Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పేదలకు ఉపాధి లేకుండా చేసే కుట్ర …కేంద్రంపై వ్యవసాయ కార్మికసంఘ నేత బి.వెంకట్ ధ్వజం…

పేదలకు ఉపాధి లేకుండా చేసే కుట్ర …కేంద్రంపై వ్యవసాయ కార్మికసంఘ నేత బి.వెంకట్ ధ్వజం…
నల్ల చట్టాలు అందుకే తెచ్చారు
వ్యవసాయం మీద ఆధారపడి దేశంలో 80 కోట్లమంది జీవిస్తున్నారు
కేంద్రం తన వైఖరి మార్చుకోకపోతే ప్రజలే మార్చుతారని హెచ్చరిక
నవంబర్ 4 నుంచి 6 తేదీవరకు రాష్ట్ర వ్యవసాయ కార్మికసంఘం సభలు

 

వ్యవసాయ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి 2022 ఆగస్టు 28 ఖమ్మం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నవంబర్ 4 5 6 తేదీల్లో జరిగే తెలంగాణ రాష్ట్ర మూడవ మహాసభల నిర్వహణ కోసం సన్నాహక సమావేశం పొన్న వెంకటేశ్వర అధ్యక్షతన ఖమ్మం మంచి కంటి మీటింగ్ హాల్లో జరిగింది సంఘం ఆలిండియా కార్యదర్శి బి వెంకట్ గారు మాట్లాడుతూ దేశంలో 80 కోట్ల మంది ఆధారపడి వ్యవసాయం మీద ఉపాధి పొందుతున్నారని ఆ వ్యవసాయాన్ని లేకుండా కార్పోరేట్లకు కట్టబెట్టాలని నేటి బిజెపి కేంద్ర ప్రభుత్వం మూడు నల్ల చట్టాలను తెచ్చి రైతులను వ్యవసాయ కార్మికులను తీవ్ర ఇబ్బందుల గురిచేసిందని ఆయన అన్నారు తీవ్ర పోరాట ఫలితంగా చట్టాలను తాత్కాలికంగా రద్దు చేసిన వాటిని మళ్లీ తెచ్చే ప్రమాదం ఉందని ఆయన అన్నారు ఈ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మికుల్ని రైతులని పేదల్ని సమీకరించి ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు బిజెపి అధికారంలోకి వచ్చాక వ్యవసాయాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టాలని ఉన్న ఉపాధిని కూడా లేకుండా చేయాలని చూస్తున్నదని ఆయన అన్నారు అనేక పోరాటాల ఫలితంగా తిండైనా పెట్టండి పనైనా చూపండి అని 2005లో సాధించిన ఉపాధి హామీ చట్టాన్ని బిజెపి అధికారంలోకి వచ్చాక ఏటేటా నిధులు తగ్గిస్తూ అనేక షరతులను తెచ్చి కుల విభజనలు తెచ్చి ఉపాధి పని లేకుండా చేయడం కోసం ప్రయత్నిస్తుందని ఉపాధి పనిని కాపాడుకోవాలని దానికి దేశ రాష్ట్ర మహాసభలు వేదిక కావాలన్నారు ప్రజా పంపిణీ వ్యవస్థను 77 కోసం వన్ రేషన్ వన్ కార్డు పేరుతో కేంద్ర ప్రభుత్వం నేడు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ షాపుల ద్వారా ఇస్తున్న వాటిని కూడా నియంత్రించి తన గుత్తాధిపత్యాన్ని చాటుకోవాలని ప్రజా పంపిణీ వ్యవస్థనే లేకుండా చేసి నగదు బదిలీ ద్వారా పేదలను మోసం చేయడానికి ప్రయత్నిస్తుందని ప్రజా పంపిణీ వ్యవస్థను కాపాడుకోవడానికి సంఘం ఐక్య పోరాటాలను చేయాలన్నారు మరొక ముఖ్య అతిథి ఎమ్మెల్సీ గారు అలుగుబెల్లి నర్సిరెడ్డి గారు మాట్లాడుతూ 1966 లోనే కొఠారి కమిషన్ రిపోర్టు కామన్ స్కూల్స్ కామన్ సిలబస్ ప్రజలందరికీ ఉండాలని చెప్పిన నేటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విద్యను పేదలకు అందించడంలో చిత్తశుద్ధి లేదన్నారు నేడు అనేకమంది వ్యవసాయ కార్మికుల పిల్లలు ప్రైవేట్ స్కూల్స్లో ఫీజులు కట్టలేక ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు లేక విద్యకు దూరం అవుతున్నారని ఆయన అన్నారు నేటి విద్యా విధానాన్ని రక్షించుకోవడానికి వ్యవసాయ కార్మికులు గ్రామీణ ఉపాధ్యాయులు ఐక్యంగా ప్రభుత్వాల మీద ఒత్తిడి చేయాలని వివిధ డిపార్ట్మెంట్లో 27% ఖాళీ ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయుటకు ఐక్యంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు నేడు పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో యాజమాన్య కమిటీలలో పిల్లల తల్లిదండ్రులను భాగస్వాములు చేయటం ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయించాలని ఆయన అన్నారు విద్య ప్రైవేటీకరణ పెరగటం వలన సామాన్య విద్యార్థులు విద్యకు ఉద్యోగాలకు దూరమవుతున్నారని రోజురోజుకు తెలంగాణలో ప్రైవేటు విద్య పెరుగుతుందని ప్రభుత్వ విద్య తగ్గుతుందని ఆయన విమర్శించారు కొఠారీ కమిషన్ సిఫారసులను అమలు చేయడం ద్వారా సమానత్వాన్ని సాధించాలని ఆయన అన్నారు సంఘం రాష్ట్ర కార్యదర్శి రాగి వెంకట్ రాములు మాట్లాడుతూ కూలి భూమి ఉపాధి సంక్షేమ పథకాల రక్షణ కోసం రానున్న కాలంలో పోరాటాలు నిర్వహించడానికి ఖమ్మంలో నవంబర్ మొదటివారంలో జరిగే మహాసభలు బయలురాయిగా మిగలరని ఆయన పిలుపునిచ్చారు రాష్ట్రంలో అనేకమంది పేదలు ఇండ్లు లేక ఇళ్ల స్థలాలు లేక సాగుభూములు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణలో ఒక కోటి 50 లక్షల ఎకరాల భూములు ఉన్నా వాటిని బయటకు
తీసి పేదలకు ఇవ్వడంలో ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లోపించిందని ఆయన విమర్శించారు ఇళ్ల స్థలాల కోసం గత సంవత్సర కాలంగా పోరాటాల నిర్వహిస్తున్న పాలకులు పరిష్కారానికి సహకరించడం లేదని తక్షణం అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ పోరు సాగుదారులందరికీ పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు పై డిమాండ్ల సాధన కోసం ఐక్య పోరాటాల నిర్వహణకు కృషి చేస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు రాష్ట్ర ఉపాధ్యక్షులు నున్న నాగేశ్వరరావు సిఐటియు రాష్ట్ర నాయకులు ఎర్ర శ్రీకాంత్ సిఐటియు జిల్లా కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వర్లు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు 5వ జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి గారు గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి భూక్య వీరభద్రం గారు యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు గారు యుటిఎఫ్ రాష్ట్ర నాయకురాలు దుర్గాభవాని గారు గొర్రె మేకల సంఘం జిల్లా అధ్యక్షులు చంద్ర చెరువు కోటేశ్వరావు గారు సోషల్ మీడియా జిల్లా బాధ్యులు వై విక్రమ్ గారు కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి నందిపాటి మనోహర్ గారు డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీర్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వి మధు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు సత్యనారాయణ సంఘం జిల్లా ఆఫీస్ బేరర్స్ తదితరులు పాల్గొన్నారు

Related posts

పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఉపేక్షించేది లేదు: బాలినేని

Drukpadam

కేసీఆర్ పై మరోసారి విమర్శలు గుప్పించిన వైయస్ షర్మిల

Drukpadam

ఏపీ సీఎం జ‌గ‌న్‌తో ఎంపీ మార్గాని భ‌ర‌త్ తండ్రి భేటీ!..!

Drukpadam

Leave a Comment