Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రీడా వార్తలు

భారత్ క్రికెట్ లో ప్రయోగాలు … ఐర్లాండ్ టూర్ కెప్టెన్ గా హార్థిక్ పాండ్య!

భారత్ క్రికెట్ లో ప్రయోగాలు … ఐర్లాండ్ టూర్ కెప్టెన్ గా హార్థిక్ పాండ్య!
-ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు .. సీనియర్లకు నో ఛాన్స్
-రోహిత్‌, రిష‌బ్‌, కేఎల్ రాహుల్‌ల‌కు ద‌క్క‌ని చోటు
-వైస్ కెప్టెన్‌గా భువ‌నేశ్వ‌ర్ కుమార్‌
-ఉమ్రాన్ మాలిక్‌కూ స్థానం క‌ల్పించిన బీసీసీఐ

భారత్ క్రికెట్ లో ఇటీవల ప్రయోగాలు ఎక్కువయ్యాయి… సౌత్ ఆఫ్రికా తో జరుగుతున్న టి 20 సిరీస్ కు రిషబ్ పంత్ ను కెప్టెన్ గా చేసిన బీసీసీఐ …ఐర్లాండ్ టూర్ కు హార్థిక్ పాండ్యను ఎంపిక చేసింది. సీనియర్లకు ఎవరికి జట్టులో చోటు కల్పించలేదు …దీంతో బీసీసీఐ ప్రయోగాలకు పూనుకున్నదే సంకేతాలు ఇచ్చింది .

ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు భార‌త జ‌ట్టును బీసీసీఐ బుధ‌వారం ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న సిరీస్ ముగియ‌గానే… టీమిండియా ఐర్లాండ్ టూర్‌కు వెళ్ల‌నుంది. ఈ నెల 26, 28 తేదీల్లో టీమిండియా రెండు టీ20 మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ సిరీస్‌కు టీమిండియా జ‌ట్టును బీసీసీఐ ప్ర‌క‌టించింది. ఈ జ‌ట్టులో టీమిండియా రెగ్యుల‌ర్ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ స‌హా, ద‌క్షిణాఫ్రికాతో సిరీస్‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న రిష‌బ్ పంత్‌, స్టార్ ఓపెన‌ర్ కేఎల్ రాహుల్‌ల‌కు చోటు ద‌క్క‌లేదు.

ఐర్లాండ్‌తో సిరీస్‌లో టీమిండియాకు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. ఐపీఎల్‌లో గుజ‌రాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించి ఏకంగా ఆ జ‌ట్టును విజేత‌గా నిలిపిన పాండ్యాపై అంచ‌నాలు ఒక్క‌సారిగా పెరిగిపోగా…తాజాగా ఏకంగా ఐర్లాండ్‌తో సిరీస్‌లో అత‌డికి ఏకంగా కెప్టెన్సీ ద‌క్క‌డం విశేషం. ఇక వైస్ కెప్టెన్‌గా భువ‌నేశ్వర్ కుమార్‌ను ఎంపిక చేశారు.

ఇక జ‌ట్టు విష‌యానికి వ‌స్తే… ఇషాన్ కిష‌న్‌, రుతురాజ్ గైక్వాడ్‌, సంజూ శాంస‌న్‌, సూర్య‌కుమార్ యాద‌వ్‌, వెంక‌టేశ్ అయ్య‌ర్‌, దీప‌క్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్ (వికెట్ కీప‌ర్‌), య‌జువేంద్ర చాహ‌ల్‌, అక్ష‌ర్ ప‌టేల్‌, ర‌వి బిష్ణోయ్‌, హ‌ర్ష‌ల్ ప‌టేల్‌, అవేశ్ ఖాన్‌, అర్ష‌దీప్ సింగ్‌, ఉమ్రాన్ మాలిక్‌ల‌ను జ‌ట్టు స‌భ్యులుగా బీసీసీఐ ఎంపిక చేసింది.

Related posts

క్రికెటర్ అవ్వాలనుకునే వారి కోసం.. అతి త్వరలో చెన్నై సూపర్ కింగ్స్ అకాడమీ

Drukpadam

1000వ వన్డేలో విజయం… 28 ఓవర్లలో టార్గెట్ ఛేదించిన టీమిండియా!

Drukpadam

తాలిబన్ల షాకింగ్ నిర్ణయం.. దేశంలో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం!

Drukpadam

Leave a Comment