Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మంలో కేసీఆర్ కు కృతజ్ఞత సభ …సూపర్ హిట్…

ఖమ్మంలో కేసీఆర్ కు కృతజ్ఞత సభ …సూపర్ హిట్…
-టీఆర్ యస్ ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర , బండి పార్థసారథి రెడ్డిలకు ఘనస్వాగతం
-జనసమీకరణలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన నేతలు
-మారనున్న జిల్లా టీఆర్ యస్ రాజకీయ సమీకరణాలు
-ఒక్క పొంగులేటి తప్ప నేతలందరూ హాజరు

ఖమ్మం జిల్లాకు రెండు రాజ్యసభ సీట్లు ఇవ్వడంతో టీఆర్ యస్ శ్రేణులు సంబరాల్లో మునిగి తేలాయి. ఒకేసారి జిల్లాకు రెండు సీట్లు ఇచ్చిన సీఎం కేసీఆర్ కు ఖమ్మం లో గ్రాండ్ కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు …. ఈ సభ సూపర్ హిట్ అవ్వడంతో నిర్వహకులు ఆనంద డోలికల్లో మునిగితేలారు .సభకు ప్రజలను సమీకరించడంలో నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరించారు .దీనితో భారీగానే జనసమీకరణ జరిగింది. ప్రధానంగా వద్దిరాజు రవిచంద్ర సామాజికవర్గానికి చెందినవారు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచే కాకుండా , మహబూబాబాద్ , వరంగల్ జిల్లా నుంచి కూడా అధిక సంఖ్యలో రావడం విశేషం …

సభకు ఉమ్మడి జిల్లాలోని ఒక్క మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తప్ప నాయకులు అందరు హాజరు అయ్యారు . సభలోను ముఖ్యనేతలంతా ప్రసంగించారు . జిల్లాకు ఇప్పుడు 4 గురు ఎంపీలు ఉన్నారని అందరు జిల్లా అభివృద్ధికి కృషి చేయాలనీ వక్తలు ఉద్బోధించారు . అంటే కాకుండా ఉమ్మడి జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ సీట్లకు గాను 10 సీట్లు గెలిపిద్దామని ప్రతిన భూనారు . జిల్లా అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత కేసీఆర్ సీఎం గా 50 వేల కోట్లు ఇచ్చారని గుర్తు చేసుకున్నారు .

రాజ్యసభ ఎంపీలు గా ఎన్నికైన తర్వాత వద్దిరాజు రవిచంద్ర , బండి పార్థసారథిరెడ్డిలు మొదటిసారిగా ఖమ్మం వచ్చారు . వారికీ హైద్రాబాద్ నుంచి ఖమ్మం వరకు దారిపొడవునా అభిమానులు , టీఆర్ యస్ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు . పూలవర్షం కురిపించారు . ఖమ్మం సరిహద్దులనుంచి భారీ కాన్వాయ్ తో ఖమ్మం ఎంపీ నామ తో పాటు కొత్త ఎంపీలకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు . దారిపొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ నాయకులు టాప్ లేని వాహనంలో ఖమ్మం చేరుకోవడానికి గంటల కొద్దీ సమయం పట్టింది. సభ జరుగుతున్నంత సేపు క్రాకర్స్ మోతతో స్టేడియం దద్దరిల్లింది. ఇక వేదిక పక్కన ఏర్పాటు చేసిన కేసీఆర్ ,కేటీఆర్ నిలువెత్తు హోర్డింగ్లు , పెద్ద క్రెయిన్లతో ఏర్పాటు చేసిన దేశాకి నేత కేసీఆర్ , తెలంగాణ భవిషత్ కేటీఆర్ అని ప్రత్యేక లైట్లతో ఏర్పాటు చేసిన బోర్డులు ఆకర్షణగా నిలిచాయి. మొత్తానికి టీఆర్ యస్ పార్టీలో వీరి సభ ఒక జోష్ నింపిందని అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి…

Related posts

ప్రధాని నోటా మరోసారి జమిలి మాట …

Drukpadam

ఎన్డీయే, ప్రతిపక్ష కూటమికి సమాన దూరంగా టీడీపీ…!

Drukpadam

కృష్ణయ్య హత్య తో సిపిఎం కు సంబంధం లేదంటున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని…

Drukpadam

Leave a Comment