Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మోడీ గారు దయచేసి ప్రచారం చేయండి ప్లీజ్… డీఎంకే అభ్యర్థుల అభ్యర్థన

DMK candidates wants PM Modi should campaign for their rivals

మోడీ గారు దయచేసి  మా నియోజకవర్గాలలో ప్రచారం చేయండి …
-ప్రధాని మోడీకి డీఎంకే అభ్యర్థుల  రిక్వెస్ట్
-మోదీ తమ ప్రత్యర్థులకు ప్రచారం చేయాలంటున్న డీఎంకే నేతలు
-సోషల్ మీడియా ద్వారా మోడీకి పిలుపు
-ప్రధాని ప్రచారం చేస్తే తమ మెజార్టీ పెరుగుతుందని డీఎంకే నేతల విశ్వాసం
ఈ నెల 6 న జరగనున్నతమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం హోరాహోరీగా సాగుతుంది . ఈసారి గెలుపు ఎవరిని వరిస్తుందన్నది చెప్పడం రాజకీయ విశ్లేషకులకు కూడా కాస్త కష్టంగానే ఉంది. ఎలాగైనా ఈసారి కూడా అన్నా డీఎంకే ను అధికారంలోకి తెచ్చేందుకు బీజేపీ నేతలు అందునా ప్రధాని ,నరేంద్రమోడీ . హోమ్ మంత్రి అమిత్ షా లు విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ప్రధాని మోడీ సభలు బీజేపీకి , అన్నా డీఎంకే కు మేలు చేయాలి కానీ విచిత్రంగా డీఎంకే అభ్యర్థులు మోడీ ప్రకారం తమకు ఉపయోగ పడుతుందని ఆయన మానియోజకర్గంలో తమకు వ్యతిరేకంగా ప్రచారం చేయాలంటే తమ నియోజకవర్గంలో చేయాలనీ కోరుతున్నారు. విచిత్రంగా వుందికదూ. అయినా ఇది నిజమే .
దక్షిణాది రాష్ట్రాల్లో చొచ్చుకు వెళ్లేందుకు బీజేపీ బలంగా యత్నిస్తుండడం, కమల్ హాసన్ మక్కళ్ నీది మయ్యం పార్టీ అసెంబ్లీ ఎన్నికల బరిలో తొలిసారిగా దిగుతుండడం తమిళనాడు రాజకీయాలపై ప్రభావం చూపుతాయని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆ విషయం అటుంచితే ఎవరికి వారే ప్రచారాన్ని తీవ్రస్థాయిలో ముందుకు తీసుకెళుతున్నారు. అయితే, డీఎంకే అభ్యర్థులు సోషల్ మీడియా ద్వారా ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తులు చేస్తుండడం ఆసక్తి కలిగిస్తోంది.

అదేంటంటే… అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమ ప్రత్యర్థుల తరఫున ప్రచారానికి రావాలంటూ వారు మోదీని కోరుతున్నారు. బీజేపీ లేక, అన్నాడీఎంకే అభ్యర్థుల తరఫున మోదీ ప్రచారానికి వస్తే, తమ ఇమేజ్ మరింత పెరిగిపోతుందన్నది డీఎంకే అభ్యర్థుల భావన. మోదీ ప్రచారం చేసిన నియోజకవర్గం కాబట్టి తమ గెలుపు సులువు అవుతుందని వారు నమ్ముతున్నారు . ఈ మేరకు కుంభమ్ నియోజకవర్గం బరిలో ఉన్న డీఎంకే అభ్యర్థి ఎన్.రామకృష్ణన్ ట్విట్టర్ లో ప్రధాని మోదీని అర్థించారు. డీఎంకే సీనియర్ నేత, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఈవీ వేలు, సెల్వరాజ్, తదంగం పి సుబ్రమణి, అనితా రాధాకృష్ణన్, అంబేత్ కుమార్ తదితరులు కూడా ఇదే తరహాలో మోదీని కోరడం విశేషం.

కార్తికేయ శివసేనాపతి అనే డీఎంకే అభ్యర్థి కూడా… తన ప్రత్యర్థి, తమిళనాడు మంత్రి ఎస్పీ వేలుమణి తరఫున ప్రచారం చేయాలంటూ ప్రధాని మోదీని ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం నాడు తమిళనాడులోని మధురై, కన్యాకుమారి ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తమిళనాడులో ఏప్రిల్ 6న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

Related posts

2024 లోక్ సభ ఎన్నికలలో టీఎంసీ ఒంటరిగానే పోటీ:మమతా బెనర్జీ సంచలన ప్రకటన!

Drukpadam

హైదరాబాద్ లోని షర్మిల ఇంటి ముందు ఏపీ రైతుల మెరుపు ధర్నా…

Drukpadam

తీన్మార్ మల్లన్న కష్టాలపై కేంద్ర హోమ్ మంత్రిని కలిసి ఫిర్యాదు చేసిన ఆయన భార్య !

Drukpadam

Leave a Comment