Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

గాయత్రీ రవిని వరించిన అదృష్టం …  టీఆర్ యస్ రాజ్యసభ సీటు ఖరారు !

గాయత్రీ రవిని వరించిన అదృష్టం …  టీఆర్ యస్ రాజ్యసభ సీటు ఖరారు !
టీఆర్ యస్ అభ్యర్థుల జాబితాలో రవి పేరు ప్రకటన
ఖమ్మం జిల్లా నుంచే హెట్రో డ్రగ్స్ అధినేత బండి పార్థ సారథి రెడ్డి
ఖమ్మం జిల్లాకు డబల్ ధమాకా
టీఆర్ యస్ శ్రేణుల్లో ఆనందం

గాయత్రీ రవి అలియాస్ వద్దిరాజు రవిచంద్ర ను అదృష్టం వరించింది….టీఆర్ యస్ నుంచి రాజ్యసభకు పంపే ముగ్గురి పేర్లలో ఆయన పేరు ఉండటం విశేషం… ఆయన ఛాన్స్ ఉంటుందనే విషయాన్నీ దృక్పధం ముందే చెప్పిన విషయం విధితమే.    టీఆర్ యస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కేసీఆర్ ఎంపిక చేశారు . రవితో పాటు ఖమ్మం జిల్లాకే చెందిన హెట్రో డ్రగ్స్ అధినేత బండి పార్థసారధి రెడ్డిని ఎంపిక చేయడం తో ఖమ్మం జిల్లాకు డబల్ ధమాకా తగిలినట్లు అయింది. ఖమ్మం జిల్లా చరిత్రలో ఎప్పుడు కూడా రెండు రాజ్యసభ సీట్లు ఒకేసారి రాలేదు. టీడీపీ హయాంలో అసలు జిల్లా నుంచే ఎవరిని ఎంపిక చేయలేదు . గాయత్రి రవి ఖమ్మం జిల్లాలో గత రెండు దశాబ్దాలకు పైగా గ్రానైట్ వ్యాపారంలో కొనసాగుతున్నారు . స్నేహశీలిగా ఉండే గాయత్రీ రవి టీఆర్ యస్ లో చేరిన కొద్దీ కాలానికే సీఎం కేసీఆర్ ,కేటీఆర్ దగ్గర అయ్యారు . ఇటీవల ఖమ్మం జిల్లా నుంచి ప్రజాప్రతినిధులు కలిసినప్పుడు ఖమ్మం జిల్లాలో వర్క్ చేసికో రవి అని స్వయంగా కేసీఆర్ అనడం తో ఆయన ఖమ్మం జిల్లా రాజకీయాల పై ద్రుష్టి సారించారు . స్నేహశీలిగా , అందరితో కలిసి పోయే వ్యక్తిగా , సహాయం చేసే విషయాల్లో వెనుతిరిగి చూడని మనిషిగా ఆయనకు మంచి పేరుంది. ఖమ్మం జిల్లా తో పాటు , వరంగల్ , కరీంనగర్ జిల్లాలలో బంధుగణం పరిచయాలు మెండుగా ఉన్నాయి. ఆయన్ను రాజ్యసభకు ఎంపిక చేశారని తెలియగానే ఖమ్మంలో అభిమానులు కేరింతలు కొడుతూ బాణాసంచా పేల్చారు . అభినందనలు వెల్లు ఎత్తుతున్నాయి.

రవి చంద్ర మొదట కాంగ్రెస్ పార్టీ లో ఉండి .గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నుంచి పోటీచేయాలని గట్టి ప్రయత్నం చేశారు . కానీ కాంగ్రెస్ ఖమ్మం సీటు టీడీపీ కి కేటాయించడంతో విధిలేని పరిస్థితిలో వరంగల్ ఈస్ట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు . తరువాత టీఆర్ యస్ చేరిన రవిచంద్ర కొద్దీ కాలంలోనే సీఎం కేసీఆర్ ,కేటీఆర్ లుక్స్ లో పడ్డారు . ఆ నమ్మకంతోనే తాను కచ్చితంగా చట్టసభలకు వెళతానని విశ్వాసం తో ఉన్నారు . తన విశ్వాసం నిజమైంది. సీఎం కేసీఆర్ పిలిచి మరి రాజ్యసభ సీటు ఇస్తున్నట్లు తెలిపారు . దానితో రవి ఆనందానికి అవధులు లేవు ,ఖమ్మం ఆయన అభిమానాలు కేరింతలు కొట్టారు . స్వీట్స్ పంచుకున్నారు .గులాలు చల్లు కున్నారు. రెండు సంవత్సరాల పదవి కాలంల రాజ్యసభ సీటు అయితే రేపు నామినేషన్ వేయాల్సి ఉంటుంది.

Related posts

కేసీఆర్ కు 28 స్థానాలకంటే ఎక్కువ సీట్లు రావని పీకే చెప్పారు …కె ఏ పాల్!

Drukpadam

స‌హ‌నం కోల్పోయి కార్య‌క‌ర్త‌పై చేయి చేసుకున్న సీనియర్ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు!

Drukpadam

పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ లు …కూలీలందరికి కూలీ బందు ప్రవేశ పెట్టాలి!

Drukpadam

Leave a Comment