Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఎన్నికలకు ముందే మూడు రాజధానుల ఏర్పాటు: మంత్రి గుడివాడ అమర్‌నాథ్!

చంద్రబాబు, లోకేశ్‌ను జైలుకు పంపాలి.. ఎన్నికలకు ముందే మూడు రాజధానుల ఏర్పాటు: మంత్రి గుడివాడ అమర్‌నాథ్

  • చంద్రబాబు, లోకేశ్ శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడుతున్నారన్న మంత్రి
  • రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ ఫైర్
  • టీడీపీ నేతలు, చంద్రబాబును రాష్ట్రం నుంచి వెళ్లగొట్టాలన్న మంత్రి

ఏపీలో అధికార వైఎస్సార్ పార్టీ , ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం ఆశక్తి కరంగా మారింది.
రాష్ట్ర అభివృద్ధికి టీడీపీ అడ్డుపడుతోందని వైయస్సార్ కాంగ్రెస్ ఆరోపిస్తుండగా లేదు లేదు …జగన్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిలో విఫలమైందని టీడీపీ విమర్శలు గుప్పిస్తుంది. ఇది నిరంతర ప్రక్రియగా మారింది. ప్రజలను అయోమయానికి గురిచేస్తుంది. ప్రభుత్వం మొత్తం తప్పులే చేస్తున్నట్లు టీడీపీ , ప్రతిపక్షాలు నిత్యం అబద్దాలే మాట్లాడుతున్నాయని అధికార పార్టీ పరస్పర విమర్శలపై విశ్లేషకులు సైతం ముక్కుమీద వేలువేసుకుంటున్నారు. గత మూడు సంవత్సరాల జగన్ ప్రభుత్వంపై నిత్యం విమర్శలతోనే టీడీపీ కాలం గడుపుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి. పైగా రాష్ట్రానికి కేంద్రం ఇటీవల బల్క్ డ్రగ్స్ పరిశ్రమ మంజూరి చేయగా దాన్ని ఇవ్వద్దని టీడీపీ కేంద్రానికి లేఖ రాయడంపై జగన్ సర్కార్ మండి పడుతుంది.

రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడుతున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేశ్‌లను జైలుకు పంపాలని ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. నిన్న విశాఖలో మీడియాతో చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన హామీలను కేంద్రానికి తాకట్టుపెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని విమర్శించారు. రాష్ట్రానికి అప్పులు ఇవ్వొద్దంటూ రిజర్వు బ్యాంకుకు టీడీపీ నేతలు  లేఖలు రాశారని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

త్వరలో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో మూడు రాజధానులపై చర్చించే అవకాశం ఉందని మంత్రి అన్నారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని తామెక్కడా చెప్పలేదని, అయినా 90 శాతానికిపైగా హామీలు అమలు చేశామన్నారు. మిగతా వాటిని కూడా పూర్తి చేస్తామన్నారు. బల్క్ డ్రగ్ ప్రాజెక్టు రాష్ట్రానికి వస్తుంటే వద్దంటూ టీడీపీ నేత యనమల కేంద్రానికి లేఖ రాయడం విడ్డూరంగా ఉందని అన్నారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్న టీడీపీ నేతలు, చంద్రబాబును రాష్ట్రం నుంచి వెళ్లగొట్టాలని మంత్రి అమర్‌నాథ్ అన్నారు.

Related posts

బీజేపీ కి సవాల్ గా మారనున్న రాష్ట్రపతి ఎన్నిక…

Drukpadam

2024లో మంగళగిరిలో టీడీపీని గెలిపించి కానుకగా ఇస్తా: నారా లోకేశ్!

Drukpadam

ఎంపీగానే కొనసాగాలని అఖిలేశ్ యాదవ్ అనూహ్య నిర్ణయం!

Drukpadam

Leave a Comment