Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

మచిలీపట్నం ట్రాఫిక్ సీఐ బాలరాజాజీ అదృశ్యం..

మచిలీపట్నం ట్రాఫిక్ సీఐ బాలరాజాజీ అదృశ్యం.. ఐదు రోజులుగా కనిపించని జాడ

  • బదిలీపై ఈ నెల 16న బందరుకు
  • 20వ తేదీ వరకు విధులకు హాజరు
  • అదే రోజు స్నేహితుడి బైక్ తీసుకుని వెళ్లిన సీఐ
  • కుటుంబ కలహాలే కారణమంటున్న పోలీసులు

మచిలీపట్నం ట్రాఫిక్ సీఐ బాలరాజాజీ అదృశ్యమయ్యారు. ఐదు రోజులుగా ఆయన జాడ లేకపోవడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. విజయవాడలో పనిచేస్తున్న బాలరాజాజీ ఈ నెల 16న ట్రాఫిక్ సీఐగా బదిలీపై మచిలీపట్నం వచ్చారు. 20వ తేదీ వరకు విధులకు హాజరయ్యారు. అదే రోజున స్నేహితుడి బైక్‌పై బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. ఐదు రోజులుగా ఆయన జాడ లేకపోవడంతో పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు.

బాలరాజాజీ ఏలూరు సీఐగా ఉన్న సమయంలో ఓ యువతిని లైంగికంగా వేధించారన్న ఆరోపణలున్నాయి. ఈ కేసులో ఆయన సస్పెండ్ అయ్యారు. గత కొంతకాలంగా వీఆర్‌లో ఉన్న ఆయన వేరే జిల్లాకు బదిలీ చేయమని కోరడంతో విజయవాడకు పంపారు. అక్కడి నుంచి ఇటీవలే మచిలీపట్నానికి బదిలీ అయ్యారు. దీంతో కుటుంబంతో సహా మచిలీపట్నానికి చేరుకున్న బాలరాజాజీ అంతలోనే అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. ఆయన అదృశ్యానికి కుటుంబ కలహాలు కారణం అయి ఉండొచ్చన్న అనుమానంతో ఆ దిశగా విచారణ చేస్తున్నట్టు బందరు డీఎస్పీ మాసుంబాషా తెలిపారు. ఇంట్లో గొడవల నేపథ్యంలో మానసిక ప్రశాంతత కోసం ఆయన ఎక్కడికైనా వెళ్లి ఉండొచ్చని, ప్రాథమిక విచారణలోనూ అదే తేలిందని ఆయన పేర్కొన్నారు.

Related posts

గురుగ్రామ్ లో దారుణం…ఆసుప్రతిలో చేరిన విదేశీ మహిళపై అత్యాచారం…

Ram Narayana

ఖమ్మం జిల్లాకు చెందిన కేరళ ఐపీఎస్ అధికారి పై సస్పెన్షన్ వేటు వేసిన సీఎం విజయన్!

Drukpadam

సరబ్‌జీత్‌సింగ్‌పై పాక్ జైలులో దాడిచేసిన అండర్ వరల్డ్ డాన్ అమీర్ సర్ఫరాజ్‌ కాల్చివేత…

Ram Narayana

Leave a Comment