Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ప్రధాని తప్ప మిగతా నేతలకు కేసీఆర్ టార్గెట్ !వ్యూహాత్మకంగా ప్రధాని ప్రసంగం

కారులో కేసీఆర్ కుటుంబానికి తప్ప ఇతరులకు స్థానం లేదు: జేపీ నడ్డా!

  • సికింద్రాబాద్ లో బీజేపీ విజయసంకల్ప సభ
  • ప్రసంగించిన జేపీ నడ్డా
  • మోదీని చూసేందుకు భారీగా తరలివచ్చారని వెల్లడి
  • కేసీఆర్ సర్కారు పోవడం ఖాయమని ధీమా
  • తెలంగాణ ప్రభుత్వం 4 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని ఆరోప
హైద్రాబాద్ లో బీజేపీ జాతీయ సమావేశాల సందర్భంగా పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన సభలో ఒక్క ప్రధాని మినహా మిగతా నేతల ప్రసంగాలు కేసీఆర్ టార్గెట్ గానే సాగాయి. ప్రధాని మాత్రం వ్యూహాత్మకంగా తెలంగాణ ప్రజలు డబులు ఇంజన్ సర్కార్ కు బాటలు వేస్తున్నారని పేర్కొన్నారు . సభకు బీజేపీ ప్రజలను భారీగా సమీకరించింది. వచ్చిన ప్రజలనుద్దేశించి సాగిన ప్రనంసంగాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల లలో జరిగిన అభివృద్ధిని గురించి ఏకరువు పెట్టారు . సభలో అమిత్ షా , జెపి నడ్డా , యోగి ఆదిత్యనాథ్ , బండి సంజయ్ , ఈటల రాజేందర్ లు ప్రసంగించారు .

తెలంగాణ గడ్డపై ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగించారు. ప్రియతమ నేత నరేంద్ర మోదీని చూసేందుకు భాగ్యనగరానికి ఇంతమంది పోటెత్తారని వెల్లడించారు. అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు.

తెలంగాణలో కేసీఆర్ పాలన పోవడం, బీజేపీ పాలన రావడం ఖాయమని నడ్డా ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ను ఇంట్లో కూర్చోబెట్టాలని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల ద్వారా ప్రజలు బీజేపీకి కొత్త బలాన్ని ఇచ్చారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ఏటీఎంలా మార్చుకున్నారని ఆరోపించారు. కారులో కేసీఆర్ కుటుంబానికి తప్ప ఇతరులకు చోటు లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం 4 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని నడ్డా ఆరోపించారు.

ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణలో బీజేపీదే విజయం: అమిత్‌షా!

  • మంత్రగాళ్ల మాటలు వినే కేసీఆర్ సచివాలయానికి వెళ్లలేదు
  • మూఢ నమ్మకాలున్న వ్యక్తి సీఎంగా ఉండొద్దు
  • తెలంగాణ తిరోగమనంలో పడిందని వ్యాఖ్య
No matter How many obstacles you create BJP will win in Telangana says Amit Shah
ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి అమిత్‌ షా అన్నారు. ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌ లో జరిగిన బీజేపీ ‘విజయ సంకల్ప సభ’లో అమిత్‌ షా ప్రసంగించారు. తన కుమారుడు కేటీ రామారావును సీఎం చేయాలనేదే కేసీఆర్‌ ఆలోచన అని, తెలంగాణ ప్రజల గురించి ఆయనకు అవసరం లేదని విమర్శించారు. రాష్ట్రంలో యువతకు ఉపాధి లేదని.. కేసీఆర్‌ దృష్టిలో యువతకు ఉపాధి అంటే తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేసుకోవడమేనని మండిపడ్డారు. దేశం ముందుకు వెళుతుంటే.. తెలంగాణ తిరోగమనంలో పడిపోయిందని వ్యాఖ్యానించారు.

ఎంఐఎం చేతిలో టీఆర్‌ఎస్‌ స్టీరింగ్‌

టీఆర్‌ఎస్‌ పార్టీ గుర్తు కారు అని.. కానీ దాని స్టీరింగ్ మాత్రం ఎంఐఎం, ఓవైసీల చేతుల్లో ఉందని అమిత్‌ షా విమర్శించారు. అందుకే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని మండిపడ్డారు. అసలు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని టీఆర్‌ఎస్‌ ఎందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ కు మూఢ నమ్మకాలు ఎక్కువని.. అందుకే ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్నా సచివాలయానికి వెళ్లలేదని ఆరోపించారు. కేసీఆర్‌ ఆ సచివాలయానికి వెళితే ప్రభుత్వం కూలిపోతుందని మంత్రగాళ్లు చెప్పారన్న ఉద్దేశమే దీనికి కారణమన్నారు. ఇలాంటి నమ్మకాలున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగడం సరికాదని వ్యాఖ్యానించారు. అయినా ఇక ముందు సచివాలయానికి వెళ్లేది బీజేపీ ముఖ్యమంత్రే అని అమిత్ షా పేర్కొన్నారు.

తెలంగాణలో కమల వికాసమే..: యోగి ఆదిత్యనాథ్‌!

  • ఆ రోజులు త్వరలోనే వస్తాయి
  • టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ అరాచకాలను ఎదిరించాలి
  • బీజేపీని అడ్డుకోవడానికి చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలి
  • యూపీలో డబుల్‌ ఇంజన్‌ సర్కారుతో అభివృద్ధి జరుగుతోందని వెల్లడి
Kamala Vikasam in Telangana soon says Yogi Adityanath

ప్రధాని మోదీ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కమలం వికసిస్తుందని, త్వరలోనే ఆ రోజులు వస్తాయని ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పేర్కొన్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ సర్కారు ఏ ఒక్క కేంద్ర పథకాన్ని కూడా సరిగా అమలు చేయడం లేదని మండిపడ్డారు. ప్రతి కేంద్ర పథకానికి రాష్ట్ర ప్రభుత్వమే అమలు చేస్తున్నట్టుగా ముద్ర వేసుకుంటోందని ఆరోపించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశంలో వచ్చిన మార్పులు అందరి కళ్ల ముందు కనిపిస్తున్నాయని చెప్పారు. ప్రధాని మోదీ అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని ప్రారంభించడంతోపాటు కాశీలో విశ్వనాథుడి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారని గుర్తు చేశారు.

టీఆర్‌ఎస్‌ కుట్రలను అడ్డుకోవాలి
రాష్ట్రంలో బీజేపీని అడ్డుకోవడానికి టీఆర్‌ఎస్‌ కుట్రలకు పాల్పడుతోందని.. గతంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ కు బుద్ధి చెప్పినట్టుగా, మళ్లీ తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్‌ లో బీజేపీ డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం ఉండటంతో భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. పేదల కోసం 45 లక్షల ఇళ్లు కట్టించామని.. ఆ రాష్ట్రంలో 6 కోట్ల మందికి ఆయుష్మాన్‌ భారత్‌ కింద ఆరోగ్య బీమా అమలు చేస్తున్నామని తెలిపారు. కరోనా సంక్షోభంలో 15 కోట్ల మందికి నెలకు రెండు సార్లు ఉచితంగా రేషన్‌ బియ్యం అందించామన్నారు.

Related posts

ఖమ్మం ,నల్లగొండ ,వరంగల్ పట్టభద్రుల ఓట్లు 4 .91 లక్షలు

Drukpadam

జిన్నాను హత్య చేసి ఉంటె ….శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ……

Drukpadam

టీడీపీ,జనసేనలకు దమ్ము లేదు గానీ ఆశ మాత్రం ఉంది…కరణం వెంకటేశ్!

Drukpadam

Leave a Comment