Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బీజేపీ ముక్తు భారత్ లక్ష్యంగా ప్రతిపక్షాల ఐక్యతకు కృషి : పాట్నా లో కేసీఆర్

బీజేపీ ముక్తు భారత్ లక్ష్యంగా ప్రతిపక్షాల ఐక్యతకు కృషి : పాట్నా లో కేసీఆర్
-బీజేపీ దేశానికి ఏమిచేసిందో చెప్పాలి
-అన్ని వ్యవస్తలను నిర్వీర్యం చేసింది
-భూములను కార్పురేట్లకు అప్పగించేందుకు కుట్ర జరుగుతుంది
-గుజరాత్ మోడల్ అనేది విఫలం
-రాష్ట్రాల హక్కులను హరిస్తుంది.
-ధరలు పెంచడం మినహా చేసింది ఏమి లేదు
-నాయకత్వం అనేది ఇప్పుడు నిర్ణయించేది కాదు
-నాయకత్వం పై ఆందోళన అవసరం లేదు

బీజేపీ ముక్తు భారత్ లక్ష్యంగా ప్రతిపక్షాల ఐక్యతకు కృషి చేస్తామని పాట్నా లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు . అమర జవాన్లకు తెలంగాణ ప్రభుత్వం తరుపున చెక్కుల పంపిణీకి వచ్చిన సందర్భంగా బీహార్ సీఎం నితీష్ కుమార్ , డిప్యూటీ సీఎం తేజశ్వని యాదవ్ తో కలిసి పాల్గొన్న కేసీఆర్ దేశంలో గత ఎనిమిది సంవత్సరాలుగా బీజేపీ అవలంబిస్తున్న విధానాలపై తీవ్రస్వరంతో ధ్వజమెత్తారు . మీడియా ప్రతినిధులు అడిగిన అనేక ప్రశ్నలకు కేసీఆర్ ఓపికగా సమాదానాలు ఇచ్చారు ….ఈ సందర్భంగా బీజేపీ దేశానికి ఏమిచేసిందో చెప్పాలని కేసీఆర్ డిమాండ్ చేశారు .బీజేపీ ప్రభుత్వం వచ్చిన తరువాత అన్ని వ్యవస్తలను నిర్వీర్యం చేసిందని విమర్శలు గుప్పించారు . రెండు రోజుల క్రితమే హైద్రాబాద్ లో జరిగిన దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన రైతు సంఘాల నాయకులతో నిర్వహించిన సమావేశ వివరాలను వెల్లడించారు . …భూములను కార్పురేట్లకు అప్పగించేందుకు కేంద్ర బీజేపీ కుట్ర చేస్తుందని దుయ్యబట్టారు . …గుజరాత్ మోడల్ అనేది దబ్బకుంటున్నారని అది విఫలం అయినా ప్రయోగమని మండిపడ్డారు . …
రాష్ట్రాల అధికారుల్లో జోక్యం చేసుకుంటూ రాష్ట్రాల హక్కులను హరిస్తుందని విమర్శించారు .
గత కొన్ని సంవత్సరాలుగా ధరలు పెంచడం మినహా బీజేపీ చేసింది ఏమి లేదని అన్నారు .

థర్డ్ ఫ్రంట్ కు ఉందా? అని విలేకర్లు ప్రశ్నించగా థర్డ్ ఫ్రంట్ అనేది లేదు మేము ఎక్కడ థర్డ్ ఫ్రంట్ గురించి చెప్పలేదు … మెయిన్ ఫ్రంట్ అనేదే చెబుతున్నాం … కలిసి వచ్చే వాళ్ళందరిని బీజేపీ వ్యతిరేకంగా కలుపుకు పోతాం అని స్పష్టం చేశారు . నాయకుడు ఎవరు అని మీడియా అడగ్గా …నాయకత్వం అనేది ఇప్పుడు నిర్ణయించేది కాదు అందరం కూర్చుని మాట్లాడటం అని అన్నారు . నితిష్ దేశంలో మంచి పేరు ఉన్న నేత అనికూడా కేసీఆర్ కితాబు నిచ్చారు .

దేశంలో ప్రతిపక్ష నేతలపై సిబిఐ ,ఈడీ ఇతర ఏజన్సీ లతో దాడులు చేయిస్తున్నారు . ఇది మంచిది కాదు . శాంతి భద్రతలు అనేది రాష్ట్ర పరిధిలోనిది అందులో కూడా కేంద్ర జోక్యం చేసుకొని రాష్ట్రాల అధికారాలను తగ్గించే ప్రయత్నం చేస్తుందని బీజేపీపై పై కేసీఆర్ ఫైర్ అయ్యారు .

Related posts

కొనసాగుతున్న రఘురామ రచ్చ …

Drukpadam

పంజాబ్ సీఎం అభ్యర్థిగా చరణ్ జిత్ చన్నీ… రాహుల్ గాంధీ ప్రకటన

Drukpadam

వచ్చే ఎన్నికల్లో జగన్ సీట్ల సంఖ్య 15 నా ?51 నా ?? లోకేష్ సంచలన వ్యాఖ్యలు …!

Drukpadam

Leave a Comment