రాజ్యసభలో బీజేపీ విప్‌గా జీవీఎల్ నరసింహారావు నియామకం!
- దక్షిణాది రాష్ట్రాల కోటాలో జీవీఎల్‌కు విప్
- 4 రాష్ట్రాల బీజేపీ సభ్యుల సమన్వయం జీవీఎల్ బాధ్యత
- అధికారికంగా ప్రకటించిన బీజేపీ
బిజెపి సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో బిజెపి విప్ గా నియమితులైయ్యారు . ఆయన తెలుగు రాష్ట్రాల నుండి రాజ్యసభలో ఉన్నారు. ఇటీవలనే తెలంగాణ నుంచి డాక్టర్ కె లక్ష్మణ్ ను కూడా బీజేపీ యూపీ నుంచి రాజ్యసభ కు ఎంపిక చేసింది. గతంలో ఆయన బిజెపిలో వివిధ పదవులను అలంకరించారు . ఆర్ఎస్ఎస్ కార్యకర్త తన జీవితాన్ని ప్రారంభించి జీవీఎల్ వివిధ హోదాలలో బిజెపికి సేవలందించారు. అందువల్లనే ఆయన్ని బీజేపీ అధిష్టానం ఉత్తరప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యుడిగా నియమించింది. క్రమశిక్షణ నైతిక ప్రవర్తన, నీతి నియమాలు కలిగిన జీవీఎల్ బిజెపి అభివృద్ధిలో తనదైన పాత్ర నిర్వహించారు .అందువల్లనే ఆయన సేవలను గుర్తించిన బిజెపి దక్షిణాది రాష్ట్రాల సమన్వయం చేసేందుకు నియమించింది తెలంగాణ ఆంధ్ర తోపాటు కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలకు చెందిన రాజ్యసభ సభ్యులను ఆయన సభలో సమన్వయం చేయనున్నారు.
తెలుగు నేలకు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావును మరో కీలక పదవి వరించింది. రాజ్యసభలో బీజేపీ విప్‌గా ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ అధిష్ఠానం మంగళవారం నిర్ణయం తీసుకుంది. ఆయా రాష్ట్రాలకు చెందిన పార్టీ సభ్యులను సమన్వయం చేసుకునేందుకు పార్టీ నేతలకు విప్ పదవులను కేటాయిస్తున్న సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగానే దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పార్టీ సభ్యులను సమన్వయం చేసుకునేందుకు జీవీఎల్ నరసింహారావును బీజేపీ విప్‌గా నియమించింది. ఈ హోదాలో జీవీఎల్… ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన పార్టీ సభ్యులను సమన్వయం చేసే బాధ్యతలను చేపట్టనున్నారు.