Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అప్ప‌ట్లో సైకిల్‌పై తిరుగుతూ పాలు, పూలు అమ్మాను: మంత్రి మ‌ల్లారెడ్డి!

అప్ప‌ట్లో సైకిల్‌పై తిరుగుతూ పాలు, పూలు అమ్మాను: మంత్రి మ‌ల్లారెడ్డి!

  • క‌ష్ట‌ప‌డితే సాధించ‌లేనిది ఏదీ లేదు
  • ఇప్పుడు నా కాలేజీలు దేశంలోనే టాప్ 10 స్థానాల్లో ఉన్నాయి
  • నా క‌ష్టార్జితంతోనే తాను ఇన్ని కాలేజీలు స్థాపించాను
  • సండే, మండే అనే తేడాలు లేకుండా క‌ష్ట‌ప‌డుతున్నాను  

హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం నిర్వ‌హించిన‌ మేడే వేడుకల‌కు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కార్మికుడి దుస్తుల్లో వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఈ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ… క‌ష్ట‌ప‌డితే సాధించ‌లేనిది ఏదీ లేద‌ని చెప్పారు. తాను 40 ఏళ్ల క్రితం సైకిల్ పై తిరుగుతూ పాలు, పూలు అమ్మేవాడిన‌ని అన్నారు. ఇప్పుడు త‌న కాలేజీలు దేశంలోనే టాప్ 10 స్థానాల్లో ఉన్నాయ‌ని చెప్పారు.

త‌న క‌ష్టార్జితంతోనే తాను ఇన్ని కాలేజీలు స్థాపించాన‌ని అన్నారు. సండే, మండే అనే తేడాలు లేకుండా తాను క‌ష్ట‌ప‌డుతున్నాను కాబ‌ట్టే ఈ స్థాయిలో ఉన్నాన‌ని చెప్పారు. సీఎం కేసీఆర్ వ‌ల్ల కార్మికులు క‌ష్టానికి త‌గిన ఫ‌లితం పొందుతున్నార‌ని చెప్పారు. కార్మికుల పిల్ల‌ల కోసం సీఎం కేసీఆర్ గురుకులాల‌ను ఏర్పాటు చేశార‌ని తెలిపారు. గ‌తంలో కార్మికులకు స‌రైన స‌మ‌యానికి జీతాలు అంద‌క‌పోయేవాని, దీంతో వారు తీవ్ర ఇబ్బందులు ప‌డేవార‌ని ఆయ‌న అన్నారు.

కాగా, ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. మల్లా రెడ్డి కార్మికుల కష్టం తెలిసిన వ్యక్తి కాబట్టే నేడు కార్మికుడి డ్రెస్ కోడ్ తో వచ్చారని అన్నారు. క‌రోనా వ‌ల్ల ఇబ్బందుల‌కు గురైన‌ కార్మికులకు ఇప్పుడు చేతినిండా పని దొరుకుతోందని చెప్పారు. తెలంగాణ‌లో రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాల‌కు చెందిన వారూ హైదరాబాద్ కి పని కోసం వస్తారని, కార్మికుల‌ను త‌మ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు.

Related posts

మా యాంకర్లు టిఆర్పి రేటింగ్ కోసం మూడవ ప్రపంచ యుద్దాన్ని రాజేయగలరు :శశి థరూర్ !

Drukpadam

కూరగాయల వ్యాపారి డబ్బు ఎలుకల పాలవడంపై స్పందించిన కేటీఆర్…

Drukpadam

ఐదేళ్లలో ప్రస్తుత, మాజీ ఎంపీల రైలు ప్రయాణ ఖర్చులు రూ. 62 కోట్లు!

Drukpadam

Leave a Comment