హైద్రాబాద్ లో జరిగిన ఒక సమావేశంలో అన్న మాటలు రాజకీయ దుమారాన్ని లేపోయాయి. నిన్నమొన్నటివరకు జగన్, కేసీఆర్ కు మధ్య సఖ్యత ఉందని భావించిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు కేటీఆర్ మాటలతో అలంటి ఏమి లేదని తేలిపోయింది. అసలు కేటీఆర్ ఏపీ ప్రస్తావన ఎందుకు తెచ్చారు . అక్కడ అభివృద్ధి లేదని ఎందుకన్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఏపీ గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రేమేష్ సీరియస్ గా స్పందించారు . ఏపీ అభివృద్ధి గురించి మాట్లాడే ముందు ఇక్కడకు చూసి మాట్లాడాలని హితవు పలికారు . హైద్రాబాద్ కు కల్చర్ నేర్పింది తామేనని విజయవాడ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు . తమ రాష్ట్ర గురించి చెప్పుకుంటే అభ్యంతరం లేదుగాని పక్క రాష్ట్రం గురించి మాట్లాడటం పై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీ లో ఉంటె నరకం లో ఉన్నట్లేనని కూడా కేటీఆర్ అనడంపై వైసీపీ భగ్గుమంటుంది.

ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ లేదు, నీళ్లు లేవని విమర్శించారు. ఏపీలోని రోడ్లన్నీ అధ్వాన్నంగా ఉన్నాయని అన్నారు. ఏపీలోని సొంతూళ్లకు వెళ్లొచ్చిన తన మిత్రులు ఈ విషయాన్ని తనతో చెప్పారని… ఏపీలో ఉంటే నరకంలో ఉన్నట్టు ఉందంటున్నారని వ్యాఖ్యానించారు. బెంగళూరులోని కంపెనీలు కూడా ఏపీలోని అధ్యాన్నపు రోడ్ల గురించి మాట్లాడుతున్నాయని అన్నారు.

తెలంగాణ చాలా ప్రశాంతమైన రాష్ట్రమని… దేశంలోనే హైదరాబాద్ బెస్ట్ సిటీ అని చెప్పారు. తెలంగాణలో అభివృద్ధి ఎలా ఉందో ఏపీ ప్రజలకు అర్థమైందని తెలిపారు. నగరాల్లో మౌలిక సదుపాయాలను ఎప్పటికప్పుడు అభివృద్ధి చేయకపోతే వెనుకపడిపోతామని అన్నారు. ఏపీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపే అవకాశం ఉంది. క్రెడాయ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కేటీఆర్​.. రా.. వచ్చి కళ్లారా ఏపీ అభివృద్ధి గురించి తెలుసుకో.. ఏపీ మంత్రి జోగి రమేశ్​ ఫైర్​

తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి జోగి రమేశ్ మండిపడ్డారు. ఇవాళ హైదరాబాద్ లో నిర్వహించిన క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవం సందర్భంగా ఏపీపై కేటీఆర్ విమర్శలు చేశారు. కరెంట్ సరిగ్గా లేదని, నీళ్లు కూడా లేవని, అభివృద్ధి జరగడం లేదని తన మిత్రులు చెప్పారంటూ వ్యాఖ్యానించారు.

దీనిపై స్పందించిన జోగి రమేశ్.. ఏపీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, జరిగిన అభివృద్ధి ఏంటో కళ్లారా చూసి తెలుసుకోవాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు. ఏపీ అభివృద్ధిని చూసి ఓర్వలేకే కేటీఆర్ అలాంటి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ లాగానే కేటీఆర్ కూడా కాకమ్మ, పిట్ట కథలు చెబుతున్నారని విమర్శించారు. విజయవాడ వచ్చి చూస్తే అభివృద్ధి అంటే ఏంటో తెలుస్తుందన్నారు. ఏపీ అభివృద్ధిని చూసేందుకు అందరినీ ఆహ్వానిస్తున్నానంటూ చెప్పారు. వాలంటీర్లతో గడపగడపకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. ఏపీలో తాగు, సాగు నీటి సమస్య లేనే లేదన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం విరాజిల్లుతోందన్నారు.

‘‘ఏపీకి వస్తే అమ్మ ఒడి కనిపిస్తుంది. ఏపీకి వస్తే ఆసరా కనిపిస్తుంది. 31 లక్షల మందికి ఇళ్లు కట్టించే పట్టణాల నిర్మాణం కనిపిస్తుంది. ప్రతి గ్రామంలో సచివాలయం కనిపిస్తుంది. డిజిటల్ లైబ్రరీ కనిపిస్తుంది. సచివాలయ వ్యవస్థ బాగుందని తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా మెచ్చుకున్నారు. అక్కడా సచివాలయ వ్యవస్థను పెడతామన్నారు. దేశంలోని ఏ సీఎం కూడా చేయని అభివృద్ధి పనులను జగన్ చేశారు. అన్ని రాష్ట్రాల సీఎంలు జగన్ లా అభివృద్ధి పనులను చేయాలనుకుంటున్నారు. మేం కేబినెట్ లోనూ సామాజిక న్యాయం పాటించాం. ఏపీలో జరిగినట్టు సామాజిక న్యాయం జరగాలని కోరుకుంటున్నారు.

మళ్లీ ఉమ్మడి రాష్ట్రం కోరుకునే రోజులొస్తాయి
హైదరాబాద్​ కు కల్చర్​ నేర్పిందే కోస్తా ఆంధ్ర.. కేటీఆర్​ కు మల్లాది విష్ణు కౌంటర్​
తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధి జరిగింది ఏపీ వల్లే
హైదరాబాద్ ను చూసి మురిసిపోతున్నారని మండిపాటు

అభివృద్ధి అంటే ఏంటో విజయవాడ వచ్చి చూస్తే తెలుస్తుందని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. కోస్తా ఆంధ్ర ప్రజలు వెళ్లి తెలంగాణ, హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టే అక్కడ అభివృద్ధి జరిగిందని మల్లాది విష్ణు అన్నారు. తెలంగాణకు కల్చర్ నేర్పి.. డబ్బులు పెట్టుబడి పెట్టినందువల్లే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందిందన్నారు. అయితే, కొందరి రెండు కళ్ల సిద్ధాంతం మూలంగా రాష్ట్రాన్ని విడగొట్టాల్సి వచ్చిందన్నారు.

తమ ప్రభుత్వానికి వచ్చినన్ని అవార్డులు తెలంగాణ ప్రభుత్వానికి వచ్చాయా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ ను చూసి మురిసిపోతున్నారని, అది సరైన పద్ధతి కాదని కేటీఆర్ కు చురకలంటించారు. ఇలాగే మాట్లాడితే మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్న విషయాన్ని కేటీఆర్ గుర్తుపెట్టుకోవాలన్నారు.

Related posts

జగన్ ఢిల్లీ పర్యటనలో అనూహ్య మార్పు.. నిర్మలా సీతారామన్ తో భేటీ!

Drukpadam

చిక్కుల్లో సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి.. బీజేపీ ఎంపీపై ప‌రువు న‌ష్టం దావా!

Drukpadam

కత్తి మహేశ్ మృతదేహాన్ని స్వస్థలానికి తరలించిన కుటుంబ సభ్యులు

Drukpadam

Leave a Comment