Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

టీడీపీ ఎన్డీఏలో చేరికపై స్పందించిన చంద్రబాబు ,ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ …

ఎన్డీయేలో టీడీపీ చేరబోతోందనే వార్తలపై చంద్రబాబు స్పందన!

  • ఈ ప్రచారం చేస్తున్న వారే సమాధానం చెప్పాలన్న చంద్రబాబు
  • దీనిపై ప్రస్తుతం తాను స్పందించనన్న టీడీపీ అధినేత
  • రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆనాడు ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని వ్యాఖ్య

త్వరలోనే ఎన్డీయేలో టీడీపీ చేరబోతోందనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఇదే అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబును మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఆయన ఆసక్తికర సమాధానాన్ని ఇచ్చారు. ఎన్డీయేలో టీడీపీ చేరబోతోందని చెపుతున్న వారినే ఈ ప్రశ్న అడగాలని ఆయన అన్నారు. ప్రచారం చేస్తున్న వారే దీనికి సమాధానం చెప్పాలని అన్నారు. తానైతే ప్రస్తుతం దీనిపై స్పందించనని చెప్పారు.

రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన దానికంటే… జగన్ పాలన వల్ల రాష్ట్రం ఎక్కువ నష్టపోతోందని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆనాడు ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోణంలోనే తాము కేంద్ర రాజకీయాలను చూస్తామని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పాలనపైనే ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల రెండు సార్లు నష్టపోయామని చెప్పారు. రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని వ్యక్తిగతంగా ఎంతో నష్టపోయామని తెలిపారు. దేశంలో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది టీడీపీనే అని చెప్పారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలను రెట్టింపు చేస్తామని అన్నారు.

ఎన్డీయేలోకి టీడీపీ అంటూ ప్రచారం… స్పందించిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్

BJP leader Lakshman responds on speculations of TDP alliance with NDA
బీజేపీ ఎంపీ, పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఎన్డీయేలోకి టీడీపీ అంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. అది కేవలం ప్రచారం మాత్రమేనని అన్నారు. ఎన్డీయేలోకి టీడీపీ అంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఏపీలో బీజేపీ భాగస్వామి జనసేన అని స్పష్టం చేశారు. తాము ఏపీలో జనసేనతోనే కలిసి పోటీ చేస్తామని వెల్లడించారు. ఒకవేళ టీడీపీతో భాగస్వామ్యం కుదిరితే ఆ విషయం అందరికీ తెలియజేస్తామని లక్ష్మణ్ అన్నారు. ఏపీలో సీఎం జగన్ పట్ల ప్రజావ్యతిరేకత ఉందని, దీన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటామని చెప్పారు.

Related posts

ఖమ్మం మేయర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోట్ల మాధవి ?

Drukpadam

సీఎం సలహాదారుగా సోమేశ్ కుమార్ నియామకంపై భట్టి ఫైర్ …

Drukpadam

మోడీ పాలనలో మరోసారి దిగజారిన భారత్: సిపిఎం..

Drukpadam

Leave a Comment