Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తిరుపతి లో ఓడితే రాజీనామా … మంత్రి పెద్ది రెడ్డి సవాల్

తిరుపతి లో వైకాపా ఓడితే లోకసభ సభ్యుల రాజీనామా … మంత్రి పెద్ది రెడ్డి సవాల్
-తెలుగుదేశం రాజీనామాకు సిద్ధమా ?
-వారి ముగ్గురు సభ్యులతోపాటు వారి మిత్రుడు రాఘురామ తోకలిసి రాజీనామాకు చేయాలి
-ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు
-ఇప్పటికే ఓవరేమిటో ప్రజలు అర్థం చేసుకున్నారు
-తిరుపతి లోకసభ ఎన్నికల ప్రచారం హీటెక్కింది. సవాళ్లు ,ప్రతి సవాళ్లతో నాయకులు కత్తులు దూసుకుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ తిరుపతి లో నిర్వవించ తలపెట్టిన సభ రద్దుకావడం ఓటమి భయంతోనేని తెలుగుదేశం అంటుంది. చంద్రబాబు ,లోకేష్ పర్యటనలు ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. జరిగేది ఒక్క సీటుకే అయినా రాష్ట్ర రాజకీయాలలో కీలకం కానుండటంతో మాటల దాడి పతాక స్థాయికి చేరింది. విమర్శలు ,ప్రతి విమర్శలతో తిరుపతి ఎన్నికల క్షేత్రం రణరంగాన్ని తలపిస్తుంది. ఎమ్మెల్యేలను తరిమి కొడతా అని చేసిన హెచ్చరికలు చర్చనీయాంశం అయ్యాయి. వివేకానంద రెడ్డి హత్య కేసు దగ్గర నుంచి ప్రత్యేక హోదా,విశాఖ స్టీల్ ప్రవేటీకరణ అంశాలు ప్రధానంగా ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికైనప్పటికీ కేంద్ర ప్రభుత్వ వాగ్దానాలు ,విభజన హామీలు పక్కకు పోయాయి. ప్రచారం అంత రాష్ట్ర రాజకీయాల చుట్టే తిరుగుతుంది . ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని టార్గట్ గా తెలుగుదేశం ప్రచారం నిర్వహిస్తుంది. వివేకానందరెడ్డి హత్య కేసులో తన కుటుంబానికి సంబంధంలేదని జగన్ రెడ్డి దేవుడి సాక్షిగా ప్రమాణం చేయగలరా అని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాల్ విసిరారు . తామే ఈ ఎన్నికల్లో గెలుస్తామని అన్నారు.దానికి స్పందించిన రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి తెలుగుదేశం గెలిస్తే తమ పార్టీకి చెందిన లోకసభ ఎంపీ లు అందరు రాజీనామాకు సిద్ధం . తెలుగుదేశం ఓడిపోతే వారికి ఉన్న ముగ్గురు లోకసభ సభ్యులతోపాటు వారికీ మిత్రుడుగా ఉన్న రాఘురామ కృష్ణంరాజు తో రాజీనామా చేయిస్తారా ?అని సవాల్ విసిరారు. ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న జరిగిన మున్సిపల్ ,పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు మరోసారి తెలుగుదేశానికి బుద్దిచెప్పినా అర్థం చేసుకోవటం లేదు. ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయి. కరోనా కాలంలో ప్రజలను ఆదుకున్న ముఖ్యమంతిగా జగన్ మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచి పోతారు. ఓటమి తప్పదని గ్రహించిన తెలుగుదేశం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. ఈ ఎన్నిక పార్లమెంట్ కు జరిగేది ఏమైనా ఉంటె కేంద్రాన్ని ప్రశ్నించాలి కాని ఇక్కడ ప్రతిపక్షం కేంద్రాన్ని అడగాల్సిన విషయాను గురించి అసలు పట్టించుకోదు . వారిని ఏమి అడగరు. ఇక బీజేపీ కేంద్రంలో రావాల్సినవాటిపై నోరు మెదపద.. అభ్యర్థి మతం కులం గురించే కావాలి ఎవరు ఏకులం ,ఏ మతం అనేది కాదు ఎవరు ప్రజలకు మంచి చేస్తారో వారిని ఎన్నుకోవాలి .వైకాపా అభ్యర్థి హిందూ కాదు క్రిస్టియన్ అని ప్రచారం మొదలు పెట్టిందని విమర్శించారు. బీజేపీ హోదా విషయం లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే తిరుపతి ప్రజలకు ఎవరు ఏమిటో తెలుసునని ఎవరు ఎన్ని ప్రచారాలు చేసిన వైకాపా గెలుపును ఆపలేరని పెద్ది రెడ్డి అన్నారు.

Related posts

వివేకా హత్యతో అవినాష్‌రెడ్డికి సంబంధం లేదు!

Drukpadam

పొంగులేటిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన సీఎల్పీ నేత భట్టి!

Drukpadam

ప్రశాంత్ కిషోర్‌ వ్యాఖ్యలపై సల్మాన్ ఖుర్షీద్ మండిపాటు…

Drukpadam

Leave a Comment