Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బెంగాల్‌ ప్రచారపర్వంలోకి జయాబచ్చన్…టీఎంసీ కి మద్దతు

బెంగాల్‌ ప్రచారపర్వంలోకి జయాబచ్చన్ ఎంట్రీ!
  • తృణమూల్‌ తరఫున ప్రచారం చేయనున్న జయా
  • టీఎంసీ ప్రచార తారల్లో ఆమె ఒకరు
  • కేంద్ర మంత్రి బాబుల్ సుప్రీయోకు వ్యతిరేకంగా ప్రచారం
  • జయాబచ్చన్‌ పుట్టిల్లు బెంగాలే కావడం విశేషం
Jaya Bachhan Entered into Bengal Campaign

బెంగాల్‌ ప్రచారపర్వంలోకి జయాబచ్చన్…టీఎంసీ కి మద్దతు…
టీఎంసీ ప్రచార తారల్లో ఆమె ఒకరు… .కేంద్ర మంత్రి బాబుల్ సుప్రీయోకు వ్యతిరేకంగా ప్రచారం…. .జయాబచ్చన్‌ పుట్టిల్లు బెంగాలే కావడం విశేషం…. బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం మరింత రసవత్తరంగా మారనుంది.

బాలీవుడ్‌ ప్రముఖ నటి, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ఎంపీ జయాబచ్చన్‌ తృణమూల్‌ తరఫున సోమవారం నుంచి ప్రచారం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆమె ఇప్పటికే కోల్‌కతాకు చేరుకున్నారు.

టోలీగంజ్‌ ఎమ్మెల్యే అరూప్‌ బిశ్వాస్‌ తరఫున ఆమె రేపు ప్రచారం చేయనున్నారు. అక్కడ బీజేపీ తరఫున కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియో పోటీ చేస్తున్నారు. తృణమూల్‌ ప్రకటించిన ప్రచార తార(స్టార్ క్యాంపెయినర్‌)ల్లో జయాబచ్చన్‌ కూడా ఉన్నారు. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ ఇప్పటికే మమతకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

బెంగాల్‌ జయాబచ్చన్‌ పుట్టిల్లు. ఆమె జబల్‌పూర్‌లోనే పుట్టి పెరిగారు. సినిమాల్లోకి ప్రవేశించి కీర్తి ప్రఖ్యాతలు సంపాదించిన ఆమె బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ను పెళ్లాడారు. అందుకే బిగ్‌బీని బెంగాల్‌ అల్లుడిగా సంబోధిస్తుంటారు. అయితే, తాజా ఎన్నికల్లో ‘బెంగాల్‌ ప్రజలకు వారి సొంత కూతురే కావాలి. బయటి వ్యక్తులు వద్దు’ అంటూ తృణమూల్‌ ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగాల్‌ బిడ్డ అయిన జయా ప్రచారం వారి గెలుపునకు దోహదం చేస్తుందని తృణమూల్‌ భావిస్తోంది.

Related posts

మా పోరాటం టీడీపీపై కాదు.. పేదరికాన్ని పోగొట్టడంపైనే: ఏపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు…

Drukpadam

ఈటల భారీ కుట్రకు ప్లాన్ చేశారు: మంత్రి కొప్పుల ఈశ్వర్ సంచలన ఆరోపణలు!

Drukpadam

సీఎం సలహాదారుగా సోమేశ్ కుమార్ నియామకంపై భట్టి ఫైర్ …

Drukpadam

Leave a Comment