Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

తెల్దారుపల్లి తమ్మినేని కృష్ణయ్య హత్య కేసు… కోర్ట్ లో లొంగిపోయిన కోటేశ్వర్ రావు!

తెల్దారుపల్లి తమ్మినేని కృష్ణయ్య హత్య కేసు… కోర్ట్ లో లొంగిపోయిన కోటేశ్వర్ రావు!

తెలంగాణలోనే సంచలనంగా మారిన ఖమ్మం రూరల్ మండలం తెల్దార్ పల్లి కి చెందిన తమ్మినేని కృష్ణయ్య హత్యకేసులో ఏ 9 ఏ 10 గా ఉన్న తమ్మినేని కోటేశ్వర్ రావు , ఎల్లంపల్లి నాగయ్య లు శుక్రవారం జిల్లా కోర్టులో లొంగిపోయారు .వారిని 14 రోజులు రిమాండ్ కు మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీచేశారు . దీంతో వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ నుంచి ఖమ్మం జైలుకు తరలించారు . అంతకు ముందే హత్య జరిగిన మూడు,నాలుగు రోజులకే 8 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్ట్ లో ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే …

కృష్ణయ్య హత్య తరువాత కనిపించకుండా పోయిన కోటేశ్వర్ రావు , నాగయ్య లను అరెస్ట్ చేయాలనే డిమాండ్ బలంగా ఉంది .దీనికి కారణం లేకపోలేదు .తెల్దారుపల్లి గ్రామం తెలంగాణ రాష్ట్ర సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్వగ్రామం కావడం …హత్యకు పథక రచన చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కోటేశ్వర్ రావు ,తమ్మినేని వీరభద్రంకు స్వయానా తమ్ముడు కావడంతో రాష్ట్రం చూపంతా కృష్ణయ్య హత్య విషయం పై ఫోకస్ పెట్టడంతో ప్రాధాన్యత సంతరించుకుంది . కృష్ణయ్య, మాజీమంత్రి టీఆర్ యస్ కు చెందిన తుమ్మల నాగేశ్వరరావు కు సన్నిహితులుగా ఉన్నారు . దీంతో ఆయన కృష్ణయ్య హత్యపై తీవ్రంగా స్పందించారు . సిపిఎం తో సహా అన్ని పార్టీలు క్రిష్ణయ్య హత్యను ఖండించాయి. బీజేపీ కేంద్ర మంత్రి సైతం తెల్దారుపల్లి వెళ్లి కృష్ణయ్య కుటుంబసభ్యులను కలిసి సంతాపం తెలిపి సానుభూతి ప్రకటించారు . కాంగ్రెస్ నాయకురాలు కేంద్ర మాజీమంత్రి రేణుకాచౌదరి కూడా కృష్ణయ్య కుటుంబసభ్యులను పరామర్శించి హత్య రాజకీయాలను ఖండించారు .దోషులకు శిక్షలు పడాలని అన్నారు . టీఆర్ యస్ నాయకులూ ఎంపీలు ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు కృష్ణయ్య హత్యను ను ఖండించారు . ఎంపీలు నామ నాగేశ్వరరావు , వద్దిరాజు రవి చంద్ర , ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్ రెడ్డి ,సండ్ర వెంకట వీరయ్య టీఆర్ యస్ జిల్లా అధ్యక్షులు , ఎమ్మెల్సీ తాతా మధు లు కృష్ణయ్య కుటుంబసభ్యులను కలిసి తమ సానుభూతి ప్రకటించారు.

మునుగోడు ఎన్నిక … కృష్ణయ్య హత్యకు లింకు ఉందా?

మునుగోడు లో ఉప ఎన్నికకు తెల్దారుపల్లిలో టీఆర్ యస్ నాయకుడు తమ్మినేని కృష్ణయ్య హత్యకు లింకు ఉందా ? అంటే భిన్నమైన అభిప్రాయాలు వస్తున్నాయి. కమ్యూనిస్టులు మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇస్తారని లేకపోతె వారే పోటీచేయవచ్చునని అనుకున్నారు . కానీ అది జరగటంలేదు . బీజేపీ ఓటమి లక్ష్యంగా పనిచేసేందుకు సిద్దమైన సిపిఐ , సిపిఎం లు అక్కడ కాంగ్రెస్ కన్నా బలమైన పార్టీగా టీఆర్ యస్ ను గుర్తించాయి.

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీ లో చేరారు . తిరిగి అక్కడ నుంచి పోటీచేసి గెలవడం ద్వారా 2023 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు బాటలు వేయాలని బీజేపీ వేసిన మాస్టర్ ప్లాన్ లో రాజగోపాల్ రెడ్డి చిక్కుకున్నారని అందుకే మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం అయిందని అధికార టీఆర్ యస్ తో పాటు ఇతర పక్షాలు ఆరోపిస్తున్నాయి.
మునుగోడు లో కమ్యూనిస్ట్ లకు కొంత ఓటింగ్ ఉంది . కమ్యూనిస్టుల ఓట్లద్వారా మునుగోడు తమ ఖాతాలో వేసుకొని రాష్ట్రంలో టీఆర్ యస్ కు తిరుగులేదని అనిపించడం ద్వారా తిరిగి అధికారంలోకి రావచ్చునని టీఆర్ యస్ అధినేత కేసీఆర్ వ్యూహరచన చేశారు . దీంతో కమ్యూనిస్టుల సహకారం టీఆర్ యస్ కు అనివార్యమైంది. అయితే రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలనా సాగిస్తుందని నిన్నమొన్నటివరకు తెగ విమర్శలు గుప్పించిన కమ్యూనిస్టులు టీఆర్ యస్ కు మద్దతు ఇవ్వడంపై విమర్శలు లేకపోలేదు . వారి పార్టీలోని శ్రేణులు సైతం వారిని ప్రశ్నిస్తున్నాయనే అభిప్రాయాలూ ఉన్నాయి. తెల్దారుపల్లి లో జరిగిన కృష్ణయ్య హత్య కేసు వల్లనే టీఆర్ యస్ కు సిపిఎం మద్దతు ఇస్తుందనే విమర్శలు లేకపోలేదు . అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది . ఆలా అయితే సిపిఐ ఎందుకు మద్దతు ఇస్తుందనే చర్చకూడ లేకపోలేదు . ఇదే ఇషయాన్ని వారిని అడిగితె బీజేపీ కి వ్యతిరేకంగా గెలిచే పార్టీలకే మా మద్దతు ఉంటుందని చెబుతున్నాయి. ఇప్పుడు టీఆర్ యస్ కు ఇచ్చే మద్దతు శాశ్వితం కాదని కూడా బల్ల గుద్ది మరి చెబుతున్నాయి. తరవాత పరిణామాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడే చెప్పలేమని కూడా లెఫ్ట్ పార్టీల అంటున్నాయి.

Related posts

ఫేక్ సర్టిఫికేట్ వివాదం నేపథ్యంలో ప్రొబేషనరీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ శిక్షణ రద్దు

Ram Narayana

హైదరాబాద్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టివేత… నెల్లూరువాసుల అరెస్ట్

Ram Narayana

జార్ఖండ్‌ అడ‌వుల్లో తుపాకుల మోత…ఒక జవాన్ మృతి …మరొకరికి సీరియస్….

Ram Narayana

Leave a Comment