Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

నిన్నటి మ్యాచ్ లో త్రివర్ణ పతాకాన్ని తీసుకునేందుకు జై షా నిరాకరించడంపై విమర్శలు …

నిన్నటి మ్యాచ్ లో త్రివర్ణ పతాకాన్ని తీసుకునేందుకు జై షా నిరాకరించడంపై ప్రకాశ్ రాజ్ స్పందన

  • నిన్న ఆసియా కప్ లో భారత్ వర్సెస్ పాకిస్థాన్
  • విజయం సాధించిన భారత్
  • త్రివర్ణ పతాకాన్ని జై షాకు ఇవ్వబోయిన వ్యక్తి
  • సున్నితంగా తిరస్కరించిన జై షా
ఆసియా కప్ లో భాగంగా నిన్న టీమిండియా, పాకిస్థాన్ జట్ల మధ్య రసవత్తర పోరు సాగింది. ఈ మ్యాచ్ కు బీసీసీఐ కార్యదర్శి జై షా (అమిత్ షా తనయుడు) కూడా విచ్చేశారు. యూఏఈ క్రికెట్ పెద్దలు, ఇతర ప్రముఖులతో కలిసి మ్యాచ్ ను వీక్షించారు. అయితే, మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించగా, గ్యాలరీలో ఉన్న ఓ వ్యక్తి జై షాకు త్రివర్ణ పతాకాన్ని అందించే ప్రయత్నం చేశారు. అయితే, జాతీయ జెండాను చేతిలోకి తీసుకునేందుకు జై షా నిరాకరించారు. ఈ దృశ్యాలతో కూడిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

దీనిపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. “ప్రియమైన మహానేత, హోంమంత్రి… జై షా తన దేశభక్తిని నిరూపించుకోవడానికి జాతీయ జెండాను చేతిలోకి తీసుకుని ఊపేందుకు నిరాకరించారు. ఒకవేళ బీజేపీయేతర వ్యక్తో, హిందుయేతరుడో, నాలాగా మిమ్మల్ని ప్రశ్నించేవాడో ఇలాగే చేసుంటే మీరు, మీ బీజేపీ భక్తులు ఎలా స్పందించేవారు?” అంటూ ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు.

Related posts

భారీ నష్టాల్లో హైదరాబాద్ మెట్రో…రూ.13,600 కోట్ల సమీకరణకు చర్యలు!

Drukpadam

ఢిల్లీ హైకోర్టు తీర్పుపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు!

Drukpadam

ఆక్సిజన్ అందించటంలో నిర్లక్ష్యం పై ఢిల్లీ హైకోర్టు సీరియస్

Drukpadam

Leave a Comment