Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పేర్ని నాని-ఎంపీ బాలశౌరి వివాదంపై వైసీపీ అధిష్ఠానం సీరియస్..

పేర్ని నాని-ఎంపీ బాలశౌరి వివాదంపై వైసీపీ అధిష్ఠానం సీరియస్.. అనవసర రచ్చ వద్దని వార్నింగ్!
-పేర్ని నానిపై తీవ్ర విమర్శలు చేసిన ఎంపీ బాలశౌరి
-టీడీపీ నేత కొనకళ్ల, బీజేపీ నేత సుజనా చౌదరితో అంటకాగుతున్నారని ఆరోపణ
-మీడియాకెక్కి రచ్చ చేయడం ఏంటని అధిష్ఠానం ఆగ్రహం
-తాడేపల్లికి పిలిపించి మాట్లాడనున్న అధిష్టానం

పార్టీ పరువు బజారుకీడ్చిన ఇద్దరు నేతల వ్యవహారం వైసీపీలో ప్రకంపనలు పుట్టిస్తుంది. ఇద్దరు ఒకే పార్టీలో ఒకరు ఎంపీగా మరొకరు ఎమ్మెల్యేగా ఉన్న ఇద్దరు నేతల మధ్య గొడవ ఇబ్బందికరంగా మారింది . ఇద్దరినేతలు మధ్యనెలకొన్న విభేదాలు పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారడంతో వారికీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు .పార్టీ కట్టుదాటితే ఎంతటివారిపైననైన చర్యలు తప్పవని ఘాటుగానే చెప్పడంతో ప్రస్తుతానికి ఇద్దరు నేతలు కొంత సర్దుమణిగారు . సమస్యలు ఉంటె అంతర్గతంగా పరిష్కరించుకోవాలని కానీ ఇలా రచ్చకెక్కడమేమిటని అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.

ఎంపీ బాలశౌరి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని మధ్య చెలరేగిన వివాదంపై వైసీపీ అధిష్ఠానం సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి తప్పితే ఇలా మీడియాకెక్కి రచ్చకెక్కడం సరికాదని, మౌనంగా ఉండాలని హెచ్చరించినట్టు సమాచారం. ఎంపీని అడ్డగించడం, గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడాన్ని అధిష్ఠానం తీవ్రంగా పరిగణిస్తోంది. ఇద్దరినీ తాడేపల్లికి పిలిపించి మాట్లాడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల బందరులో శ్మశానవాటిక పరిశీలనకు వెళ్లిన ఎంపీ బాలశౌరికి ఎమ్మెల్యే పేర్ని నాని అనుచరులు, కార్పొరేటర్ అస్ఘర్ అలీ, సొంత పార్టీ కార్యకర్తల నుంచి చేదు అనుభవం ఎదురైంది.

తనను అడ్డుకున్న వారిపై బాలశౌరి కూడా తీవ్రంగా ప్రతిస్పందించారు. ‘బందరు ఏమైనా నీ అడ్డానా?’ అంటూ మీడియా ముఖంగా పేర్ని నానిపై విరుచుకుపడ్డారు. టీడీపీ నేత, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, బీజేపీ నేత సుజనా చౌదరి వంటి వారితో నాని అంటకాగుతున్నారని ఆరోపించారు. అంతేకాదు, సెటిల్మెంట్లు కూడా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో బందరు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అంతేకాదు, బందరులో జరిగిన ఏ కార్యక్రమానికి ఎంపీకి ఆహ్వానం అందడం లేదని కూడా ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇటీవల బందరు హార్బర్‌లో జరుగుతున్న పనులను పరిశీలించేందుకు కేంద్ర సహాయ మంత్రి వచ్చారు. ఆ కార్యక్రమంలో బాలశౌరి, పేర్ని నాని పాల్గొన్నప్పటికీ అంటీముట్టనట్టుగా వ్యవహరించారు.

మరోవైపు, పేర్ని నానిపై బాలశౌరి చేసిన ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన అధిష్ఠానం.. అయిన రచ్చ గురించి మీడియాకెక్కడమేంటని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మరోవైపు, నిన్న బందరులో పర్యటించిన బాలశౌరిని నానితో వివాదంపై స్పందించాల్సిందిగా విలేకరులు కోరారు. దీనికి ఆయన మాట్లాడుతూ.. తాను ఎలాంటి తప్పు చేయలేదని ముక్తసరిగా జవాబిచ్చారు. అధిష్ఠానం నుంచి తనకు ఎలాంటి పిలుపు రాలేదని స్పష్టం చేశారు. మరోవైపు, పేర్ని నాని కూడా ఈ ఘటనపై ఇలాంటి సమాధానమే ఇచ్చారు. తన ఆరోగ్యం బాగాలేదని, ఇంటి వద్ద చికిత్స తీసుకుంటున్నట్టు చెప్పారు.

Related posts

అమ్మడానికి ఇవి మోదీ ఆస్తులో, బీజేపీ ఆస్తులో కావు: మమత బెనర్జీ

Drukpadam

ఓటమిని అంగీకరించిన రాములు నాయక్

Drukpadam

కర్ణాటక నూతన సీఎం సిద్ధరామయ్యకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు…

Drukpadam

Leave a Comment