చంద్రబాబు ఎన్డీఏలో చేరేందుకు తహతహ …స్కేచ్ వర్క్ అవుట్ అవుతుందా ?
అడగ కుండానే ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ముర్ము కు మద్దతు
ఆమె తో భేటీకి భారీగా లాబీయింగ్
చివరకు చంద్రబాబు అండ్ కో తో ముర్ము సమావేశం …
ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పిన ఎంపీ
చంద్రబాబు తిరిగి ఎన్డీఏ గూటికి దగ్గరయ్యేందుకు తహతహ లాడుతున్నారు … అనేక సార్లు ప్రధాని , హోమ్ మంత్రిని కలిసేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ ఆయనకు అపాయింట్మెంట్ సైతం లభించలేదు. రాష్ట్రపతి ఎన్నికలు వచ్చాయి. దీన్ని అవకాశంగా మలుచుకోవాలని అనుకున్న చంద్రబాబు అందుకు భారీ స్కేచ్ వేశారు . ఆయన వేసిన స్కేచ్ వర్క్ అవుట్ అవుతుందా ? లేదా ? అనే మీమాంస వ్యక్తం అవుతుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కు ఓట్లు వేసినంత మాత్రాన బీజేపీ ఎగిరి గంతేసి చంద్రబాబును కౌగిలించుకుంటుందని అనుకోవడం అత్యాశే అవుతుందనే అభిప్రాయాలూ ఉన్నాయి.
2018 ఎన్నికలకు ముందు ఎన్డీఏ కు గుడ్ బై చెప్పి యూపీఏ లోచేరిన చంద్రబాబు వ్యవహారశైలిపై బీజేపీకి కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. అందువల్లనే రాష్ట్రపతి ఎన్నికల్లో చంద్రబాబు మద్దతు అడగలేదు .అయినప్పటికీ తమ మద్దతు ఎన్డీఏ అభ్యర్థి ముర్ముకే అని ప్రకటించడం పై రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ప్రతిపక్షాలు సైతం చంద్రబాబును విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక సందర్భంగా ఆహ్వానించలేదు . అందువల్ల ఎటు కాకుండా ఉండటం …బీజేపీ దగ్గరికి రానివ్వకపోవడం తో రాష్ట్రపతి ఎన్నికను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా ప్రారంభించారు .
రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ ఓట్లను బీజేపీ అడగకపోయినప్పటికీ తాము ఎన్డీఏ అభ్యర్థిగా పోటీచేస్తున్న ముర్ముకు వేస్తామని ప్రకటించటం ద్వారా బీజేపీకి దగ్గరయ్యేందుకు వెంచుకున్న ప్లాన్ సెక్సెస్ అయినదని తెలుగు దేశం వర్గాలు భావిస్తున్నాయి. తమ అధినేత చంద్రబాబునాయుడు తీసుకొన్న రాజకీయానిర్ణయాలు దూరదృష్టితో ఉంటాయని అంటున్నారు .
అయితే జగన్ అధికారంలో ఉన్నారు . రాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ ఓట్లు కీలకం …చంద్రబాబు ఓట్లు వేసినా వేయకపోయినా ఒకటే …జగన్ అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వానికి , ప్రధాని మోడీకి విధేయుడిగా ఉంటూ ముందుకు సాగుతున్నారు . జనాకర్షక నేతగా ఉన్న జగన్ ను దూరం పెట్టుకోవాలని బీజేపీ కేంద్ర నాయకత్వం సైతం భావించకపోవచ్చు . అందువల్ల చంద్రబాబు ఎన్ని స్కేచ్ లు వేసినా బీజేపీ ముందు పాచికలు పరకపోవచ్చుఅనే అభిప్రాయాలూ ఉన్నాయి. అయితే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అంటున్నారు పరిశీలకులు …చూద్దాం ఏమిజరుగుతుందో !