Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సింహంతో జూ కీపర్ పరాచకాలు.. దెబ్బకు వేలు ఊడిపడింది.. ఇదిగో వీడియో!

సింహంతో జూ కీపర్ పరాచకాలు.. దెబ్బకు వేలు ఊడిపడింది.. ఇదిగో వీడియో!

  • జమైకాలోని జూలో ఘటన
  • పర్యాటకులను సంతోష పెట్టేందుకు సింహంతో ఆటలు
  • నోట్లో వేళ్లు పెట్టి పరాచకాలు
  • జూ కీపర్ ను తిట్టిపోస్తున్న నెటిజన్లు

‘పులిని దూరం నుంచి చూడాలనిపించిందనుకో చూస్కో.. ఫొటో దిగాలనిపిస్తే కొంచెం రిస్క్ అయినా ఫర్వాలేదు ట్రై చేయొచ్చు.. సరే చనువిచ్చింది కదా అని ఆటాడుకుంటే మాత్రం వేటాడేస్తది..’ ఇదీ యమదొంగ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్. ఓ జూ కీపర్ విషయంలో ఇది అక్షరాల నిజమైంది. జమైకాలోని సెయింట్ ఎలిజబెత్ లో ఉన్న జూలో రెండు వారాల క్రితం జరిగిందీ ఘటన. ఆ వీడియో కాస్తా వైరల్ అవుతోంది.

జూకు వచ్చిన పర్యాటకుల కోసం సింహంతో ఆ జూ కీపర్ ఆటలాడాడు. దాని నోట్లో వేళ్లు పెట్టి కెలికాడు. పదే పదే దానిని టీజ్ చేశాడు. బోనులో ఉన్నా సింహం సింహమే కదా.. అది అతగాడికి తెలిసొచ్చేలా గాండ్రింపులతో గర్జించింది. అయినా అతగాడు వింటేనా.. మళ్లీ మళ్లీ అలాగే చేశాడు. చిర్రెత్తుకొచ్చిన సింహం అతడి వేలిని అమాంతం తన పదునైన కోర పళ్లతో పట్టేసింది.

జూ కీపర్ ఎంతగా ప్రయత్నించినా ఆ వేలిని సింహం వదల్లేదు. అక్కడ వీడియోలు తీసుకుంటున్న పర్యాటకులు అంతా జోకేమో అనుకున్నారు. కానీ, ఆ జూ కీపర్ మాత్రం వేలిని వదిలించుకోవడానికి విశ్వ ప్రయత్నమే చేశాడు. చివరకు సింహం వదిలేసినా.. అతడి వేలు మాత్రం లేదు. సింహం కోరల బలానికి ఆ వేలు తెగి పోయింది. బాధతో జూ కీపర్ విలవిల్లాడిపోయాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో అందరూ జూ కీపర్ ను తిట్టిపోస్తున్నారు. సింహంతో పరాచకాలేంటంటూ మండిపడుతున్నారు.

…ఒక్క విషయం.. ఈ ఘటనతో అర్థం చేసుకోవాల్సిన విషయమేంటంటే బోనులో బంధించినా, జూలో పెట్టి తాళాలేసినా క్రూర మృగం ఎప్పుడూ క్రూర మృగమే.

Related posts

పబ్లిసిటీ కోసం పిటిషన్లు వేస్తారా.. రూ.20 లక్షలు జరిమానా కట్టండి:నటి జుహీ చావ్లాకు ఢిల్లీ హైకోర్టు షాక్….

Drukpadam

విదేశీయులు ఇళ్లు కొనకుండా కెనడాలో నిషేధం!

Drukpadam

Drukpadam

Leave a Comment