Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కోమటిరెడ్డి వ్యవహారంపై అధిష్టానం సీరియస్ …బీజేపీ పాట పడటంపై గుస్సా …

కోమటిరెడ్డి వ్యవహారంపై అధిష్టానం సీరియస్ …బీజేపీ పాట పడటంపై గుస్సా …
-అలాంటి వాళ్ళ వల్ల పార్టీకి నష్టమేనని అంటున్న కాంగ్రెస్ పెద్దలు
-కేసీఆర్ ను ఓడించే సత్తా బీజేపీకే ఉందన్న కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి
-కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా మారిన కోమటిరెడ్డి అంశం
-కోమటిరెడ్డి వ్యాఖ్యల క్లిప్పింగ్ లను తెప్పించుకున్న మాణికం ఠాగూర్

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై కాంగ్రెస్ అధిష్టానం గుర్రుగా ఉంది.కారణం అయిన చాలాకాలంగా బీజేపీ పాట పడుతున్నారు . కాంగ్రెస్ లో అనేక కీలక పదవులు అనుభవించి కష్టకాలంలో పార్టీకి నష్టం చేసేవిధంగా వ్యవహరించడంపై అధిష్టానం ఆరాతీస్తున్నది .తనకు ఇష్టం లేకపోతె పార్టీ నుంచి వెళ్ళిపోవాలి కానీ పార్టీలో ఉంటూ ద్రోహం చేయడం సరికాదని అంటున్నది . బీజేపీ అధికారంలోకి వస్తుందని , కేసీఆర్ ఢీకొనే శక్తి బీజేపీకే ఉందని మాట్లాడటంపై వివరాలు సేకరిస్తుంది. పార్టీ నాయకత్వాన్ని తక్కువచేసి మాట్లాడటం మరో పార్టీ పేరు చెప్పి గొప్పపార్టీగా కీర్తించడం పై కూడా అధిష్టానం గుస్సాగా ఉంది. ఆయన సొంత నియోజకవర్గంలోని ఆయనకు దగ్గరగా ఉన్న నేతలు ఆయన బీజేపీ పాతపాడటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు . కుటుంబసభ్యులు సైతం కాంగ్రెస్ ను వీడేందుకు అంగీకరించడంలేదని వార్తలు వస్తున్నాయి. అందువల్లనే తాను చేరదల్చుకున్న పార్టీ గొప్పతనాన్ని వల్లవేయడంపై అభ్యంతరాలు ఉన్నాయి.

తెలంగాణలో కేసీఆర్ ను ఓడించే సత్తా కేవలం బీజేపీకి మాత్రమే ఉందని కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశానని… అయితే మర్యాదపూర్వకంగానే ఆయనను కలిశానని చెప్పారు. మరోవైపు బీజేపీకి అనుకూలంగా కోమటిరెడ్డి మాట్లాడుతుండటంతో కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్ గా ఉంది. కోమటిరెడ్డి వ్యవహారం గురించి అధిష్టానం అలర్ట్ అయి ఆరా తీస్తోంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాగూర్ రంగంలోకి దిగారు. రాజగోపాల్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడిన వీడియో క్లిప్లింగ్ లను ఠాగూర్ తెప్పించుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి, పార్టీపై సాగర్ ఉప ఎన్నిక సమయంలో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల క్లిప్పింగ్స్ ను కూడా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి అంశం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

రాజగోపాల్ రెడ్డిని కలిసిన భట్టి .. తొందరపడవద్దు ,రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్సే…

రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కలిశారు . దాదాపు గంటకు పైగా వీరి భేటీ జరిగింది.. ఇటీవల అమిత్ షా ను కలవడం తరువాత టీఆర్ యస్ ను ఢీకొనే సత్తా ఉన్న పార్టీ బీజేపీనే అని చెప్పడం పై పార్టీ వైఖరిని భట్టి వివరించారు . కాంగ్రెస్ పార్టీ కుటుంబంగా ఉన్న కోమటిరెడ్డి కుటుంబం ఇలా పార్టీ మారడం సరైందికాదని భట్టి హితవు పలికారు . రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ పార్టీనే అని అందువల్ల తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని కోరినట్లు సమాచారం

Related posts

సహారా, ఈఎస్ఐ కేసుల్లో కేసీఆర్ పాత్ర కేసీఆర్ జైలుకు వెళ్లకతప్పదు …బండి సంజయ్

Drukpadam

జగన్ రెండేళ్లలో జనరంజక పాలన అందించారు :అంబటి…

Drukpadam

పెట్రోల్ ధరను తగ్గించిన సీఎం స్టాలిన్…

Drukpadam

Leave a Comment