Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బీజేపీలో మగాళ్లు లేరా?: ఓ మహిళను బలిపశువు చేశారు: ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి

ఇబ్బందులు పడుతున్న ప్రతిసారి బీజేపీకి మతాన్నిముందుకు తేవడం అలవాటైంది:రేణుక చౌదరి!
-ఒక్క నీపూర్ శర్మ కాదు మొత్తం బీజేపీ నాయకత్వం దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
-చెవులు పట్టుకొని మైనార్టీలను మన్నించాలని వేడుకోవాలి
-బీజేపీ అగ్రనేతలు నుపుర్ శర్మను రెచ్చగొట్టారు
తప్పు నాయకులు చేసి నింద  నీపూర్ మీద వేశారని ఆరోపణ

హైదరాబాద్ కేంద్రంగా.. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం చురుగ్గా సన్నాహాలు కొనసాగుతున్న వేళ- ఉద్వాసనకు గురైన ఆ పార్టీ నాయకురాలు నుపుర్ శర్మ వ్యవహారం కాస్త ఇబ్బందులకు గురి చేస్తోంది. విమర్శలకు కేంద్రబిందువు అవుతోంది. మహ్మద్ ప్రవక్తను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలను దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం తప్పు పట్టింది. దేశంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొనడానికి కారణం అయ్యాయని పేర్కొంది. యావత్ దేశానికి క్షమాపణ చెప్పాలంటూ ఆదేశించింది.

దీనిపై తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీమంత్రి రేణుకా చౌదరి స్పందించారు. కొద్దిసేపటి కిందటే ఆమె తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ నాయకులు తమ పార్టీ ప్రయోజనాల కోసం మతం అనే సున్నితమైన అంశాన్ని తెర మీదికి తీసుకొచ్చిందని వ్యాఖ్యానించారు. తాను ఇబ్బందుల్లో పడిన ప్రతీసారీ బీజేపీ నాయకులు.. ఈ అంశాన్ని ప్రస్తావిస్తోన్నారంటూ ఆరోపించారు. ఇబ్బందులు వచ్చిన ప్రతీసారీ మతాన్ని అడ్డం పెట్టుకుంటోందని ధ్వజమెత్తారు.

మహ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో నుపుర్ శర్మ మాత్రమే క్షమాపణలు చెప్పడం సరికాదని రేణుకా చౌదరి తేల్చి చెప్పారు. మొత్తం బీజేపీ నాయకులందరూ దేశ ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. చెవులు పట్టుకుని మైనారిటీలకు మన్నించాలని వేడుకోవాలని అన్నారు. బీజేపీ పరిస్థితి దయనీయంగా తయారుకావడానికి ఎంతో కాలం ఎదురు చూడాల్సిన అవసరం లేదని చెప్పారు.

తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఓ మహిళను బలిపశువు చేశారంటూ మండిపడ్డారు. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసే విషయంలో బీజేపీ అగ్ర నాయకులు నుపుర్ శర్మను రెచ్చగొట్టారని ఆరోపించారు. తప్పు వాళ్లు చేసి, నిందలను నుపుర్ శర్మపై వేశారని, పార్టీ నుంచి తొలగించి, అవమాన పరిచారని రేణుకా చౌదరి విమర్శించారు. మహిళకు బదులుగా తాము ముందుకు వచ్చి, క్షమాపణ చెప్పడానికి బీజేపీలో మగాళ్లు ఎవరూ లేరా? అని ప్రశ్నించారు. దేంట్లోనైనా దూకి చావండి అంటూ ఘాటుగా విమర్శించారు.

Related posts

తెలంగాణలో జనసేన సహా… కామన్ సింబల్ ను కోల్పోయిన పలు పార్టీలు!

Drukpadam

ఏపీ ప్రభుత్వంపై సమయం వచ్చినప్పుడు మాట్లాడతా ..బీజేపీ నేత కిరణ్ కుమార్ రెడ్డి…

Drukpadam

ఎన్నికల సర్వే సంస్థపై హైకోర్టులో పిటిషన్ వేస్తున్నాం: కేఏ పాల్

Drukpadam

Leave a Comment