Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తమిళిసై తేనీటి విందులో పాల్గొన్న కేసీఆర్….

తమిళిసై తేనీటి విందులో పాల్గొన్న కేసీఆర్….
-చాన్నాళ్ల తర్వాత ఎదురుపడ్డ గవర్నర్​ తమిళిసై, సీఎం కేసీఆర్
-గత 9 నెలలుగా రాజ్ భవన్ కు కూడా వెళ్లని కేసీఆర్
-హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణస్వీకారానికి హాజరైన సీఎం
-ఆత్మీయంగా మాట్లాడుకున్న గవర్నర్, ముఖ్యమంత్రి
-హైకోర్టు సీజేగా భూయాన్ ప్రమాణ స్వీకారం..
-భూయాన్ చేత ప్రమాణం చేయించిన గవర్నర్
-అతిథిగా హాజరైన సీఎం కేసీఆర్, కిషన్ రెడ్డి
-కొన్ని నెలలుగా రాజ్‌భవన్‌కు దూరంగా కేసీఆర్

తెలంగాణ గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ కు మధ్య గత కొంత కాలంగా విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత 9 నెలలుగా రాజ్ భవన్ కు కూడా కేసీఆర్ వెళ్లలేదు. అయితే, ఈరోజు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉజ్జల్ భుయాన్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమం రాజ్ భవన్ లో జరిగింది. ఉజ్జల్ భుయాన్ చేత తమిళిసై ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి కేసీఆర్ హాజరవుతారా? లేదా? అనే అనుమానాలకు తెరదించుతూ ఆయన రాజ్ భవన్ కు వెళ్లారు. ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గవర్నర్, ముఖ్యమంత్రి ఇద్దరూ పాత విభేదాలను పక్కన పెట్టి ఆత్మీయంగా పలకరించుకున్నారు. ప్రమాణస్వీకారం అనంతరం గవర్నర్ ఇచ్చిన తేనీటి విందులో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ ఒక టేబుల్ పై కూర్చొని ముచ్చటించారు. ఇదే సందర్భంగా అక్కడే ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కూడా కేసీఆర్ మాట్లాడారు. అందరూ నవ్వుతూ ఆత్మీయంగా మాట్లాడుకోవడంతో అక్కడ ఆహ్లాదకర వాతావరణం నెలకొంది.

రాజ్‌భవన్‌లో జరిగిన ఆధికారిక కార్యక్రమంలో 10 గంటల 5 నిముషాలకు గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌.. జస్టిస్ భూయాన్ చేత ప్రమాణం చేయించారు. జస్టిస్ భూయాన్, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఏర్పడ్డాక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన ఐదో న్యాయమూర్తి. ఇప్పటిదాకా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ పని చేశారు. ఆయన ఢిల్లీ హైకోర్టుకు బదిలీ కావటంతో, ఆయన స్థానంలో జస్టిస్ భూయాన్ ప్రధాన న్యాయమూర్తిగా ఎంపికయ్యారు.

2019 లో ఏర్పాటైన రాష్ట్ర హైకోర్టు మొట్ట మొదటి ప్రధాన న్యాయమూర్తిగా టీబీఎన్ రాధాకృష్ణన్ పని చేశారు. తర్వాత జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ హిమ కోహ్లి, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ ప్రధాన న్యాయమూర్తులుగా సేవలందించారు. ఇంతకు ముందు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ భూయాన్, ముంబై , అసోం హైకోర్టుల్లో న్యాయమూర్తిగా సేవలందించిన అనుభవం ఉంది.

కాగా, భూయాన్ ప్రమాణ స్వీకరానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, పలువురు మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సీఎం కేసీఆర్ చాన్నాళ్ల తర్వాత రాజ్ భవన్ కు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్రంలోని బీజేపీని తీవ్రంగా విమర్శిస్తున్న కేసీఆర్ కు గవర్నర్ తమిళిసైతో కూడా పొసగడం లేదన్న వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొన్నాళ్లుగా తమిళిసై పాల్గొన్న పలు అధికారిక కార్యక్రమాలకు, రాజ్ భవన్ కు కేసీఆర్ దూరంగా ఉన్నారు. దాంతో, హైకోర్టు సీజే ప్రమాణ స్వీకారానికి కూడా హాజరవుతారో లేదో అన్నది చర్చనీయాంశమైంది. అయితే, ప్రోటోకాల్ ప్రకారం రాజ్ భవన్ కు వచ్చిన సీఎం కేసీఆర్… గవర్నర్ కు పుష్పగుచ్ఛం అందించారు. చాన్నాళ్ల తర్వాత ఎదురుపడ్డ ఇరువురూ నవ్వుతూ కనిపించారు.

Related posts

ఇక షావోమీ చౌక కార్లు..! 2024లో విడుదల దిశగా ప్రయత్నాలు…

Drukpadam

శ్రీకాకుళం జిల్లాలో నెత్తురోడిన రైలు పట్టాలు… ఐదుగురి మృతి!

Drukpadam

విడాకుల కేసులో ఇజ్రాయెల్ కోర్టు విచిత్రమైన తీర్పు..

Drukpadam

Leave a Comment