Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేసి వేణుగోపాల్ పై పోలిసుల దురుసు ప్రవర్తన …ప్రియాంక గాంధీ ఫైర్

చిరిగిన చొక్కాతో పోలీస్ స్టేష‌న్‌లో కాంగ్రెస్ పార్టీ నేత‌… పోలీసుల‌పై ప్రియాంకా గాంధీ ఫైర్‌

  • రాహుల్ ఈడీ విచార‌ణ‌పై కాంగ్రెస్ నిర‌స‌న‌లు
  • ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
  • పెనుగులాట‌లో వేణుగోపాల్ చొక్కా చిరిగిన వైనం
  • పోలీసుల దురుసు వ‌ర్త‌న‌పై పోలీస్ స్టేష‌న్ వేణుగోపాల్ దీక్ష‌
  • స్వ‌యంగా స్టేష‌న్‌కు వ‌చ్చిన ప్రియాంకా గాంధీ
  • పోలీసుల తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన వైనం

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన తీరును నిర‌సిస్తూ ఆ పార్టీ శ్రేణులు దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌ల‌కు దిగిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో దేశ రాజ‌ధాని ఢిల్లీ స‌హా దేశంలోని ప‌లు ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఆందోళ‌న‌ల‌కు దిగిన కాంగ్రెస్ నేత‌ల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్ర‌మంలో ఢిల్లీలో ఈడీ కార్యాల‌యం ముందు నిర‌స‌న‌కు దిగిన పార్టీ సీనియ‌ర్ నేత కేసీ వేణుగోపాల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయ‌న‌ను తుగ్ల‌క్ రోడ్ పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. అరెస్ట్ సంద‌ర్భంగా ఆయ‌న‌ను పోలీసులు దాదాపుగా ఈడ్చుకెళ్లిన‌ట్లుగా తీసుకెళ్లారు. ఈ పెనుగులాట‌లో ఆయ‌న చొక్కా చిరిగిపోయింది.

పోలీసులు త‌న ప‌ట్ల దురుసుగా వ్య‌వ‌హ‌రించిన తీరుపై కేసీ వేణుగోపాల్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో అరెస్ట్ చేసిన నేత‌ల‌ను విడుదల చేస్తున్న‌ట్లు పోలీసులు ప్ర‌క‌టించినా… పోలీసుల వైఖ‌రిని నిరసిస్తూ వేణుగోపాల్ పీఎస్‌లోనే దీక్ష‌కు దిగారు. ఈ విష‌యం తెలుసుక‌న్న పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంకా గాంధీ నేరుగా తుగ్ల‌క్ రోడ్ పోలీస్ స్టేష‌న్‌కు చేరుకున్నారు. చొక్కా చిరిగిన స్థితిలో క‌నిపించిన వేణుగోపాల్‌ను చూసిన ప్రియాంకా గాంధీ పోలీసుల తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌ల‌తో వ్య‌వ‌హ‌రించేది ఇలాగేనా అంటూ ఆమె పోలీసుల‌పై ఫైర‌య్యారు.

Related posts

రైతు కంట కన్నీరు చిందిన రాజ్యం బాగుపడదు: సీఎం కేసీఆర్ కు కోమటిరెడ్డి లేఖ…

Drukpadam

అది మీకు వెన్నతో పెట్టిన విద్యే కదా.. ఎమ్మెల్సీ కవితకు రేవంత్ గట్టి కౌంటర్!

Drukpadam

వైఎస్ షర్మిలకి షాక్.. సొంత పార్టీ నేత సంచలన వ్యాఖ్యలు

Drukpadam

Leave a Comment