Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

వరద నీటిలో కొట్టుకుపోయిన జగిత్యాల ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ !

వరద నీటిలో కొట్టుకుపోయిన జగిత్యాల ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ !
-రాత్రి నుంచి ఇంతవరకు లభ్యం కానీ ఆచూకీ
-గాలింపు చర్యలు ముమ్మరం …రంగంలోని ఎన్ డీ ఆర్ ఎఫ్ బృందాలు
-జమీర్ ప్రాణాలతో బయటకు రావాలని కోరుకుంటున్న జర్నలిస్టులు
-ఓ రెస్క్యూ ఆపరేషన్ ని కవర్ చేసి వస్తుండగా దుర్ఘటన
-వరద నీటిలో కొట్టుకుపోయిన వాహనం..అందులో ఉన్న మరో వ్యక్తి సేఫ్

 

జగిత్యాల జిల్లా ఎన్టీవీ రిపోర్టర్ గా పనిచేస్తున్న జమీర్9 35 ) వార్త కవరేజ్ కోసం వెళ్లి …తిరిగి వస్తుండగా కారుతో సహా వాగులో కొట్టుకొని పోయిన సంఘటన విషాదాన్ని నింపింది. విషాద్ అనే స్నేహితుడితో కలిసి సాయంత్రం నదిలో కొంతమంది కూలీలు చిక్కుకున్నారని తెలిసి వార్త కవర్ చేద్దామని జమీర్ వెళ్లారు . జమీర్ ఆ వార్తను తన కెమెరా లో బందించి తిరిగి వస్తుండగా రాయికల్ మండలం రామోజీ పేట వద్ద కాజ్ వే పై వాగు పొంగి ప్రవహిస్తుంది. దాన్ని దాటుకొని వెళ్లాలనే ఉద్దేశంతో వస్తుండగా కారు నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో నీళ్లలో కొట్టుకొని పోయింది. రాత్రి జరిగిన ఈ సంఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తెలియటంతో మీడియా మిత్రులు జమీర్ క్షేమంగా ప్రాణాలతో తిరిగి రావాలని కోరుకుంటున్నారు . అందుకోసం జిల్లా అధికార యంత్రాంగం సైతం ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించింది. ఎన్ డీ ఆర్ ఎఫ్ బృందాలను సైతం రంగంలోకి దించి గాలింపు చర్యలను వేగవంతం చేసింది.

సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

భారీ వర్షాలు, వరదలను ఉన్నప్పటికీ వృత్తి ధర్మమే ముఖ్యమని భావించి వార్త కవర్ చేయడానికి వెళ్లిన ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ ఆచూకీ లభ్యం కాకపోవడం తో ఆచూకీ కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు . జగిత్యాల రిపోర్టర్ గా పని చేస్తున్న జమీర్ కారులో రిపోర్టింగ్ కు బయల్దేరారు. అయితే భారీ వరదల నేపథ్యంలో కారు వరదలో చిక్కుకుంది. ఆ తర్వాత వరద ప్రవాహం మరింత పెరగడంతో కారు కొట్టుకుపోయింది. కుర్రులో (నదిలో ఒక లంక లాంటి ప్రాంతం) చిక్కుకుపోయిన వ్యవసాయ కార్మికుల రెస్క్యూ ఆపరేషన్ ను కవర్ చేసి వస్తున్న క్రమంలో ఆయన గల్లంతయ్యారు. మరోవైపు జమీర్ కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. అయితే, ఆ కారులో ఉన్న విషాద్ మాత్రం ప్రమాదం నుంచి బయటపడ్డారు. జమీర్ ఆచూకీ ఇంతవరకు లభించలేదు.

జమీర్ తోపాటు కారు లో ఉంది ప్రాణాలతో బయటపడ్డ విషాద్

జగిత్యాల ఎన్టీవీ రిపోర్టర్ గా పనిచేస్తున్నాను జమీర్ వాగులో కొట్టుకుపోయి సంఘటన ఆందోళన కరంగా మారింది. ఎన్ టీవీ లో కొన్ని సంవత్సరాలుగా పని చేస్తున్న జమీర్ వార్తల సేకరణలో చాలా చురుగ్గా పాల్గొనేవాడు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తుండడంతో గోదావరి నదిలో కొంత మంది చిక్కుకు పోయారు అన్న సమాచారం తెలుసుకుని ఆ వార్తను కవర్ చేద్దామనే ఉద్దేశంతో కెమెరా పెట్టుకొని వార్త సేకరణ కోసం వెళ్ళాడు. ఈ వార్తను కవర్ చేశాడు. దాన్ని తన కెమెరాలో బంధించి తీసుకొని తిరిగి వస్తున్న సమయంలో రాయికల్ మండలం లోని రామోజీ పేట దగ్గర రహదారిపై వాగు పొంగి ప్రవహిస్తుంది .అయినప్పటికీ ఆ దారి గుండా బయటకు వెళ్లవచ్చుననే ఉద్దేశంతో వెళ్లగా బలంగా వచ్చిన వరదల ప్రవాహానికి కారు కొట్టుకొని పోయింది. ఈ సందర్భంగా కారులో ఉన్న మరో విషాద్ అనే వ్యక్తి దూకి ఒడ్డుకు చేరుకోగా జమీర్ మాత్రం కార్ లోని ఉండిపోయారు. దీంతో కారు ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. కరీంనగర్ జిల్లా అధికార యంత్రాంగం, జగిత్యాల జిల్లా అధికార యంత్రాంగం పోలీసులు చుట్టూ పక్క గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఇంతవరకు ఆచూకీ దొరకలేదని తెలుస్తుంది .పలువు రాజకీయ నాయకులూ మీడియా ప్రతినిధులు , అధికారులు , ప్రజలు సంఘటన స్థలాన్ని సందర్శించారు . కారు రాత్రి కొట్టుకొని పోయిన స్థలం వద్ద నుంచి వరద ప్రవాహానికి మరికొంత దూరం వెళ్లి ఉండవచ్చునని ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు అంటున్నాయి. జమీర్ ప్రాణాలతో బయటకు వస్తే బాగుంటుందని బంధువులు , స్నేహితులు , జర్నలిస్టులు , కోరుకుంటున్నారు . జమీర్ కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు .

 

 

Related posts

పశ్చిమ బెంగాల్‌లో మళ్లీ హింస.. నిలిచిపోయిన రైలు సర్వీసులు!

Drukpadam

ఆత్మరక్షణ కోసమే క్యాబ్ డ్రైవర్‌పై చేయి చేసుకున్నా.. చెంపదెబ్బ కేసులో యువతి ట్విస్ట్!

Drukpadam

తెలంగాణాలో మరో మెడికో ఆత్మహత్య…

Drukpadam

Leave a Comment