Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వైసీపీ స‌ర్వేలో టీడీపీకి 115 సీట్లు వ‌స్తాయ‌ని తేలింది: ర‌ఘురామ‌కృష్ణ‌రాజు

వైసీపీ స‌ర్వేలో టీడీపీకి 115 సీట్లు వ‌స్తాయ‌ని తేలింది: ర‌ఘురామ‌కృష్ణ‌రాజు
-స‌ర్వేలో వైసీపీకి 60 సీట్లేనన్న రఘురామ
-100 మంది ఎమ్మెల్యేల‌కు సీట్లివ్వ‌న‌ని జ‌గ‌న్ చెప్పారని వ్యాఖ్య
-120 మంది ఎమ్మెల్యేలు అస‌లు టికెట్లే అడ‌గ‌రన్న రఘురాజు
-“గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు”కు భ‌యంభ‌యంగా వెళుతున్నార‌న్న ర‌ఘురామ‌రాజు

వైసీపీ రెబల్ ఎంపీ గా ఉన్న రఘురామకృష్ణరాజు సీఎం జగన్ పైన పార్టీపైనా విషం చిమ్ముతూనే ఉన్నారు . తన పార్టీ అంటూనే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రాదని తన మనుసులో మాటను సర్వే పేరుతొ వెల్లడించారు . అదికూడా టీడీపీకి 115 సీట్లు వస్తాయని చెప్పిన రఘురామ మరి బీజేపీకి , జనసేన కు జీరో సీట్లు ఇచ్చారు . వారికీ అసలు సీట్లు రానట్లు చూపించారు . అంటే ఆయనకు ముందు వైసీపీ ఓడిపోవాలి …టీడీపీ అధికారంలోకి రావాలనే కోరిక కావచ్చునని అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. అందువల్లనే ఆయన వైసీపీ సర్వే పేరుతొ వచ్చే సీట్లను వెల్లడించారు .

2024 ఎన్నిక‌ల్లో వైసీపీ 175 స్థానాల్లో విజ‌యం సాధిస్తుంద‌ని ఆ పార్టీ అధినేత‌, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రెండు రోజుల క్రితం చెప్పిన మాట‌పై ఆ పార్టీకి చెందిన రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు శుక్ర‌వారం కామెంట్ చేశారు. త‌మ పార్టీ వైసీపీ చేయించిన స‌ర్వేలో టీడీపీకి 115 సీట్లు వ‌స్తాయ‌ని, వైసీపీకి కేవ‌లం 60 సీట్లు మాత్ర‌మే వ‌స్తాయ‌ని తేలింద‌ని ఆయ‌న తెలిపారు. ఈ విష‌యం తెలిసి కూడా జ‌గ‌న్ అంత ధైర్యంగా 175 స్థానాల్లో విజ‌యం సాధిస్తామ‌ని ఎలా చెబుతున్నారోనంటూ ఆయ‌న ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు.

ఇక ప‌నిచేయ‌ని ఎమ్మెల్యేల‌కు వ‌చ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేది లేద‌ని జ‌గ‌న్ చెప్పిన విష‌యంపైనా ఆయ‌న స్పందించారు. సామ‌ర్థ్యం మేర‌కు ప‌నిచేయ‌ని దాదాపు 100 మంది ఎమ్మెల్యేల‌కు వ‌చ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వ‌బోన‌ని జ‌గ‌న్ చెప్పార‌ని, అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏకంగా 120 మంది అస‌లు పార్టీ టికెట్లే అడగ‌రంటూ ర‌ఘురామ‌రాజు తెలిపారు. ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మానికి భ‌యం భ‌యంగానే వైసీపీ ఎమ్మెల్యేలు వెళుతున్నార‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు.

Related posts

హుజూరాబాద్ లో టీఆర్ఎస్ అక్రమాలకు తెరలేపింది: ఈసీకి గోనె ప్రకాశ్ రావు లేఖ!

Drukpadam

విప‌క్ష నేత‌ల‌కు జేపీ న‌డ్దా ఫోన్‌… ముర్మును ఏక‌గ్రీవంగా ఎన్నుకుందామ‌ని పిలుపు!

Drukpadam

కేసీఆర్ నయా జాగీర్ లా వ్యవహరిస్తున్నారు …ప్రియాంక మండిపాటు…

Drukpadam

Leave a Comment