Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఇనగుర్తి నుంచి ఇంద్రప్రస్థ పంపిన ఘనత కేసీఆర్ దే : ఎంపి వద్దిరాజు రవి

కేసీఆర్ కు ఆజన్మాంతం రుణపడివుంటా

ఎక్కడో ఇనగుర్తి లో పుట్టిన తనను ఇంద్రప్రస్థకు పంపిన ఘనత కేసీఆర్ దేనని రాజ్యసభసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన వద్దిరాజు రవి చంద్ర అన్నారు. సమాన్యుడుగా ఉన్న తనకు అత్యంత అరుదైన అవకాశం కల్పించటం పై మాటలు రావటం లేదని అన్నారు.

రాజ్యసభ సభ్యనిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వద్దిరాజు రవిచంద్ర

నామీద నమ్మకంతో దేశంలో అత్యంత గౌరవప్రదమైన ఎం పి పదవి ఇచ్చి పెద్దల సభకు పంపిన కేసీఆర్ కు ఆజన్మాంతం రుణపడివుంటానని రవిచంద్ర అన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం తెలంగాణ భవన్ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనకు వచ్చిన ఈ అవకాశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అదేశాల మేరకు రాష్ట్ర హక్కులకోసం రాష్ట్రానికి రావల్సిన నిధులకోసం పోరాడతానని అన్నారు. పేదల బడుగు బలహీన వర్గాల గొంతునై వినిపిస్తానని అన్నారు.తన ప్రమాణస్వీకారం సందర్బంగా వచ్చిన మంత్రులకు ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు తరలివచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఉపరాష్ట్రపతితో వద్దిరాజు రవి

కాపు సామాజిక వర్గం నుంచి టీఆర్ యస్ కోసం కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తామని అన్నారు.

కడియం శ్రీహరి మాట్లాడుతూ రెండు జిల్లాలనుంచి పెద్ద ఎత్తున రావడం అంటేనే రవిపట్ల ఉన్న అభిమానాన్ని తెలియజేస్తుందని అన్నారు.. తెలంగాణలో ఎదుగుతున్న నేతగాఉన్న రవికి రాజ్యసభ సభ్యుడు కావడం అంటే మంత్రి పదవితో సమానం అని అన్నారు…. ఈ పదవిని ప్రజల కోసం ఉపయోగించాలని అన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న టీఆర్ యస్ లోకసభపక్ష నేత ఎం పి నామ మాట్లాడుతూ కేంద్రవైఖరిపై ద్వజమెత్తారు. తెలంగాణ రాష్టానికి రావల్సిన వాటిపై కేంద్రవైఖరి సరిగా లేదని తాము ఎన్నిసార్లు మొరపెట్టకున్నా పెడచెవిన పెడుతుందని నామ నాగేశ్వరరావు విచారంవ్యక్తం చేశారు . విభజన చట్టంలో ఉన్న వాటి అమలుపై మరింత వత్తిడ్డి తెస్తామని అన్నారు. కేంద్రం రాష్ట్రం విషయంలో చిన్న చూపు చూస్తుందని విమర్శించారు.….అభివృద్ధిలో తెలంగాణ ముందున్నా …. రాష్ట్రం పై విషం చిమ్ముతున్నారని బీజేపీ వైఖరిని తప్పు పట్టారు.

ఎంపి లింగయ్య యాదవ్ మాట్లాడుతూ….కేంద్రనుంచి 50 వేలకోట్లరూపాయాలు రావాలి… వాటిని ఇవ్వకపోగా పైగా కేంద్ర రాష్ట్రం పై నిందలు వేస్తుందని విమర్శించారు.

మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ పేదవర్గాల ప్రతినిధి….రాజకీయాలకు అతీతంగా సహయం చేసే వ్యక్తిరవిచంద్రఅని కొనియాడారు.… కోచ్ ఫ్యాక్టరీ ,బయ్యారం ఉక్కు కేంద్ర అణగదొక్కి పెట్టింది… బండి సంజయ్ కు సిగ్గులేకుండా ధర్నాలు,దీక్షలు అంటుంటారని మోడీ దగ్గర ధర్నా చేసి రాష్ట్రానికి నిధులు తేవాలని అన్నారు.

Related posts

కరోనా తో 35 లక్షల మంది మరణం ….

Drukpadam

ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. అమెరికాలో గుంటూరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి!

Drukpadam

కొత్త ఖమ్మాన్ని ఆవిష్కరించిన మంత్రి అజయ్…1100 కోట్ల నిధులతో అభివృద్ధి!

Drukpadam

Leave a Comment