నేటి సాయంత్రం బెంగుళూరుకు కేసీఆర్..ప్రధాని టూరుకు మరోసారి దూరం!
-బెంగుళూర్ నుంచి రాలె గావ్ సిద్ది కి కేసీఆర్
-కుటుంబ సభ్యులతో షిరిడీ టూర్
-బెంగాల్ , బీహార్ రాష్ట్రాల పర్యటనపై రాని స్పష్టత
ప్రధాని మోడీ రాష్ట్రానికి రానున్న సందర్భంగా మరోసారి ఆయన పర్యటనకు దూరంకానున్నారు . ప్రధాని హైద్రాబాద్ పర్యటనకు వస్తున్నట్లు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఉన్నప్పటికీ ఆయన రాష్ట్రంలో లేకుండా వెళ్ళుతున్నారు . కేంద్రానికి ,తెలంగాణ ప్రభుత్వానికి ఉన్నా గ్యాప్ మరింత పెరిగేదిగా ఉన్నాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో చిన్నజియ్యర్ స్వామి ఏర్పాటు చేసిన రామానుజం విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా తనకు జ్వరం వచ్చిందని కనీసం ప్రధానికి స్వాగతం పలికేందుకు కూడా సీఎం కేసీఆర్ ఎయిర్ పోర్ట్ కు రాలేదు . గురువారం
ఇవాళ సాయంత్రం బెంగుళూరుకు సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. రేపు ప్రధాని టూర్‌కు మరోసారి కేసీఆర్ దూరం కానున్నారు. రేపు బెంగుళూరు నుంచి రాలె గావ్ సిద్ధి వెళ్లనున్నారు.
అటు నుంచి కుటుంబ సబ్యులతో కలిసి షిర్డీ వెళ్లి అక్కడ సాయినాథున్ని దర్శించుకోనున్నారు. కాగా 29, 30 తేదీల్లో బెంగాల్, బీహార్ రాష్ట్రాల పర్యటనపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే గతంలో కూడా ప్రధాని మోదీ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు సీఎం కేసీఆర్ దూరంగానే ఉన్నారు. స్వల్ప జ్వరంతో బాధపడుతుండటంతో అప్పటి ప్రధాని పర్యటనకు కేసీఆర్ దూరంగా ఉన్నారు. ఇప్పుడు మరోసారి బెంగుళూరు టూర్ కారణంగా దూరం కానున్నారు. కేసీఆర్ కావాలనే ఇలా చేస్తున్నారని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.