Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రైతు ఉద్యమనేత రాకేశ్‌ తికాయత్ కాన్వాయ్‌పై రాజస్థాన్ లో దాడి

Tikat Convoy was attacked in Rajasthan

రైతు ఉద్యమనేత రాకేశ్‌ తికాయత్ కాన్వాయ్‌పై రాజస్థాన్ లో దాడి
-బీజేపీ దుండగుల పనే అని తికాయత్‌ ఆరోపణ
-ఖండించిన రైతు సంఘాలు
-నిరసనగా ఘాజీపూర్‌ వద్ద రోడ్డు దిగ్బంధం
కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) నేత రాకేశ్‌ తికాయత్ ‌ కాన్వాయ్‌పై శుక్రవారం దాడి జరిగింది. రాజస్థాన్‌లోని అల్వార్‌ జిల్లా తాతార్‌పూర్‌ గ్రామంలో ఈ ఘటన జరిగింది. తికాయత్‌ రాజస్థాన్‌లోని హర్సోరా ప్రాంతంలో రైతు ఉద్యమ మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. అక్కడి నుంచి బన్సూర్‌కు బయలుదేరారు. మార్గమధ్యంలో గుర్తు తెలియని దుండగులు ఆయన క్వాన్యాయ్‌పై దాడికి దిగారు. ఈ ఘటనలో ఆయన కారు స్వల్పంగా ధ్వంసమైంది. ఇది కచ్చితంగా బీజేపీ దుండగుల పనే అని రాకేశ్‌ తికాయత్‌ ఆరోపించారు. కారు ధ్వంసమైనట్లు చూపుతున్న వీడియోని ట్విటర్‌లో పంచుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని వ్యాఖ్యానించారు.
మరోవైపు ఈ ఘటనను ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతులు తీవ్రంగా ఖండించారు. దీనికి నిరసనగా ఢిల్లీ-ఉత్తర్‌ప్రదేశ్‌ రహదారిపై ఘాజీపూర్‌ వద్ద రోడ్డును దిగ్బంధించారు. దీంతో భారీ స్థాయిలో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. రంగంలోకి దిగిన పోలీసులు రైతులను చెదరగొట్టి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

Related posts

కరోనా, బ్లాక్ ఫంగస్‌ చికిత్సల‌ను ఆరోగ్యశ్రీలో చేర్చాలి:తెలంగాణ వ్యాపితంగా కాంగ్రెస్ దీక్షలు…

Drukpadam

బీజేపీ వ్యతిరేక కూటమి దిశగా పయనిద్దాం …మమతా బెనర్జీ

Drukpadam

మొదటి రెండు సంవత్సరాల సీఎం గా సిద్దు …తర్వాత 3 సంవత్సరాలు డీకే…?

Drukpadam

Leave a Comment