Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాలంటూ రాహుల్ గాంధీపై ఒత్తిడి తెస్తాం: మల్లికార్జున ఖర్గే…

కాంగ్రెస్ పగ్గాలు చేపట్టాలంటూ రాహుల్ గాంధీపై ఒత్తిడి తెస్తాం:  ఖర్గే…
-2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర వైఫల్యం
-పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా
-తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్న సోనియా
-రాహుల్ వైపే చూస్తున్న కొందరు నేతలు

పార్టీ అధ్యక్ష భాద్యతలు చేపట్టాలంటూ రాహుల్ పై వత్తిడి …ఇప్పటికే అనేకమార్లు చెప్పాము …ఇక వత్తిడి తేవడం మినహా మార్గంలేదు … అని పార్టీ సీనియర్ నేత రాజ్యసభలో పార్టీ నాయకుడు మల్లిఖార్జున ఖర్గే స్పష్టం చేశారు . పార్టీని ప్రస్తుత తరుణంలో ఆయనకు ముంచి నడిపించగలిగిన నాయకుడు లేరని అన్నారు .

గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో పార్టీ అధ్యక్ష పదవి నుంచి రాహుల్ గాంధీ స్వచ్ఛందంగా వైదొలగడం తెలిసిందే. ఆ తర్వాత పార్టీ సీనియర్ నేతలు కోరినా మళ్లీ ఏఐసీసీ పగ్గాలు అందుకునేందుకు రాహుల్ ముందుకు రాలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో సోనియా గాంధీనే తాత్కాలిక అధ్యక్షురాలిగా పార్టీ బాధ్యతలు మోస్తున్నారు. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మల్లికార్జున ఖర్గే స్పందించారు.

పార్టీ బరువు బాధ్యతలు మోసేందుకు రాహుల్ ను మించి పాన్ ఇండియా స్థాయి ఉన్న నేత కాంగ్రెస్ లో లేరని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా మళ్లీ పగ్గాలు అందుకోవాలంటూ ఆయనపై ఒత్తిడి తీసుకువస్తామని వెల్లడించారు.

“కాంగ్రెస్ పార్టీని నడిపించాలని ఎవరైనా భావిస్తుంటే వారు దేశం మొత్తానికి తెలిసిన వ్యక్తి అయివుండాలి. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు, పశ్చిమ బెంగాల్ నుంచి గుజరాత్ వరకు మద్దతు అందుకోగలిగి ఉండాలి. మంచి గుర్తింపు కలిగి ఉండి, పార్టీలో ఎవరూ అభ్యంతరపెట్టని వ్యక్తి అయివుండాలి.

కానీ, కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి స్థాయి ఉన్న నేత రాహుల్ తప్ప మరెవరూ లేరు. కాంగ్రెస్ భవిష్యత్తు కోసం, దేశ భవిష్యత్తు కోసం పార్టీ నాయకత్వాన్ని చేపట్టాలంటూ రాహుల్ ను అడుగుతాం, అర్థిస్తాం, ఒత్తిడి చేస్తాం… ఆర్ఎస్ఎస్-బీజేపీపై పోరాటం సాగించి దేశాన్ని ఐక్యంగా ఉంచేందుకు పార్టీ అధ్యక్షుడిగా మళ్లీ రావాలని విజ్ఞప్తి చేస్తాం… ఆయన వెనుక మేముంటాం” అని మల్లికార్జున ఖర్గే వివరించారు.

Related posts

ఉత్తర కొరియాలో ఆకలి చావులు నమోదు అయ్యే అవకాశం …మానవ హక్కుల విభాగం నివేదిక!

Drukpadam

ఢిల్లీలో ముగిసిన మౌనదీక్ష.. కేసీఆర్ పై బండి సంజయ్ ఫైర్!

Drukpadam

విజయమ్మ, షర్మిల ప్రాణాలకు ముప్పు … డీఎల్ డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Drukpadam

Leave a Comment