Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఏ పదాన్ని కూడా నిషేధించలేదు: లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా స్పష్టీకరణ!

ఏ పదాన్ని కూడా నిషేధించలేదు: లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా స్పష్టీకరణ!
-జాబితాలో ఉన్నవి గతంలో రికార్డుల నుంచి తొలగించిన పదాలేనన్న స్పీకర్
-అన్ పార్లమెంటరీ పదాల డిక్షనరీని విపక్ష నేతలు చదివారా? అంటూ ప్రశ్న
-చదివుంటే దురభిప్రాయాలను ప్రచారం చేసేవారు కాదని వ్యాఖ్య

పార్లమెంటులో కొన్ని పదాలను నిషేధించిన అంశం రాజకీయ దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. విపక్షాలు ఈ నిర్ణయంపై విరుచుకుపడుతున్నాయి. నిషేధించిన పదాలను తాను సభలో వాడతానని… తనను లోక్ సభ స్పీకర్ సస్పెండ్ చేసుకోవచ్చని టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ సవాల్ కూడా విసిరారు. ఈ నేపథ్యంలో దీనిపై స్పష్టతనిస్తూ.. ఏ ఒక్క పదాన్ని కూడా నిషేధించలేదని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. తాము విడుదల చేసిన జాబితాలో ఉన్నవి గతంలో రికార్డుల నుంచి తొలగించిన పదాలని చెప్పారు. వాడకూడదని మాత్రమే తెలిపామని నిషేధించినట్లు ఎక్కడ చెప్పలేదని స్పీకర్ బిర్లా స్పష్టం చేశారు .

అన్ పార్లమెంటరీ పదాలను గతంలో బుక్ రూపంలో విడుదల చేసేవారని… పేపర్ వేస్ట్ చేయడం ఎందుకని… ఇప్పుడు ఆ పదాలను ఇంటర్నెట్ లో పెట్టామని ఓం బిర్లా తెలిపారు. అన్ పార్లమెంటరీ పదాలతో కూడిన 1,100 పేజీల డిక్షనరీని వాళ్లు (విపక్షాలు) చదివారా? అని ఓం బిర్లా ప్రశ్నించారు. ఒకవేళ చదివున్నట్టయితే ఇలాంటి దురభిప్రాయాలను ప్రచారం చేసేవారు కాదని అన్నారు. 1954, 1986, 1992, 1999, 2004, 2009, 2010లో అభ్యంతరకర పదాలను విడుదల చేశారని… 2010 నుంచి ప్రతి ఏటా విడుదల చేస్తున్నారని చెప్పారు.

Related posts

రాహుల్ గాంధీ పై కేంద్రం కక్ష్యకట్టిందా …?

Drukpadam

సీఎం రేసులో ఉన్నాను … అవకాశం ఇస్తే హోదాగా కాకుండా భాద్యతగా భావిస్తా …సీఎల్పీ నేత భట్టి!

Drukpadam

గుజరాత్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ వరాలు…అభివృద్ధి కోసమే కాంగ్రెస్ :రాహుల్

Drukpadam

Leave a Comment