Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ పై ఢిల్లీ పోలీసుల కేసు!

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ పై ఢిల్లీ పోలీసుల కేసు!
-యతి నరసింగానంద్ పైనా ఎఫ్ఐఆర్
-రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ కేసు
-ఇప్పటికే నుపుర్ శర్మతో పాటు పలువురిపై ఇఫ్సో కేసులు

ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. హిందూత్వ నేత యతి నరసింగానంద్ పైనా ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. సోషల్ మీడియాలో వాళ్లిద్దరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్ (ఇఫ్సో) అధికారులు కేసు పెట్టారు. విద్వేష సందేశాలను ఇస్తూ పలు వర్గాలను రెచ్చగొట్టే చర్యలకు పూనుకున్నారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.

కాగా, మహ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఇప్పటికే బీజేపీ బహిష్కృత నేతలు నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ లపైనా ఇఫ్సో ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. వారితో పాటు షాదాబ్ చౌహాన్, సబా నఖ్వీ, మౌలానా ముఫ్లీ నదీమ్, అబ్దుర్ రహీమ్, గుల్జార్ అన్సారీ, అనిల్ కుమార్ మీనా, పూజా షాకూన్ ల పేర్లనూ ఎఫ్ఐఆర్లో పేర్కొన్న సంగతి తెలిసిందే.

వారందరిపై సెక్షన్ 153, 295, 505 కింద కేసులను నమోదు చేశారు. ఇటు సోషల్ మీడియా సంస్థలకు కూడా నోటీసులను అందించనున్నారు.

Related posts

కారు టైరు పేలి మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి దుర్మరణం…

Drukpadam

యూపీలో దారుణం ..కేంద్రమంత్రి ఇంట్లో యువకుడి కాల్చివేత …

Ram Narayana

బెంగళూరు ఎయిర్ పోర్టులో సిబ్బంది చేతివాటం…

Drukpadam

Leave a Comment