Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అమితాబ్‌ను ముస‌లోడా అన్న నెటిజ‌న్‌… సుతిమెత్త‌గానే బుద్ధి చెప్పిన బిగ్ బీ!

అమితాబ్‌ను ముస‌లోడా అన్న నెటిజ‌న్‌… సుతిమెత్త‌గానే బుద్ధి చెప్పిన బిగ్ బీ!
-11.30 గంట‌ల‌కు గుడ్ మార్నింగ్ చెప్పిన బిగ్ బీ
-సోష‌ల్ మీడియా వేదిక‌గా మొద‌లైన ట్రోలింగ్
-ఇది మ‌ధ్యాహ్నం ముస‌లోడా అన్న ఓ నెటిజ‌న్‌
-మిమ్మ‌ల్నెవ‌రూ ముస‌లోడు అని పిల‌వ‌కూడ‌ద‌నుకుంటున్నాన‌న్న అమితాబ్‌

బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్‌పై సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ నెటిజ‌న్ అవ‌మాన‌కర రీతిలో దాడి చేస్తే.. ఏమాత్రం స‌హ‌నం కోల్పోకుండానే అత‌డికి బిగ్ బీ బుద్ధి చెప్పారు. ఈ ఘ‌ట‌న నేటి మ‌ధ్యాహ్న స‌మ‌యంలో జ‌రిగింది. ఉద‌య‌కాల స‌మ‌యం దాటిపోతున్న స‌మ‌యంలో 11.30 గంట‌ల‌కు గుడ్ మార్నింగ్ అంటూ అమితాబ్ ట్వీట్ చేశారు. దానిపై కొంద‌రు ట్రోల్స్ మొద‌లెట్టారు. అందులో భాగంగానే ఓ నెటిజ‌న్ “ఇది మ‌ధ్యాహ్నం ముస‌లోడా” అంటూ కామెంట్ చేశాడు.

అప్ప‌టికే త‌న గుడ్ మార్నింగ్‌పై జ‌రుగుతున్న ట్రోలింగ్‌కు ఓపిక‌గానే స‌మాధానం చెబుతూ వ‌చ్చిన అమితాబ్… త‌న‌ను ముస‌లోడా అంటూ కామెంట్ చేసిన నెటిజ‌న్‌కు కూడా ఓపిక‌గానే బ‌దులిచ్చారు. “మీరు చాలా కాలం బ్ర‌త‌కాల‌ని ప్రార్థిస్తున్నాను. అయితే మిమ్మ‌ల్ని ఎవ‌రూ ముస‌లోడు అని పిలిచి అవ‌మానించ‌కూడ‌ద‌ని కోరుకుంటున్నా” అంటూ ఆ నెటిజ‌న్‌కు బిగ్ బీ బ‌దులిచ్చారు.

Related posts

డేరా బాబాకు జీవిత ఖైదు విధించిన సీబీఐ కోర్టు!

Drukpadam

ప్రైవేటీకరణకు ముందే ఎయిర్ ఇండియా మెరుగ్గా ఉండేది …ప్రధాని మోదీ సలహాదారు!

Drukpadam

ఎంపీ నవనీత్ కౌర్ ఎస్సీ కాదు… బాంబే హైకోర్టు సంచలన తీర్పు…

Drukpadam

Leave a Comment