టీత్వరలో టీఆర్ యస్ నుంచి బీజేపీ లోకి భారీగా చేరికలు : ఈటల
ఆర్ఎస్ నేతలు టచ్ లో ఉన్నారు.. ఈ నెల 27 తర్వాత చేరికలు పుంజుకుంటాయి
- తమ పోరాటం కేసీఆర్ తోనేననీ, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కాదన్న ఈటల
- ఇప్పుడు మంచి రోజులు లేవని, అందుకే పార్టీలోకి ఎవరినీ తీసుకోలేదని వివరణ
- తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్న రాజేందర్
తమ టార్గెట్ సీఎం కేసీఆరే…మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో తమకు పంచాయతీ లేదు …కేసీఆర్ అహంకారవైఖరిపై అనేకమందికి ఉన్న అభిప్రాయాలూ బయటకు చెప్పలేక పోతున్నారు . సమయం వచ్చినప్పుడు తప్పకుండ చెపుతారు. అనేకమంది టీఆర్ యస్ నేతలు తమతో టచ్ లో ఉన్నారు . వారు ఎన్నికల ముందు వరకు టీఆర్ యస్ లు ఉంటారు . తరవాత పెద్ద ఎత్తున బయటికి వస్తారు అని మాజీమంత్రి బీజేపీ నేత ఈటల అభిప్రాయపడుతున్నారు
టీఆర్ఎస్ కు చెందిన ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తమ పోరాటం కేవలం కేసీఆర్ తో మాత్రమేనని… టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో కాదని అన్నారు. కేసీఆర్ అహంకారాన్ని అందరికంటే ముందు తాను ఎదిరించానని… ఇప్పుడు తన బాటలో నడిచేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందు వల్ల… ఇప్పుడే టీఆర్ఎస్ నుంచి బయటకు వస్తే నియోజకవర్గంలో అభివృద్ధికి ఆటంకం కలుగుతుందనే కారణం వల్ల వారు బహిర్గతం కాలేకపోతున్నారని అన్నారు.
టీఆర్ఎస్ పార్టీలోని సహచరులతో తనకు 20 ఏళ్ల అనుబంధం ఉందని… ప్రతి ఒక్కరూ తనతో టచ్ లో ఉన్నారని ఈటల చెప్పారు. కాంగ్రెస్ పార్టీవి మాటలే తప్ప, కేసీఆర్ ను ఎదుర్కొనే సత్తా ఆ పార్టీకి లేదని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరవచ్చని అభిప్రాయపడ్డారు. బీజేపీ అధిష్ఠానం ఆదేశిస్తే కేసీఆర్ పై పోటీ చేసి… ఆయనను ఓడిస్తానని ధీమా వ్యక్తం చేశారు.