Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఢిల్లీలో మౌన దీక్ష‌కు దిగిన కేఏ పాల్‌!

ఢిల్లీలో మౌన దీక్ష‌కు దిగిన కేఏ పాల్‌!

  • విభ‌జ‌న చ‌ట్టం హామీల అమ‌లే ప్ర‌ధాన డిమాండ్‌గా పాల్ దీక్ష‌
  • బుధ‌వారం జంత‌ర్‌మంత‌ర్ వ‌ద్ద నిర‌స‌న‌కు దిగ‌నున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌
  • ఆగ‌స్టు 15 త‌ర్వాత ఆమ‌ర‌ణ దీక్ష‌కు దిగుతాన‌న్న ప్రజా శాంతి పార్టీ అధినేత‌

ప్రముఖ క్రైస్త‌వ మ‌త బోధ‌కుడు, ప్ర‌జా శాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ దేశ రాజ‌ధాని ఢిల్లీలోని రాజ్ ఘాట్‌లో దీక్ష‌కు దిగారు. శ‌నివారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు మౌన‌ దీక్ష‌కు దిగిన ఆయ‌న 3 గంట‌ల పాటు త‌న దీక్ష కొన‌సాగుతుంద‌ని ప్ర‌క‌టించారు. ఏపీ విభ‌జ‌న చ‌ట్టంలోని హామీలను అమ‌లు చేయాల‌న్న ప్ర‌ధాన డిమాండ్‌తోనే తాను ఈ దీక్ష‌ను చేప‌ట్టిన‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. గ‌డ‌చిన 8 ఏళ్లుగా విభ‌జ‌న చ‌ట్టంలోని హామీల‌ను అమ‌లు చేయ‌కుండా కేంద్రం, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తొక్కిపెట్టార‌ని ఆయ‌న ఆరోపించారు.

రాష్ట్ర విభ‌జ‌న చ‌ట్టం హామీల అమ‌లు కోసం వ‌చ్చే బుధ‌వారం ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద నిర‌స‌న‌కు దిగ‌నున్న‌ట్లు కేఏ పాల్ ప్ర‌క‌టించారు. అప్ప‌టికీ విభ‌జ‌న చ‌ట్టం హామీలు అమ‌లు కాకుంటే ఆగ‌స్టు 15 నుంచి త‌ర్వాత ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌కు దిగుతాన‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. తెలుగు ప్ర‌జ‌లు స‌త్తా చూప‌క‌పోతే విభ‌జ‌న చ‌ట్టం హామీలు అమ‌లు కావ‌న్న పాల్‌.. ఈ కార‌ణంగానే తాను దీక్ష‌ల‌కు దిగుతున్న‌ట్లు తెలిపారు.

ka paul deeksha at raj ghat in delhi

Related posts

మోదీ, అమిత్ షా, యోగిలపై విరుచుకుపడిన ‘సామ్నా’

Drukpadam

పార్లమెంట్ సమావేశాలు వాష్ అవుట్ కావడంపై వెంకయ్యనాయుడు కంట కన్నీరు!

Drukpadam

బీజేపీ రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా ఈ నెల 18 న ఇందిరాపార్క్ వద్ద టీఆర్ యస్ ధర్నా …కేసీఆర్!

Drukpadam

Leave a Comment