Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యూయూ లలిత్…

సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యూయూ లలిత్…
సీజేఐగా ప్రమాణస్వీకారం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
74 రోజుల పాటు సీజేఐగా బాధ్యతలను నిర్వర్తించనున్న జస్టిస్ లలిత్

సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా ఉదయ్ ఉమేశ్ లలిత్ (యూయూ లలిత్) నేడు ప్రమాణస్వీకారం చేశారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ యూయూ లలిత్ చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు కేంద్రంలోని పెద్దలు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ప్రస్తుత జడ్జిలు హాజరయ్యారు.

సీజేఐ యూయూ లలిత్ 1957 నవంబర్ 9న మహారాష్ట్రలోని షోలాపూర్ లో జన్మించారు. ఆయన వయసు 64 సంవత్సరాలు. 2014 ఆగస్ట్ 13న ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. న్యాయవాది నుంచి సుప్రీంకోర్టు జడ్జిగా నేరుగా నియమితులైన అతికొద్దిమందిలో ఆయనొకరు. మరోవైపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యూయూ లలిత్ అతి కొద్ది కాలం మాత్రమే బాధ్యతలను నిర్వహించనున్నారు. కేవలం 74 రోజుల్లోనే ఆయన పదవీ కాలం ముగియనుంది.
యూ యూ లలిత్ కుటుంబం కూడా న్యాయవాద వృత్తినే చేసింది. లలిత్ ,తండ్రి కూడా అటు స్వాతంత్ర ఉద్యమంలోనూ ఇటు న్యాయ వ్యవస్థలోనూ కీలకంగా వ్యవహరించారు . లలిత్ భార్య నోవిడా లో స్కూల్ నడుపుతుండగా , ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు . ఆయన తండ్రి (90 ) ఇప్పటికి జీవించే ఉన్నారు . మహారాష్ట్ర లోని షోలాపూర్ కు చెందిన లలిత్ ఢిల్లీకి మకాం మార్చారు . 2014 లో సుప్రీం కోర్ట్ జడ్జిగా నియమితులైన లలిత్ అనేక కీలక తీర్పుల్లో భాగస్వామి గా ఉన్నారు .

Related posts

మహారాష్ట్ర మాజీ హోంమంత్రికి అరదండాలు…

Drukpadam

సోనూసూద్ మరో వేదిక ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు…

Drukpadam

ఆ ఖాళీ స్థలంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం!: సీఎం రేవంత్ రెడ్డి

Ram Narayana

Leave a Comment