Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని!

సీపీఐ తెలంగాణ కార్యదర్శిగా కూనంనేని ఎన్నిక!
-పల్లాకు – కూనంనేని మధ్య హోరాహోరీగా సాగిన పోరు
-జాతీయనాయకులు రంగంలోకి దిగినప్పటికీ కార్యదర్శి పదవికి తప్పని పోటీ
-8 వ తేదీ తెల్లవారు జామున సాంబశివరావు కార్యదర్శిగా ఎన్నికైనట్లు ఫలితం వెల్లడి
-కూనంనేని 59 పల్లాకు 44 ఓట్లు చెల్లని ఓట్లు ఐదు
-మెజార్టీ 15 ఓట్లు
-గతంలో కొత్తగూడెం ఎమ్మెల్యేగా పని చేసిన కూనంనేని

సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు ఎన్నికయ్యారు. శంషాబాద్ లో నిర్వహించిన సీపీఐ 3వ రాష్ట్ర మహాసభల్లో ఈ ఎన్నికకు సంబంధించి నిన్న అర్ధరాత్రి వరకు వాడీవేడి చర్చలు నడిచాయి. రాష్ట్ర కార్యదర్శి పదవికి కూనంనేని సాంబశివరావు, పల్లా వెంకట్ రెడ్డి పోటీ పడ్డారు. ఎన్నిక ఏకగ్రీవం కావడానికి కీలక నేతలు ప్రయత్నించినప్పటికీ ఇద్దరూ పట్టు విడవలేదు. దీంతో, ఓటింగ్ నిర్వహించారు. ఎన్నికలో కూనంనేనికి 59, పల్లాకు 45 ఓట్లు పడ్డాయి. దీంతో, కూనంనేని గెలుపొందినట్టు పార్టీ వర్గాలు ప్రకటించాయి. గతంలో కొత్తగూడెం ఎమ్మెల్యేగా కూనంనేని పని చేశారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా పని చేశారు. 

మరోవైపు, తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా చాడ వెంకట్ రెడ్డి రెండు సార్లు ఎన్నికయ్యారు. ఇప్పుడు మూడో సారి కూడా అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే, తన ఎన్నిక ఏకగ్రీవం కావాలని ఆయన పార్టీ శ్రేణులకు చెప్పారు. అయితే, ఈసారి అవకాశం తనకు ఇవ్వాలని కూనంనేని పట్టుబట్టడంతో… చాడ వెంకటరెడ్డి తన ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఈ క్రమంలో పల్లా వెంకటరెడ్డి తెరపైకి వచ్చారు. చివరకు కూనంనేని రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

 

గుంటూరు జిల్లా సంగుపాలెం కోడూరు గ్రామంలో జన్మించిన  కూనంనేని సాంబశివరావు విశాలాంధ్ర విలేకరిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బొగ్గుగనుల కేంద్ర కార్యాలయం ఉన్న కొత్తగూడెంకు వచ్చారు . విలేకరిగా ఉంటూనే ప్రజా ఉద్యమాలకు ఆకర్షితులైయ్యారు . తోడేటి కొమరయ్య స్పూర్తితో అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. కార్మిక , కర్షక , యువజన ,విద్యార్ధి ఉద్యమాలకు చుక్కానిగా నిలిచారు . ఆటో వర్కర్స్ యూనియన్ తరుపున జరిగిన ఆందోళనలో పాల్గొని జైలుకు వెళ్లారు . కొత్తగూడెం ప్రజల పక్షాన నిలిచే ఒక నాయకుడు దొరికాడని అక్కడ ప్రజలు భావించారు . దీంతో అంచలంచలుగా ఎదిగిన సాంబశివరావు , అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు .కొత్తగూడెం ఎంపీపీ గా , కొత్తగూడం ఎమ్మెల్యేగా సిపిఐ తరుపున ఎన్నికైయ్యారు . ఉమ్మడి ఖమ్మం జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన కూనంనేని జిల్లా ఉద్యమ విస్తరణలో తనకంటూ ఒక ప్రత్యేకత చాటుకున్నారు .

1984 లో కొత్తగూడెం పట్టణ సీపీఐ కార్యదర్శి గా ఎన్నికయ్యారు .1987 లో జరిగిన ఎన్నికల్లో కొత్తగూడెం ఎం పి పి గా ఎన్నికయ్యారు.2004 ఖమ్మంలో జరిగిన మహాసభలో అప్పటి ఖమ్మం జిల్లా కార్యదర్శి గా ఎన్నికయ్యారు 2007 లో తిరిగి కార్యదర్శి గా ఎన్నికైన సాంబశివరావు 2009 లో కొత్తగూడెం నుంచి శాసనసభ కు ఎన్నికయ్యారు శాసనసభ లో సీపీఐ పక్ష ఉప నాయకునిగా పనిచేశారు. హైదరాబాద్ లో జరిగిన సీపీఐ తెలంగాణ రాష్ట్ర రెండవ మహాసభలో సహాయ కార్యదర్శి గా ఎన్నికయ్యారు.


   
.

Related posts

పవన్ కళ్యాణ్ , లోకేష్ చర్యలపై మంత్రులు బొత్స , అనికుమార్ లు మండిపాటు!

Drukpadam

పట్టు -బెట్టు

Drukpadam

వంగవీటి రాధా-వల్లభనేని వంశీ భేటీ.. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్!

Drukpadam

Leave a Comment