Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనలో అడ్డంకులు…ఉస్మానియాకు నో …చంచల్ గూడ కు డౌట్ !

రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనలో అడ్డంకులు…ఉస్మానియాకు నో …చంచల్ గూడ కు డౌట్ !
ఉస్మానియాకు అనుమతి ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్
చంచల్ గూడా జైల్లో ఉన్న విద్యార్ధి నాయకుల పరామర్శకు రాహుల్
అనుమతి కోరుతూ జైలర్ కు దరఖాస్తు చేసిన పీసీసీ చీఫ్ రేవంత్

ఓయూలో రాహుల్ గాంధీ ప‌ర్య‌ట‌న‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని కోరుతూ హైకోర్టులో పిటిష‌న్

 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 6 ,7 తేదీల్లో రాష్ట్ర పర్యటన లో అడ్డంకులు ఎదురౌతున్నాయి. రాహుల్ ఉస్మానియాలో విద్యార్థులతో సమావేశం కావాలని భావించారు. అందుకు ఉస్మానియా పాలకమండలి నిరాకరించింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ హైకోర్టు ను ఆశ్రయించింది. ఉస్మానియా పాలకమండలి నిర్ణయానికి వ్యతిరేకంగా మినిష్టర్ క్వార్ట్రర్స్ ని చుట్టుముట్టిన ఎన్ ఎస్ యూ ఐ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు . చంచల్ గూడ జైల్లో ఉన్న విద్యార్థులను పరామర్శించేందుకు రాహుల్ రానున్నారని అందుకు అనుమతించాలని కాంగ్రెస్ నేతలు నేడు జైలు సూపరెండెంట్ కు దరఖాస్తు చేసుకున్నారు . దానికి అనుమతి లభిస్తుందో లేదో చూడాలి .

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ‌లో ప‌ర్య‌టించ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఈ నెల 7న హైద‌రాబాద్‌, తార్నాక‌లోని ఉస్మానియా యూనివర్సిటీలోనూ ప‌ర్య‌టించి,‌ విద్యార్థుల‌తో ఆయన ముఖాముఖి మాట్లాడాల‌నుకున్నారు. దీంతో అక్క‌డ‌ విద్యార్థి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఓయూలోకి రాహుల్ గాంధీని అడుగుపెట్టనివ్వ‌బోమని టీఆర్ఎస్వీ నాయకులు ఆందోళనలు చేస్తుండ‌గా, కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యూఐ కూడా పోటీగా ఆందోళ‌న‌ల‌కు దిగుతోంది.

ఈ నేప‌థ్యంలో రాహుల్ పర్యటనకు ఓయూ అధికారులు అనుమతి ఇవ్వ‌లేదు. దీంతో ఈ నెల 7న విద్యార్థుల‌తో ముఖాముఖికి అనుమ‌తి ఇవ్వాలంటూ హైకోర్టులో మాన‌వ‌తారాయ్ స‌హా న‌లుగురు పిటిష‌న్ దాఖ‌లు చేశారు. నేడు ఈ హౌస్ మోష‌న్ పిటిష‌న్ పై విచార‌ణ జ‌ర‌పాల‌ని వారు కోరారు.

Related posts

టీడీపీ ఆలా వైకాపా ఇలా …..లేటరైట్ బాక్సెట్ తవ్వకాలు పై పరస్పర విమర్శలు!

Drukpadam

ప్రధాని మోడీపై సంచలన కామెంట్స్ చేసిన మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్!

Drukpadam

పెన్షన్ లు,,కొత్త రేషన్ కార్డులు కోసం ప్రజా పంథా ధర్నా,ప్రదర్శన

Drukpadam

Leave a Comment