మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్!
- తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పుస్తకావిష్కరణ
- పుస్తకాన్ని రచించిన ఏపీ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్
- అల్లూరి చిత్రపటాన్ని కూడా ఆవిష్కరించిన సీఎం జగన్
‘మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు’ పుస్తకాన్ని ఏపీ సీఎం జగన్ ఇవాళ ఆవిష్కరించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ పుస్తకావిష్కరణ నిర్వహించారు. ఈ పుస్తకాన్ని ఏపీ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ రేగుళ్ల మల్లికార్జునరావు రచించారు. ఈ సందర్భంగా అల్లూరి చిత్రపటాన్ని కూడా సీఎం జగన్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత రేగుళ్ల మల్లికార్జునరావు, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, రాష్ట్ర గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తదితరులు పాల్గొన్నారు.