తుళ్లూరు బ్రహ్మయ్య పై దాడిలో మరోకోణం!
-సొంతపార్టీ వాళ్ళ వల్లనే జరిగిందనే అభిప్రాయాలు
-పంచాయతీ లో రెండువర్గాల పరస్పర ఆరోపణలు
-సర్దిచెప్పే ప్రయత్నం చేసిన బ్రహ్మయ్య
-ప్లాన్ ప్రకారం వచ్చిన ఒకవర్గం …
-ఆయనపై దాడికి ప్రయత్నం
-అదిసాధ్యం కాకపోవడంతో కారు ధ్వంసం
టీఆర్ యస్ కు చెందిన డీసీసీబీ డైరక్టర్ , జిల్లా కీలక నేతల్లో ఒకరుగా ఉన్న పినపాక నియోజకవర్గానికి చెందిన తుళ్లూరు బ్రహ్మయ్య పై అశ్వాపురం లో నిన్న జరిగినదాడిపై మరోకోణం ఉందనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇది కావాలని జరిగిన దాడిగానే భావిస్తున్నారు .సొంతపార్టీలోని వారే దీనికి ప్రేరేపించి ఉండవచ్చుననే అభిప్రాయాలు ఉన్నాయి. పినపాక నియోజకవర్గంలో బ్రహ్మయ్య కీలక నేతగా ఉన్నారు . ఒక పక్క అడ్వకేట్ గా వ్యవరిస్తూనే టీఆర్ యస్ లో కీలాగా నేతగా వ్యవహరిస్తున్నారు . మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా ఉంటున్నారు . స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు తో సంబంధాలు అంతంతమాత్రమే ఉన్నాయి. నియోజకర్గంలో గెలుపు ఓటములను శాసించగలిగే స్థాయిలో ఉన్న బ్రహ్మయ్య సొంతపార్టీలో కొందరికి గిట్టని పరిస్థితి ఉంది. పైగా పొంగులేటి ముఖ్య అనుచరుడిగా ఉన్న బ్రహ్మయ్య మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు అనుకూలంగా ఉన్నారనే పేరుంది.
నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న బ్రహ్మయ్య చుట్టుపక్కల గ్రామాల సమస్యలపై స్పందిస్తుంటారు . అనేక మంది బ్రహ్మయ్య దగ్గరకు వచ్చి తమ పంచాయతీలను పరిష్కరించుకోవడం చాల సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగానే ఆయన అశ్వాపురం లో ఉన్నప్పుడు తన ఇంటివద్ద సందడిగా ఉంటుంది. ఆయన ఏ పార్టీ లో ఉన్న ఆయన పై నమ్మకం మంచితనంతో తమకున్న సమస్యలు ఆయనకు చెప్పుకొని పరిష్కరించుకోవడం జరుగుతుంది. అదే క్రమంలో మంగళవారం తన దగ్గరకు వచ్చిన ఇద్దరి మధ్య ఉన్న భూతగాదాను పరిష్కరించేందుకు ప్రయత్నం చేస్తుండగా ఇరువురు వాగ్వివాదానికి దిగారు అందుకు వారిని వారించే ప్రయత్నం చేయగా ఒకవర్గం వారు ముందుగానే వేసుకున్న ప్లాన్ ప్రకారం బ్రహ్మయ్య పై దాడికి దిగారు . అక్కడ ఉన్న బ్రమ్మయ్య అనుచరులు అడ్డుకోగా ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆయన కారు ను ధ్వంసం చేశారు . ఈ ఘటనపై వివిధ పార్టీలకు చెందిన వారు దాడిని ఖండించగా , సొంతపార్టీలోని మరో వర్గం వారు కనీసం ఖండించకపోవడం పై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి….