Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

చత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్… ఐదుగురు భద్రతా సిబ్బంది మృతి

  • చత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్
  • ఐదుగురు భద్రతా సిబ్బంది మృతి
  • సుక్మా-బిజాపూర్ అటవీప్రాంతంలో కూంబింగ్
  • పోలీసుల రాకతో అప్రమత్తమైన నక్సల్స్
  • ఇరు వర్గాల మధ్య భారీగా కాల్పులు
  • ఇద్దరు నక్సల్స్ కూడా మరణించినట్టు అనుమానం
Huge encounter in Chattisgarh

ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని ఆటవీ ప్రాంతం నిత్యం కాల్పుల మోతతో దద్దరిల్లుతుంది. నిన్న జరిగిన ఎదురుకాల్పుల్లో భద్రతా దళాలకు , మావోలకు మధ్య భీకర పోరు జరిగింది. అందులో భద్రాదులకు చెందిన ఐదుగురు చనిపోయారు. మావోల నుంచి కూడా ఇద్దరు చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. బీజాపూర్ ,సుక్మా ఆటవీ ప్రాంతంలో మావోలు సమావేశం అవుతున్నారని తెలుసుకున్న భద్రతా దళాలు అటువైపు వెళ్లాయి.వారిరాకను తమ వేగుల ద్వారా తెలుసుకున్న మావోలు అలర్ట్ అయి పోలీస్ బలగాలపై ఎదురు కాల్పులు జరిపారు. దీనిలో ఇరువైపులా ప్రాణ నష్టం ఉన్నట్లు తెలుస్తుంది. పోలీసులు ఎక్కువమంది చనిపోయారు. మరికొందరికి గాయాలు అయ్యాయి.
దేశంలో మావోయిస్టు ప్రాబల్యం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో చత్తీస్ గఢ్ ఒకటి. తాజాగా రాష్ట్రంలో భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. బిజాపూర్ అటవీప్రాంతం కాల్పులతో దద్దరిల్లింది. బిజాపూర్-సుక్మా అటవీప్రాంతంలో భద్రతా బలగాలు యాంటీ నక్సల్ ఆపరేషన్ నిర్వహించాయి. పోలీసుల రాకతో అప్రమత్తమైన మావోలు కాల్పులు జరపడంతో పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్ కౌంటర్ లో భద్రతాబలగాల వైపు ప్రాణనష్టం అధికంగా ఉంది. ఐదుగురు జవాన్లు మృతి చెందగా, మరికొందరు జవాన్లకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోలు మృతి చెందినట్టు భావిస్తున్నా, దీనిపై స్పష్టత లేదు. కాగా, మావోల ఉనికి వెల్లడి కావడంతో ఈ ప్రాంతానికి భారీగా అదనపు బలగాలను తరలిస్తున్నారు. చనిపోయిన బాడీలను తరలించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. హెలికాఫ్టర్ ఉపయోగించి వాటిని అక్కడనుంచి పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని హాస్పటల్ కు ముందు చేర్చుతారు. అక్కడ నుంచి పోస్టుమార్టం అనంతరం వారి స్వస్థలాలకు తరలించనున్నారు.

మరిన్ని వివరాలు

———————–////————————

గతకొంత కాలంగా స్తబ్దత గా వున్న మావోయిస్టులు రెచ్చిపోయారు.కూబింగ్ నిర్వహిస్తున్న పోలీసుల పై విరుచుకుపడ్డారు.శనివారం మధ్యాహ్నం సమయంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా తెర్రం పోలీస్ స్టేషన్ పరిధిలో, జొన్న గూడ గ్రామ సమీప అటవీప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి ఈ కాల్పుల్లో ఇరువైపులా ప్రాణ నష్టం జరిగింది.మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో 12మంది జవాన్లకు గాయాలయ్యాయి

ఐదుగురు జవాన్లు అమరులైయ్యారు, పోలీసులు కాల్పుల్లో

ఓ మావోయిస్టు మృతి చెందింది.కాల్పుల ఘటనపై జిల్లా యస్పి,డిజిపి దృష్టి సారించి ఎప్పటికప్పుడు సమాచారం తెరచుకుని పరిస్థితి ని సమీక్షించారు,రెండు హెలీకాఫ్టర్లు పంపి, మృతదేహలను,గాయపడ్డ జవాన్లను మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.కాని ఘటనా స్థలంలో ఎదురు కాల్పులు కొనసాగుతుండటంతో హెలీకాఫ్టర్ లాండింగ్ కు ఇబ్బంది కలిగి సహాయచర్యలకు అంతరాయం ఏర్పడింది.ఐతే ప్రాధమిక సమాచారం మేరకు జిల్లా యస్పి కమలోచన్ కశ్యప్ మీడియాకు కాల్పులు ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

కమలోచన్ కశ్యప్ జిల్లా యస్పి వెళ్ళడించిన వివరాలు ఇలా ఉన్నాయి..

శుక్రవారం రాత్రి బీజాపూర్,సుక్మా జిల్లాల నుంచి డీఆర్జీ, యస్టియఫ్, సీఆర్పీఎఫ్, కోబ్రా ప్రత్యేక బలగాలు సంయుక్తంగా మావోయిస్టుల ఇలాకాలో యాంటినక్సల్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.ఆపరేషన్లో భాగంగా బీజాపూర్ జిల్లా తెర్రం 760,ఊసూర్ 200,పామెడ్ నుండి 195,సుక్మా జిల్లా మినప నుండి 483, నర్సాపురం నుండి420 మంది జవాన్లు ఆపరేషన్ లో బాగంగా బీజాపూర్,సుక్మా జిల్లాల అడవులను జల్లెడ పడుతున్నారు.ఈ నేపథ్యంలో శనివారం సుమారు 12గంటల సమయంలో సుక్మా- బీజాపూర్ జిల్లా లో సరిహద్దులో సుక్మ జిల్లా జిగురుగుండా పోలీసు స్టేషన్ పరిధిలోని జోనగూడ గ్రామ సమీపంలో పియల్జిఎ ధలం మావోయిస్టులు ఎదురు పడటంతో ఇరువైపులా కాల్పులు చోటు చేసుకున్నాయి, ఎదురు కాల్పులు మూడు గంటల పాటు కొనసాగాయి.ఇప్పటి వరకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం కోబ్రా బలగంలో ఒక జవాన్,బస్తరీయ్ (యస్టియఫ్) ఇద్దరు,డీఆర్జీ బలగానికి చెందిన ఇద్దరు జవాన్లు , మొత్తం ఐదుగురు జవాన్లు అమరులైయ్యారు,మరో పన్నెండు మందికి గాయాలయ్యాయి.ఘటనా స్థలంలో ఓ మహిళ మావోయిస్టు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు, మావోయిస్టులకు బారీనస్టం కలిగినట్లు సమాచారం,గాయాలైన జవాన్లను ఆసుపత్రికి తరలించేందుకు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది, దీన్ని టాస్క్ఫోర్స్ అధికారి, ఆఫీస్ రూం, పోలీసు ముఖ్యకార్యాలయం నుండి పర్యవేక్షణలో ఉన్నట్లుగా తెలిపారు..

Related posts

రఘురామ గాయాలు కస్టడీలోనే అయ్యాయని సైనిక ఆసుపత్రి చెప్పలేదు: ఏపీ సీఐడీ!

Drukpadam

నర్సు స్నానం చేస్తుండగా వీడియో తీసిన పోలీసు

Ram Narayana

కారును ఆపి..,డాక్ట‌ర్ దంప‌తుల్ని కాల్చి చంపేశారు…

Drukpadam

Leave a Comment