Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మంత్రదండం అక్క‌ర్లేదు, దృఢ సంకల్పంతో సాగుదాం: సోనియా గాంధీ!

మంత్రదండం అక్క‌ర్లేదు, దృఢ సంకల్పంతో సాగుదాం: సోనియా గాంధీ!

  • ఉద‌య్‌పూర్ వేదిక‌గా చింత‌న్ శిబిర్‌
  • ఈ నెల 13 నుంచి 15 వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హ‌ణ‌
  • చింత‌న్ శిబిర్ ఏర్పాట్ల‌పై సీడ‌బ్ల్యూసీ భేటీ

ఎన్నిక‌ల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీకి ఏ మంత్ర‌దండం అవ‌స‌రం లేద‌ని, పార్టీ శ్రేణులు దృఢ సంక‌ల్ప‌తంతో ముందుకు సాగితే స‌త్ఫ‌లితాలు వ‌స్తాయ‌ని ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అభిప్రాయ‌ప‌డ్డారు. పార్టీ పున‌ర్నిర్మాణం దిశ‌గా ఈ నెల 13 నుంచి ఉద‌య్‌పూర్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న చింత‌న్ శిబిర్ స‌న్నాహ‌కాల‌పై సోమ‌వారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాల‌యంలో కాంగ్రెస్ వ‌ర్కింగ్ కమిటీ (సీడ‌బ్ల్యూసీ) స‌మావేశం జ‌రిగింది.

ఈ స‌మావేశంలో ప్ర‌సంగించిన సోనియా గాంధీ పార్టీ పున‌రుజ్జీవానికి సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్ర‌తి ఒక్క‌రికీ మేలు చేసింద‌ని చెప్పిన సోనియా… ఆ రుణాన్ని తీర్చుకోవాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైందన్నారు. ఈ దిశ‌గా పార్టీ శ్రేణులు క్ర‌మ‌శిక్ష‌ణ‌తో, దృఢ సంక‌ల్పంతో ముందుకు సాగితే ఫ‌లితాలు వాటంత‌ట‌వే వ‌స్తాయ‌ని ఆమె చెప్పారు. పార్టీ వేదిక‌ల‌పై నేత‌ల‌కు సంబంధించి స్వీయ విమ‌ర్శ‌లు ఇవ‌స‌ర‌మ‌న్న సోనియా..అయితే ఆ విమ‌ర్శ‌లు నేత‌ల‌ను నొప్పించేవిగా ఉండ‌రాద‌ని సూచించారు.  చింత‌న్ శిబిర్‌ను ఏదో సంప్ర‌దాయ‌మైన స‌మావేశంగా ప‌రిగ‌ణించ‌రాద‌న్న సోనియా… పార్టీ పున‌రుజ్జీవం దిశ‌గా జ‌రిగే కీల‌క భేటీగా గుర్తించాల‌ని సూచించారు.

Related posts

మహారాష్ట్రలో సీఎం కుర్చీ చుట్టూ రాజకీయాలు …అజిత్ పవర్ ఆసక్తికర వ్యాఖ్యలు ..

Drukpadam

రాహుల్ గాంధీపై అనర్హత వేటు ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే: షర్మిల

Drukpadam

ఇతర రాజకీయ పార్టీలను బలహీన పరిచి తాము బలోపేతం కావడమే బీజేపీ లక్ష్యమన్న ఎంపీ అరవింద్ !

Drukpadam

Leave a Comment